గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: బాలు ఇంటికి మలేషియా దంపతులు- మూతపడిన రోహిణి నోరు- పన్ను పీకి చేతిలో పెట్టిన డాక్టర్

Gunde Ninda Gudi Gantalu Serial May 26th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ మే 26వ ఎపిసోడ్‌‌లో బాలు ఇంటికి మలేషియా దంపతులు వస్తారు. వాళ్లు రావడంతో రోహిణి పంటి నొప్పి అని నాటకం ఆడుతుంది. రోహిణిని శ్రుతి హాస్పిటల్‌కు తీసుకెళ్తుంది. తప్పించుకునేందుకు రోహిణి ట్రై చేస్తే శ్రుతి గట్టిగా నిలదీస్తుంది.

Published on: May 26, 2026, 07:50:46 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో మలేషియా నుంచి వచ్చిన దంపతుల కోసం మీనా వంట చేస్తుంటుంది. ప్రభావతి వచ్చి ఏం చేస్తున్నావని అడుగుతుంది. శ్రుతి సెటైర్లు వేస్తుంది. మీనా ఒక్కత్తే ఇన్ని కూరగాయలు కట్ చేస్తుంటే కామాక్షి ఆంటీ ఇంటికి పప్పు డబ్బాలో డబ్బులు దాచుకోడానికి వెళ్లారా అని అడుగుతుంది శ్రుతి.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ మే 26 ఎపిసోడ్
గుండె నిండా గుడి గంటలు సీరియల్ మే 26 ఎపిసోడ్

లక్షలు తేవట్లేదు

దాచుకోడానికి మీ ఆయన తెచ్చి లక్షలు లక్షలు ఏం పోయట్లేదని ప్రభావతి అంటుంది. లక్షలు సంపాదించిన ఈ ఇంటికి తీసుకురాడు. ఇక్కడ దాచేవాళ్లకంటే మింగేవాళ్లు ఎక్కువ కదా అని పంచ్‌ల మీద పంచ్‌లు వేస్తుంది శ్రుతి. దాంతో శ్రుతిని స్టౌవ్ ఆఫ్ చేసి రమ్మని డైవర్ట్ చేస్తుంది మీనా. శ్రుతి స్టవ్ ఆఫ్ చేసి వచ్చి అక్కడ మంట ఆర్పాను, ఇక్కడ మొదలైనట్లుందని అంటుంది. శ్రుతి అని గట్టిగా అరుస్తుంది ప్రభావతి.

మీనా వద్దన్నట్లు చెప్పడంతో శ్రుతి ఆగుతుంది. ఈ వంట దేనికి అని ప్రభావతి అడిగితే.. ఆయన ఇద్దరు ఇంటికి భోజనానికి తీసుకొస్తారని చెప్పారు అని మీనా అంటుంది. నా అనుమతి లేకుండానే తీసుకొద్దామనుకున్నాడా, ఇదేమైనా హోటల్ అనుకున్నాడా అని ప్రభావతి కోప్పడుతుంది. ఆయన డబ్బులతోనే ఈ కూరగాయలు కొన్నాం. సరే ఆయనొచ్చాక ఇలా అన్నారని చెబుతానని మీనా అంటుంది.

దాంతో భయపడిన ప్రభావతి మా ఇద్దరికి గొడవ పెట్టాలని చూస్తున్నావా అని అంటుంది. అది మీ ఇష్టం అత్తయ్య అని మీనా అంటుంది. కోపంగా వెళ్లిన ప్రభావతిని చూసి సత్యం భయపడతాడు. బాలు గురించి అడిగితే తనకు ఇంటికి వచ్చేది చెప్పాడని సత్యం చెబుతాడు. వాళ్లు మలేషియా నుంచి వచ్చారంటా అని మీనా అంటుంది. మలేషియానా అని చిరాకుగా అంటుంది ప్రభావతి. ఇంటికి ఎవరైన దంపతులు వస్తే మా అమ్మ ఆది దంపతుల్లా చూసకునేది అని క్లాస్ పీకుతాడు సత్యం.

శ్రుతి పంచ్‌లు

అందరికి అన్నదానం చేయండి. కొన్ని రోజుల తర్వాత వాళ్లలాగే మనం ఆకు పట్టుకుని వరుసలో నిల్చుందామని కోపంగా వెళ్లిపోతుంది ప్రభావతి. మీనా వంట చేస్తుంటే రోహిణి వచ్చి అడుగుతుంది. శ్రుతి పంచ్‌లు వేస్తుంది. ఏంటీ స్పెషల్ అని రోహిణి అడిగితే.. ఇద్దరు భోజనానికి రావడం గురించి మీనా చెబుతుంది. వాళ్లది సిల్వర్ జూబ్లీ అంట అని శ్రుతి అంటే.. రోహిణి నవ్వుతుంది.

ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ అన్నట్లు బాలు కారు ఎక్కిన వాళ్లకు ఫుడ్ ఫ్రీనా. కొత్త స్కీమా అని రోహిణి అంటుంది. నీ భర్త లక్షలు మింగే స్కీమ్ పెట్టారా అని సెటైర్లు వేస్తుంది శ్రుతి. నువ్వేంటీ బాలులా మాట్లాడుతున్నావ్. దారిపోయినవాళ్లకు ఈ ఫుడ్ పెట్టడం ఏంటీ నాకు అర్థం కావట్లేదని రోహిణి అంటుంది. ఈ పప్పు, కూరగాయలు, నువ్వు తినే కొబ్బరి అన్నీ నా మొగుడు తెచ్చి వండమన్నప్పుడు దారినపోయే దానికల్లా అర్థం కావాల్సింది ఏముంది రోహిణి అని మీనా గట్టి కౌంటర్ ఇస్తుంది.

వంట అయితే పిలు అని కోపంగా అంటుంది రోహిణి. వీలుంటే పిలుస్తా. లేదా నువ్వే వచ్చి చూసి పెట్టుకుని తిను అని మీనా పంచ్ ఇస్తుంది. దాంతో రోహిణి కోపంగా వెళ్లిపోతుంది. సూపర్ కౌంటర్ ఇచ్చావ్ మీనా అని శ్రుతి అంటుంది. లేకుంటే ఇద్దరు మనుషులు భోజనానికి వస్తున్నారంటే ఓర్వలేరు, వీళ్లు మాత్రం లక్షలకు లక్షలు ఇచ్చి మోసపోతారు అని మీనా అంటుంది. ఇక్కడ కొబ్బరి ఉండాలిగా అని మీనా అంటుంది.

ఇప్పటిదాకా కోతిలా కొరుక్కుని తినింది కదా అని రోహిణిని గురించి అంటుంది శ్రుతి. రవి ఇంటికి వస్తాడు. ఇంట్లో స్పెషల్ చేస్తున్నారని వదిన చెబితే లంచ్‌కి వచ్చానని రవి అంటాడు. రవికి వంట చేసిన వీడియోలు చూపిస్తుంది శ్రుతి. ఇంతలో బాలు మలేషియా దంపతులను ఇంటికి తీసుకొస్తాడు. ఇంటిల్లిపాదిని పరిచయం చేస్తాడు. గుడిలో ఏర్పాట్ల గురించి మీనాకు థ్యాంక్స్ చెబుతారు వాళ్లు.

రాజమండ్రిలో బంధువులు

ఇక్కడ మాకు ఎవరు లేరనుకున్నాం. రాజమండ్రిలో మాకు బంధువులు ఉన్నారని చెప్పుకుంటామని వాళ్లు అంటారు. మీరు ఏ దేశం నుంచి వచ్చారని సత్యం అడిగితే.. మలేషియా అని వారు చెబుతారు. దాంతో ప్రభావతి నోరెళ్లపెట్టి మలేషియానా అంటుంది. అందేంటీ మలేషియా అంటే అంత ఆశ్చర్యపోతున్నారు అని వాళ్లు అంటారు. అప్పుడే రోహిణి కిందకు దిగి ఆ మాటలు వింటుంది.

మా పెద్ద కోడలు కూడా మలేషియానే అని ప్రభావతి చెబుతుంది. మలేషియాలో ఎక్కడ అని అడిగితే తెలియదని ప్రభావతి అంటుంది. అమ్మో మా నాన్న ఏం చేస్తున్నారని అడిగితే ఏం చెప్పాలి అని భయపడి పైకి గదిలోకి పారిపోతుంది రోహిణి. ట్విన్ టవర్స్ అని గుర్తు అని శ్రుతి అంటే.. అక్కడ నాకు తెలిసిన బిజినెస్ మ్యాగ్నెట్స్ చాలా మంది ఉన్నారని అతను అంటాడు. దాంతో రోహిణిని తీసుకొస్తాని పైకి పరుగెత్తుతుంది ప్రభావతి.

పైన రోహిణి తలుపేసుకుని గడియ పెట్టుకుంటుంది. ప్రభావతి వచ్చి తలుపు తీయమని డోర్ కొడుతుంది. ఎంతకీ తీయకపోయేసరికి బాత్రూమ్‌లో ఉన్నావా, సరే త్వరగా రా అని కిందకు వస్తుంది ప్రభావతి. తర్వాత రవి గురించి అడిగి.. మలేషియాలో హోటల్ బిజినెస్ పెడితే చాలా బాగుంటుందని అతను చెబుతాడు. తర్వాత రోహిణి వాళ్ల నాన్న పేరు అడిగితే ఎవరికి తెలియదు. ఇంటి పేరు, బిజినెస్ ఏంటని అడిగితే అందరు సైలెంట్ అయిపోతారు.

శ్రుతిని వెళ్లి రోహిణిని తీసుకురమ్మని ప్రభావతి అంటుంది. రోహిణిని శ్రుతి పిలుస్తుంది. నోట్లో పేపర్ ముద్దు పెట్టుకుని డోర్ తీస్తుంది రోహిణి. ఏమైందని అడిగితే కిందకు పదా అని సైగ మాత్రం చేస్తుంది రోహిణి. రోహిణి కిందకు వస్తే ప్రభావతి హడావిడి చేస్తుంది. రోహిణిని చూసి అంతా షాక్ అవుతారు. ఏమైందని అడిగితే.. రోహిణి ఏం మాట్లాడకుండా చెంపపై ఉబ్బింది చూపిస్తుంది. బాత్రూమ్‌లో జారి పడితే పళ్లు రాలాయ అని బాలు అంటాడు.

నీ నోరూ మూతపడాలా

ఏంటీ నొప్పా అని మీనా అంటే.. అవును అని తల ఊపుతుంది రోహిణి. అయ్యయ్యో ఇప్పుడే నీ నోరు మూతపడాలా, ఎక్కువ మాట్లాడకు, కేవలం వాళ్లు అడిగిన దానికి సమాధానం చెప్పు అని ప్రభావతి అంటుంది. వాళ్లు తండ్రి పేరు అడిగితే నొప్పి ఉన్నట్లు అరుస్తుంది రోహిణి. ఇప్పటిదాకా మాట్లాడే వెళ్లిందని మీనా అంటుంది. ఇదేం మాయదారి నొప్పి అని బాలు అంటాడు. ఏది ఓసారి నోరు తెరవమను అని మీనా అంటే షాక్ అయిపోతుంది రోహిణి.

ఇంత నొప్పితో ఇంట్లో ఏం చేస్తున్నావ్. హాస్పిటల్‌కు వెళ్లమ్మా అని సత్యం అంటే సరేనని వెళ్తుంది. తోడుగా బాలు, సత్యం వస్తానంటే వద్దంటుంది రోహిణి. కావాలనే చేస్తున్నట్లుందని బాలు అంటే.. నాకు అదే డౌట్ అని శ్రుతి అంటుంది. రోహిణి ఎంత వద్దన్నా రోహిణితో శ్రుతిని తోడుగా పంపిస్తారు. తర్వాత మీనాకు పల్లిపట్టి ఇచ్చి కొరకమంటాడు బాలు. పార్లరమ్మకు ఉన్నట్టుండి పంటి నొప్పి ఎందుకొచ్చిందని బాలు అంటాడు.

పార్లరమ్మ మలేషియా నుంచి వచ్చినట్లు లేదు. ఉన్నట్టుండి దవడ వాచిపోయినంత నొప్పి వస్తుందా. మలేషియా నుంచి వాళ్లు రాగానే తన బండారం ఎక్కడ బయటపడిపోతుందో అని ఇలా నాటకం ఆడిందని నా అనుమానం అని బాలు అంటాడు. అప్పటివరకు కొబ్బరిని తెగ కొరికేసిందని మీనా అంటుంది. పార్లరమ్మకు పంటి నొప్పి లేదు. నోరు తెరిస్తే బండారం ఎక్కడ బయటపడుతుందో అని ఇలా చేసిందని బాలు అంటాడు.

రోహిణితో శ్రుతి వెళ్లింది. కాస్తా అనుమానం వచ్చిన మీలాగే కనిపెడుతుందని మీనా అంటుంది. ఏం జరుగుతుంది. పార్లరమ్మ దొంగ పంటినొప్పి బయటపడుతా అని బాలు అంటాడు. మరోవైపు డాక్టర్ ఈగలు తోలుకుంటూ ఉంటుంది. హాస్పిటల్‌కు వెళ్లగానే పంటినొప్పి పోయిందని రోహిణి చెబుతుంది. ఇంట్లో నోరు పడిపోయినట్లు చేశావ్. క్లినిక్‌కు రాగానే ఎలా తగ్గుతుంది. అలాగే ఉంటుంది. తర్వాత మళ్లీ వస్తుందని శ్రుతి అంటుంది.

రోహిణి పన్ను పీకిన డాక్టర్

మనోజ్‌తో రేపు వస్తాను. ఇవాళ క్లైంట్ అపాయింట్‌మెంట్ ఉందని రోహిణి అంటుంది. డాక్టర్ అపాయింట్‌మెంట్ తీసుకుని క్లైంట్‌ది అంటావేంటీ అని శ్రుతి గట్టిగా ఉంటుంది. అబ్బా శ్రుతి వదిలేయ్ అని రోహిణి అంటే.. ఏంటీ ఇదంతా నాటకమా. సడెన్‌గా నువ్వు పంటినొప్పి అని నాటకం ఆడావ్. ఏది తప్పించుకోవాలని ఇదంతా చేశావ్. ఇదే డౌట్ బాలుకు వచ్చింది. ఏం తప్పించుకోవాలని అని శ్రుతి గట్టిగా నిలదీస్తుంది.

దాంతో పంటి నొప్పి అని రోహిణి అరవడం మొదలు పెడుతుంది. నర్స్‌ వస్తే డాక్టర్ గురించి అడుగుతారు. డాక్టర్ దగ్గరికి వెళ్లి పేషంట్ వచ్చారని నర్స్ చెబుతుంది. కరెంట్ బిల్లు మాత్రమే కాకుండా నీ జీతం కూడా కవర్ అవుతుందేమో చూద్దామని డాక్టర్ పంపించమంటుంది. మళ్లీ సడెన్‌గా వచ్చిందేంటని శ్రుతి అడిగితే.. రోహిణి మాట్లడలేకపోతుంది. తర్వాత రోహిణిని చెక్ చేస్తుంది డాక్టర్. ట్యాబ్లెట్స్ ఇచ్చి పంపించమంటుంది రోహిణి.

డాక్టర్ నువ్వా నేనా అని చెక్ చేస్తుంది డాక్టర్. ఓ పన్ను పుచ్చిపోయిందని డాక్టర్ చెబుతుంది. నేనేదో నాటకం ఆడితే నిజంగానే పన్ను పుచ్చిపోయిందంటుందే అని రోహిణి భయపడుతుంది. నొప్పి పోవాలంటే పన్ను పీకాలని కావాలనే డాక్టర్ అంటుంది. తర్వాత రోహిణి పన్ను పీకి చేతిలో పెడుతుంది డాక్టర్. మలేషియా వాళ్ల నుంచి తప్పించుకోడానికి పన్ను పీకించుకోవాల్సి వచ్చిందని రోహిణి అనుకుంటుంది.

మీనాపై ప్రశంసలు

మరోవైపు మలేషియా వాళ్లు భోజనం చేసి కూర్చుంటారు. మీనా చేతి వంట తింటే మా అమ్మ గుర్తుకు వచ్చిందని అతను అంటాడు. తర్వాత కారులో నుంచి బట్టలు తీసుకొస్తాడు బాలు. తాంబూళంలో బట్టలు, పండ్లు పెట్టి సత్యం, ప్రభావతితో ఇప్పిస్తాడు బాలు. మీ రుణం తీర్చుకోలేను. మీ కోడలిది మలేషియా కాబట్టి అక్కడికి వచ్చినప్పుడు మా ఇంట్లోనే ఉండాలని వాళ్లు అంటారు. ఇక బయలుదేరుతామని వాళ్లు అంటే.. రోహిణి వచ్చాక వెళ్లమని చెబుతుంది ప్రభావతి.

అంతలో మనోజ్ వస్తాడు. ఏం చేస్తున్నావని అతను అడిగితే.. పెద్ద బిజినెస్ మేన్‌ని అని మనోజ్ అంటాడు. నేను బిజినెస్ మేన్‌నే కానీ ఇలా ఎప్పుడు చెప్పుకోలేదు అంతే అని అతను అంటాడు. ఇలాంటి కాలంలో మీనా లాంటి కోడలు ఉండటం చాలా అరుదు. మీనా వల్ల మీ వంశానికే పేరు వస్తుందని ఆమె అంటుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More