TG ECET 2026 Counseling : టీజీ ఈసెట్ కౌన్సెలింగ్ అప్డేట్ - రిజిస్ట్రేషన్‌కు ఇవాళే లాస్ట్ డేట్, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే

TG ECET 2026 Counseling : టీజీ ఈసెట్ 2026 మొదటి విడత కౌన్సెలింగ్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు నేడే ఆఖరి తేదీ. అర్హులైన డిప్లొమా, బీఎస్సీ అభ్యర్థులు tgecet.nic.in వెబ్‌సైట్‌లో స్లాట్ బుక్ చేసుకోవాలని ఉన్నత విద్యా మండలి స్పష్టం చేసింది.

Published on: Jun 18, 2026, 14:19:55 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

TG ECET 2026 Counseling : రాష్ట్రంలోని ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో నేరుగా ద్వితీయ సంవత్సరంలో (లాటరల్ ఎంట్రీ) ప్రవేశాలు పొందాలనుకునే విద్యార్థులకు కీలక అలర్ట్. 'టీజీ ఈసెట్ (TG ECET) 2026' మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. అర్హత సాధించిన డిప్లొమా, బీఎస్సీ (మ్యాథ్స్) అభ్యర్థులు జూన్ 18 లోపు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (TSCHE) స్పష్టం చేసింది. నేటితోనే ఈ గడువు ముగియనుండటంతో అభ్యర్థులు అప్రమత్తం కావాలి.

టీజీ ఈసెట్ కౌన్సెలింగ్ 2026
టీజీ ఈసెట్ కౌన్సెలింగ్ 2026

కౌన్సెలింగ్ ప్రాసెసింగ్ ఫీజు కింద ఓసీ, బీసీ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు రూ.1,200 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.600 ఆన్‌లైన్ ద్వారా నెట్ బ్యాంకింగ్ లేదా కార్డ్స్ ఉపయోగించి చెల్లించాలి. ఈ ఫీజు చెల్లించిన తర్వాతే ధ్రువపత్రాల పరిశీలన కోసం అభ్యర్థులు తమకు అనుకూలమైన తేదీ, సమయాన్ని బట్టి స్లాట్ బుక్ చేసుకోవడానికి వీలుంటుంది.

ముఖ్య తేదీలు :

అభ్యర్థులకు జూన్ 19 వరకు నిర్ణీత హెల్ప్‌లైన్ కేంద్రాలలో ధ్రువపత్రాల పరిశీలన (సర్టిఫికేట్ వెరిఫికేషన్) నిర్వహిస్తారు. కౌన్సెలింగ్‌లో పాల్గొనే జనరల్ అభ్యర్థులకు క్వాలిఫైయింగ్ పరీక్షలో కనీసం 45 శాతం మార్కులు ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు 40 శాతం మార్కులు ఉండటం తప్పనిసరి.

స్లాట్ బుకింగ్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న అభ్యర్థులు జూన్ 21 లోపు తమకు నచ్చిన కళాశాలలు, కోరుకున్న బ్రాంచ్‌ల వారీగా వెబ్ ఆప్షన్లను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. ఆప్షన్లు ఖరారు చేసుకున్నాక వాటిని ఫ్రీజ్ చేయాల్సి ఉంటుంది.

ఈ వెబ్ ఆప్షన్ల ఆధారంగా మొదటి విడత తాత్కాలిక సీట్ల కేటాయింపు ఫలితాలను జూన్ 24న లేదా అంతకంటే ముందుగా అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేస్తారు. సీట్లు పొందిన అభ్యర్థులు జూన్ 24 నుంచి జూన్ 27 మధ్య ఆన్‌లైన్ ద్వారా ట్యూషన్ ఫీజు చెల్లించి, వెబ్‌సైట్ ద్వారానే సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేయాల్సి ఉంటుంది.

రిజిస్ట్రేషన్ సమయంలో విద్యార్థులు సమర్పించిన మొబైల్ నంబర్లను మార్చడానికి వీలుండదని అధికారులు తెలిపారు. కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసేవరకు అదే నంబర్ అందుబాటులో ఉంచుకోవాలి. నిర్ణీత గడువులోగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకోని అభ్యర్థులు మొదటి విడతలో సీటు పొందే అవకాశాన్ని పూర్తిగా కోల్పోతారని ఉన్నత విద్యా మండలి హెచ్చరించింది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More