Sign in

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: ఫ్యామిలీతో మలేషియా టూర్ ప్లాన్ చేసిన బాలు- రోహిణిపై కూపీ లాగిన మీనా- పూలగంప చోరీ

Gunde Ninda Gudi Gantalu Serial May 29th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ మే 29వ ఎపిసోడ్‌‌లో రోహిణి గురించి తెలిసేందుకు బాలు, మీనా డిటెక్టివ్స్‌గా మారి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. కామాక్షి, విద్య దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకదు. దాంతో పాస్‌పోర్ట్ కోసం అప్లై చేసేందుకు ఫామ్స్ తీసుకొస్తాడు బాలు.

Published on: May 29, 2026, 07:38:19 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో మనోజ్, రోహిణి వాళ్లు గుడికి వచ్చి సీసీ టీవీ ఫుటేజ్ పెండ్రైవ్ తీసుకెళ్లినట్లు మీనాకు చెబుతుంది సుమతి. అయితే, గుడి ఇంఛార్జ్‌ను మరోసారి ఆ ఫుటేజ్ అడగమని, పోలీసులకు ఇదివరకు ఇచ్చారు కాబట్టి తమకు కూడా ఇస్తారని మీనా అంటుంది.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ మే 29 ఎపిసోడ్
గుండె నిండా గుడి గంటలు సీరియల్ మే 29 ఎపిసోడ్

జైలు ఆఫీసర్ తెలుసట

దానికి సుమతి సరేనంటుంది. బాలు ఇంటికి వస్తాడు. రోహిణి, మనోజ్ గురించి మాట్లాడుకుంటారు. అప్పుడే మనోజ్ వస్తే మొన్న వచ్చిన మలేషియా వాళ్లకు జైలులో ఓ ఆఫీసర్ తెలుసట. మీ మామను బయటకు తీసుకొచ్చేందుకు హెల్ప్ చేస్తానన్నాడని బాలు చెబుతాడు. అప్పుడే వచ్చిన రోహిణి తమ విషయాల్లో ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని, తన తండ్రి గురించి అందరికి ఎందుకు చెబుతున్నారు, మాకన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ మీకెందుకు ఉందని రోహిణి అంటుంది.

మీ నాన్న ఏమైనా అమ్మాయా, నేనేమైనా బ్యాచిలరా ఇంట్రెస్ట్ కలగడానికి అని బాలు సెటైర్లు వేస్తాడు. అయినా మామ గురించి నీకెందుకురా అని మనోజ్ అంటే.. ఏది నీ మామ పేరు చెప్పురా అని బాలు అంటాడు. దాంతో మనోజ్ సైలెంట్ అవుతాడు. సహాయం చేద్దామన్నా అర్థం చేసుకోలేని అజ్ఞానులురా మీరు. నాకు ఎక్కడో తేడా కొడుతుంది. ఈ పార్లరమ్మ కూడా ఆ విల్లా విజయ్ గాడిలాగే నీకు చేస్తుందని నాకు డౌట్. నాకు డౌట్ వచ్చిందంటే నిజమవుతుందని బాలు అంటాడు.

దాంతో మనోజ్ భయపడతాడు. తెగ వణికిపోయిన రోహిణి బయటకు మాత్రం ఈ పెళ్లాంమొగుళ్లకు ఎక్కడ పనిలేనట్టుంది. అందుకే అన్నింట్లో వేలు పెడుతున్నారు అన్నట్లుగా అంటుంది. అవును అన్ని బయటకు తీస్తాను. డైనింగ్ టేబుల్‌ను కోర్టు బోన్ చేస్తాను అని బాలు అంటాడు. దాంతో మనోజ్ గొడవ పడి వెళ్లిపోతాడు. సహాయం చేస్తామన్న ఎందుకు అరుస్తున్నారని మీనా అంటే.. రహస్యాలు బయటపడిపోతాయని అని బాలు అంటాడు.

నిజంగానే మలేషియాలో ఉన్నాడా

అసలు వీళ్ల నాన్న నిజంగా మలేషియాలోనే ఉంటాడా అని మీనా డౌట్‌గా అంటుంది. సమ్‌థింగ్ చేప అన్న బాలు ఇలా కాదు నువ్వు నేను డిటెక్టివ్స్ అయి ఇన్వెస్టిగేషన్ చేద్దామని బాలు అంటాడు. బాలు, మీనా బ్లాక్ స్పెక్టర్స్ పెట్టుకుని డిటెక్టివ్స్‌లా ఆలోచిస్తారు. అసలు రోహిణిని అత్తయ్యకు ఎవరు అంటగట్టారు అని మీనా అంటే.. కామాక్షి అత్త అని బాలు అంటాడు. కట్ చేస్తే కామాక్షి ఇంటికి మీనా, బాలు కూపీ లాగేందుకు వెళ్తారు.

కామాక్షికి హల్వా ఇస్తారు. తర్వాత నా ఫ్రెండ్‌కు పెళ్లి సంబంధం కావాలి, వాడికి విదేశాల్లో ఉన్న తెలుగు అమ్మాయి కావాలి. ఎవరైనా తెలుసా అని బాలు అడుగుతాడు. రోహిణి కూడా మలేషియా నుంచే వచ్చింది కదా అని మీనా అంటే.. ఆ పార్లరమ్మా వాళ్ల నాన్న నీకు బాగా తెలుసు కదా అని బాలు అంటాడు. నాకు వాళ్లు ఎవరు తెలియదు. మలేషియాలో నాకు తెలిసిన వాళ్లు ఎవరు లేరని కామాక్షి అంటుంది.

రోహిణి గురించి కూడా పెద్దగా నాకు తెలియదు అని కామాక్షి అంటుంది. మరి రోహిణి విదేశాల్లో నుంచి వచ్చిందని నీకెప్పుడు తెలిసింది అత్త అని బాలు అడుగుతాడు. మీ అమ్మకు మసాజ్ చేస్తుంటే నాకు రోహిణి కాల్ చేసింది. అలా పరిచయం అయిందని కామాక్షి అంటుంది. సరే ఆ పెళ్లి సంబంధం గురించి తెలిస్తే ఏమైనా చెప్పు అని బాలు అంటాడు. సరేనంటుంది కామాక్షి. పార్లరమ్మా కామాక్షి అత్తను కూడా మోసం చేసిందేమో అని బాలు అంటాడు.

రెండుసార్లు చెంపదెబ్బలు

అయితే విద్య దగ్గరికి వెళ్దాం అని మీనా అంటుంది. మరోవైపు రెస్టారెంట్‌లో విద్య కూర్చుని ఉంటుంది. అక్కడికి ఇదివరకు రెండుసార్లు చెంపదెబ్బలు కొట్టించుకున్న సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్ వస్తాడు. జరిగిన దానికి విద్య సారీ చెప్పి కాఫీకి కూర్చోమంటుంది. ఇద్దరు ఒకరికొకరు పెళ్లి అయిందా అని మాట్లాడుకుంటారు. ఇద్దరు సరాదాగా మాట్లాడుకుంటారు. విద్య నవ్వితే చాలా బాగుంటుందని అతను చెబుతాడు.

విద్య ఇంటికి వెళ్లగానే మీనా వెళ్తుంది. నేనే నిన్ను పిలవాలనుకున్నా. నువ్వే వచ్చావని విద్య అంటుంది. దేనికి అని మీనా అడుగుతుంది. నువ్వు, బాలు చాలా ప్రేమగా ఉంటారు కదా. బాగా ప్రేమించాలంటే ఏం చేయాలని విద్య అడుగుతుంది. ప్రేమలో పడ్డావా అని మీనా అంటే.. పడాలనుకుంటున్నట్లు విద్య చెబుతుంది. మీ రోహిణి, మనోజ్ ఉన్నారుగా ఒకరికొకరు అని మీనా అంటే.. వాళ్లు ఒకరి మోసాన్ని ఒకరు మెయింటేనే చేస్తుంటారు అని విద్య అంటుంది.

ప్రేమగా మనతో ఉండాలంటే నమ్మకం పెంచుకునేలా చేయాలని చెప్పిన మీనా నీ క్లోజ్ ఫ్రెండ్ రోహిణిని వదిలేసి నన్ను అడుగుతున్నావేంటీ. అయినా నీకు రోహిణి ఎప్పటి నుంచి తెలుసు అని మీనా అడుగుతుంది. కాలేజీ నుంచి అని విద్య అంటుంది. కాలేజీ అంటే నువ్వు కూడా మలేషియాలో చదివావా అని మీనా అంటే అవును అంటుంది విద్య. మరి ఒకసారి నారాయణ రెడ్డి కాలేజీలో చదివినట్లు చెప్పావని మీనా అంటుంది.

మీనా ప్రశ్నల వర్షం

లేదు లేదు నేను రోహిణి కలిసే చదువుకున్నాం అని విద్య అంటుంది. విద్యను ఇలాగే మీనా ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతుంది. దాంతో విద్య కంగారుపడుతుంది. రోహిణి గురించి కూపీ లాగేందుకే వచ్చినట్లుందని విద్య అనుకుంటుంది. నాకు ఇంకో రోహిణి తెలుసు అందుకే కన్‌ఫ్యూజన్‌లో మాట్లాడి ఉంటానని విద్య అంటుంది. రోహిణి వాళ్ల నాన్న గురించి ఏం తెలుసు అని మీనా అడిగితే.. అమ్మో ఏం చెప్పిందో గుర్తులేదే అని విద్య లేచి నిల్చుంటుంది.

కాఫీ ఇవ్వాల అని అడుగుతుంది. తాగానని చెప్పిన మీనా ఇంతకుమించి ఏం అడిగిన చెప్పదని, అబద్ధాలు చెబుతుందని అర్థమవుతోందని వెళ్లిపోతుంది. బయటకు వెళ్లి ఇంతకుముందు ఇప్పుడు చెప్పినదానికి సంబంధం లేదని మీనా అంటుంది. ఈ విద్యావతి కూడా దొంగే అని బాలు అంటే.. లేదండి. మన గురించి ఎంత గొప్పగా మాట్లాడిందో అని మీనా అంటుంది. పొగిడేవాళ్లే పొడుస్తుంటారు వెన్నుపోటు అని బాలు అంటాడు.

రోహిణి మలేషియాది కట్టు కథ అని బాలు అంటే.. మీ అన్నయ్యను రోహిణి మోసం చేసినట్లేగా అని మీనా అంటుంది. ఎంత నాటకం ఆడినా ఏదో ఒకరోజు మేకప్ కరిగిపోతుందని బాలు అంటాడు. తర్వాత రోహిణికి కాల్ చేసిన విద్య మీనా వాళ్లు ఎంక్వైరీ చేసిన విషయం, తను ఏదో మ్యానేజ్ చేసినట్లు చెబుతుంది. రోజు రోజుకీ నీ అబద్ధాలు ఎక్కువైపోతున్నాయి. నేను ఏం చెప్పలేదు. ఆ బాలుకి నువ్వు నిజంగా మలేషియా నుంచి వచ్చావా అని డౌట్‌గా ఉందని విద్య అంటుంది.

రోహిణికే రివర్స్

మనోజ్ వచ్చి ఏమైందని అడుగుతాడు. నా గురించి విద్య దగ్గర ఎంక్వైరీ చేశారట. 30 లక్షల గురించి కూడా అడిగిరాట. వాళ్లకెందుకు ఇవన్నీ. దీనికి ఒక్కటే పరిష్కారం. డబ్బులు త్వరగా ఇవ్వాలి అని రోహిణి అంటుంది. మీ మలేషియా మావయ్య ఎక్కడున్నాడో చెప్పు. నేను మాట్లాడి బిజినెస్ గురించి మాట్లాడుతాను. విల్లా విజయ్ గాడి నుంచి డబ్బు వస్తుందో లేదో తెలియదు. మీ మావయ్య ఏ దేశంలో ఉన్నాడని మనోజ్ అడుగుతాడు.

కోపంతో మనోజ్ దగ్గర బాలు, మీనాను ఇరికిద్దామని చూసిన రోహిణికే రివర్స్ అవుతుంది. సరే నాకు టైమ్ ఇవ్వు అని చెప్పి మనోజ్‌ను పంపిస్తుంది రోహిణి. ఇంకెంత కాలం ఇలా అబద్ధాలు చెప్పాలని రోహిణి బాధపడుతుంది. మరోవైపు రోహిణి పూలగంను ఒకడు దొంగతనం చేసి ఎత్తుకెళ్తాడు. వాన్ని వెతుక్కుంటూ ఓ ఇంట్లోకి వెళ్తుంది మీనా. అక్కడ ఒకామే ఉండి అమ్మగారు అంతా చెప్పారు. మీరు భోజనం చేయండి అని అంటుంది.

దాంతో చింతామణి ఎంట్రీ ఇస్తుంది. దాంతో మీనా కోప్పడుతుంది. ఇలా రోజంతా పని చేస్తుంటే ఎప్పుడు తింటావ్. తిను. నువ్వు పిలిస్తే రావని తెలిసే ఇలా చేశాను అని చింతామణి అంటుంది. అసలు విషయం చెప్పు అని మీనా అంటుంది. మీనా, చింతామణి ఇద్దరు వాదించుకుంటారు. నువ్వు నాతో కలిసి పని చేయు. నీకు డబ్బులు ఎక్కువ వచ్చేలా చేస్తాను అని చింతామణి అంటుంది.

చింతామణికి వార్నింగ్

మీ కాంట్రాక్ట్సే నాకు ఇవ్వండి. నేనే మీకు ఎక్కువ ఇస్తాను అని మీనా అంటుంది. మీనా నేను నీకు ఛాన్స్ ఇస్తున్నాను అని చింతామణి అంటుంది. నాకు ఎవరు ఛాన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. పులికి తోకగా ఉండడం కన్నా పిల్లికి తలగా ఉండటం ఇష్టం. నా డబ్బా నాకు ఇచ్చేయండని, లేకుంటే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని మీనా వార్నింగ్ ఇస్తుంది. దాంతో పూలగంప డబ్బాను తిరిగి తీసుకొస్తాడు ఎత్తుకెళ్లిన అతను.

కష్టపడి పని చేస్తేనే తినే ముద్ద అరుగుతుంది. మీరు బతకండి, ఇంకొకరిని బతకనివ్వండి అని బెదిరించి వెళ్లిపోతుంది మీనా. మరోవైపు ఇంట్లో బాలు అరుస్తాడు. అందరిని పిలుస్తాడు బాలు. ఈ హడావిడి ఏంట్రా అని సత్యం అడిగితే.. అమ్మకు గుడ్ న్యూస్ అని బాలు అంటాడు. అందరికి పేపర్స్ ఇస్తాడు బాలు. ఇవన్ని పాస్‌పోర్ట్ కోసం అప్లికేషన్స్ అని రవి అంటాడు.

అందరం పాస్‌పోర్ట్ అప్లై చేస్తున్నాం అని బాలు అంటే.. నాకు ఉందని శ్రుతి అంటుంది. రోహిణికి కూడా ఉండే ఉంటుంది. మలేషియా నుంచి వచ్చింది కదా అని మీనా అంటుంది. అవును ఉందని రోహిణి అంటుంది. నాకు కూడా ఉంది కానీ రెన్యూవల్ చేయించలేదని మనోజ్ చెబుతాడు. నాన్న నువ్వు అమ్మా సంతకం పెట్టండి. మీ అందరితో నేను మలేషియా ట్రిప్ ప్లాన్ చేశానని బాలు అంటాడు.

బాలు మలేషియా ట్రిప్ ప్లాన్

దాంతో అంతా షాక్ అవుతారు. రోహిణి భయంతో తెగ వణికిపోతుంది. అయితే, రోహిణి బండారం బయటపెట్టేందుకే బాలు మలేషియా టూర్ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More