సక్సెస్ అయ్యే విద్యార్థులు ఫాలో అయ్యే సీక్రెట్ టెక్నిక్స్.. ఇలా చదివితే టాపర్ అవ్వడం ఖాయం!
Exam Preparation Tips : కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యేప్పుడు ఒత్తిడి ఉండటం సహజం.. కానీ ఈ ఒత్తిడికి గురి కాకుండా మంచి ఫలితాలు సాధించాలంటే, ఎలా చదవాలి?
కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవడం అనేది చాలాసార్లు చాలా భారంగా అనిపిస్తుంది. కేవలం సిలబస్ పెద్దదనే కాదు, ఎప్పుడూ అప్డేట్ గా ఉండాలి, ఫోకస్‌గా ఉండాలి, బాగా పెర్ఫార్మ్ చేయాలి అనే ఒత్తిడి కూడా ఉంటుంది. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి. సక్సెస్ అంటే ఎక్కువ గంటలు చదవడం కాదు.. సరైన విధంగా చదవడం. అలాగే మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం. ఒత్తిడికి గురి కాకుండా ఎలా చదవాలో డా.దీప్తి, కన్సల్టెంట్ సైకాలజీ, మణిపాల్ హాస్పిటల్, విజయవాడ వెల్లడించారు.

కష్టపడి కాదు తెలివిగా చదవండి
అదే నోట్స్‌ని మళ్లీ మళ్లీ చదవడం కంఫర్ట్‌గా అనిపించొచ్చు. కానీ అది ఎక్కువకాలం గుర్తుండదు. దాని బదులు “యాక్టివ్ రీకాల్” (active recall) ట్రై చేయండి. బుక్ మూసేసి, మీరు చదివింది గుర్తు చేసుకునే ప్రయత్నం చేయండి. ఇది కాస్త కష్టంగా అనిపిస్తుంది. కానీ అదే దీని బలం.
ఇంకో మంచి పద్ధతి “స్పేస్డ్ రిపిటీషన్" (Spaced Repetition). ఒకేసారి అన్నీ బట్టీ పట్టేయడం కాకుండా, కొంత గ్యాప్ తర్వాత మళ్లీ అదే టాపిక్ ని రివైజ్ చేయండి. ఉదాహరణకు డే 1, డే 3, డే 6 ఇలా. ప్రతి సారి రివైజ్ చేస్తూ ఉంటే, అది ఇంకా ఈజీ అవుతుంది. మెమరీ కూడా ఎక్కువకాలం ఉంటుంది.
మీరే టీచర్‌లా అనుకుని కాన్సెప్ట్స్‌ని గట్టిగా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా మంచిదే. మీరు సింపుల్‌గా వివరించలేకపోతే, ఆ టాపిక్‌లో ఇంకా మీకు క్లారిటీ కావాలన్న మాట.
చిన్న చిన్న టెక్నిక్స్
- లిస్ట్ ని గుర్తు పెట్టుకోవడానికి mnemonics (నెమోనిక్స్)ని వాడండి.
- ఐడియాస్‌ని కనెక్ట్ చేసుకోవడానికి మైండ్ మ్యాప్స్ గీయండి.
- ఫ్యాక్ట్స్(వాస్తవాలని)ని చిన్న చిన్న కథలుగా, లేదంటే, గుర్తుండిపోయే విజువల్స్‌గా మార్చుకోండి.
- చేతితో రాసుకోవడం అలవాటు చేసుకోండి. అలా రాస్తే మెదడు ఇంకా బాగా గుర్తుంచుకుంటుంది.
చివరి వారంలో ప్లాన్ ఉండాలి
ఎగ్జామ్ ముందు ఆఖరి వారం కొత్తగా అన్నీ నేర్చుకునే టైమ్ కాదు. అప్పటికే చదివినదాన్ని రివైజ్ చేసుకునే టైమ్.
Day 1: మీరు ఎందులో వీక్ గా ఉన్నారో ఆ విషయాలని గుర్తించండి, ముఖ్యమైన టాపిక్స్ ని రివైజ్ చేయండి
Days 2-3: వీక్ టాపిక్స్ మీద దృష్టి పెట్టండి. దానికి సంబంధించిన ప్రశ్న్లని ప్రాక్టీస్ చేయండి.
Days 4-5: ఫుల్ మాక్ టెస్ట్ లని వ్రాయండి. ఇది నిజమైన ఎగ్జామ్ అన్నట్టుగానే భావించండి.
Day 6: తేలికపాటి రివిజన్. అంటే ఫార్ములాలు, షార్ట్ నోట్స్ లాంటివి రివైజ్ చేయండి.
Day 7 సాయంత్రం: కేవలం ఒకసారి పైపైన చూసుకోవడమే... కొత్తగా ఏమీ మొదలు పెట్టొద్దు
మాక్ టెస్ట్ లు (Mock tests) చాలా ముఖ్యం. కానీ వాటిలో చేసిన తప్పులని విశ్లేషించుకుని, వాటిని సరిదిద్దుకోవడమే అసలైన ప్రోగ్రెస్.
సెట్ అయ్యే దినచర్యని తయారు చేసుకోండి
- ఎక్కువ గంటలు చదవడం అంటే ప్రొడక్టివ్ అనేది, అన్ని వేళలా కరెక్ట్ కాదు. క్రమం తప్పకుండా చదవడం (Consistency) ముఖ్యం.
- చిన్న చిన్న బ్రేక్స్ తో, 45 నిమిషాలు దృష్టి పెట్టి చదవండి.
- క్లిష్టమైన సబ్జెక్ట్స్ ని, మీ మైండ్ ఫ్రెష్ గా ఉన్నప్పుడు మాత్రమే చదవండి.
- సాయంత్రాలు, రివిజన్ కోసం కేటాయించండి.
- 7-8 గంటల నిద్ర తప్పనిసరి. లేదంటే చదివింది గుర్తుండదు.
- అలాగే మితంగా తేలికపాటి ఆహారం తీసుకోండి. నీళ్లు బాగా తాగండి. కేవలం కెఫీన్ మీద ఆధారపడకండి.
ఒత్తిడిని ఎలా తట్టుకోవాలి?
ఈ విషయం చాలా ముఖ్యం. ఎంత ప్రిపెరేషన్ ఉన్నా, చాలా మంది, ఆందోళన వల్ల సరిగ్గా పెర్ఫార్మ్ చెయ్యలేకపోతారు. అందుకే మనసును నిశ్చలంగా ఉంచుకోవడం నేర్చుకోవాలి. దీనికో మంచి చిట్కా - “Square Breathing” method (స్క్వేర్ బ్రీతింగ్ పద్ధతి):
4 counts వరకు శ్వాస తీసుకోండి (inhale చేయండి)
4 counts వరకు శ్వాసని నిలిపి ఉంచండి (hold చేయండి)
4 counts వరకు శ్వాసని వదలండి (exhale చేయండి)
ఇలా నెమ్మదిగా చేయండి. రోజూ 5 సైకిల్స్ చేయండి. ఉదయం లేచిన తర్వాత, రాత్రి పడుకునే ముందు. ఎగ్జామ్ రోజున కూడా హాల్ లోకి వెళ్లే 10-15 నిమిషాల ముందు కూడా ఒక 5 సైకిల్స్ చేస్తే చాలా నిశ్చింతగా ఉంటారు.
ఆందోళన ఎక్కువగా అనిపిస్తుంటే “5-4-3-2-1(గ్రౌండింగ్ టెక్నిక్)” కూడా బాగా ఉపయోగపడుతుంది.
- మీరు చూడగలిగే 5 విషయాలు
- మీరు తాకగలిగే 4 విషయాలు
- మీరు వినగలిగే 3 శబ్దాలు
- మీరు వాసన చూడగలిగే 2 విషయాలు
- మీరు రుచి చూడగలిగే 1 విషయం
ఇది మిమ్మల్ని ప్యానిక్ స్టేజ్ నించీ వాస్తవంలోకి తీసుకొస్తుంది.
చేయకూడని విషయాలు
కొన్ని అలవాట్లు, అనవసరమైన ఆందోళనని పెంచుతాయి:
- ఆఖరి నిమిషంలో కొత్త టాపిక్స్‌ని స్టార్ట్ చేయడం
- రాత్రంతా నిద్రపోకుండా చదవడం
- మాక్ టెస్టుల్లో చేసిన తప్పుల్ని నిర్లక్ష్యం చేయడం
- ఇతరులతో మిమ్మల్ని పోల్చుకోవడం
- ముఖ్యంగా పోల్చుకోవడం (కంపేరిజన్)… మనకి తెలియకుండానే చాలా నిరాశ పరుస్తుంది.
రివిజన్ ఈజీగా ఉండాలంటే
- వన్ పేజ్ ఫార్ములా షీట్స్
- ఫ్లాష్ కార్డ్స్
- గత సంవత్సరాల్లో వచ్చిన క్వశ్చన్ పేపర్స్
- తప్పులు సరిదిద్దుకునేందుకు, ప్రత్యేకంగా ఒక నోట్‍బుక్
మనసును ప్రశాంతంగా ఉంచుకోండి
స్ట్రెస్ (ఒత్తిడి) ని పూర్తిగా నివారించలేము, కానీ అది మనల్ని కంట్రోల్ చేయకుండా చూసుకోవచ్చు. రోజుకు 10-15 నిమిషాలు నెమ్మదిగా శ్వాస తీసుకోవడం లేదా ప్రశాంతంగా కూర్చోవడం చేయండి. కొద్దిసేపైనా వాకింగ్ చేయండి. సరైన ఆహారం తీసుకోండి, తగినంత నీళ్లు తాగండి. బాగా నిద్రపోండి. ఇది మీ మూడ్‌ని, జ్ఞాపకశక్తిని రెండిటినీ, మీరు అనుకున్నదానికన్నా ఎక్కువే ప్రభావితం చేస్తుంది
ఎప్పుడైనా మరీ ఎక్కువ ఒత్తిడిగా అనిపిస్తే నెమ్మదిగా శ్వాస తీసుకోండి. (స్లో బ్రీతింగ్ చేయండి). చుట్టూ ఉన్న వాటిని గమనిస్తూ, ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. “నేను ఇప్పటికే చాలా టాపిక్స్ ని కవర్ చేశాను” అని మీకు మీరే గుర్తు చేసుకోండి. మాక్ టెస్ట్ బాగా రాయకపోయినా, దాన్ని ఒక ఫెయిల్యూర్ లా కాదు... ఫీడ్‍బ్యాక్ గా చూడండి.
చివరిగా... ఎగ్జామ్ కి ప్రిపెరేషన్ అంటే మనల్ని మనం ఎంతగా పుష్ చేసుకుంటున్నామన్నది కాదు, ఎంతలా బ్యాలెన్స్ చేస్తూ, క్లారిటీతో ముందుకెళ్తున్నాం? అన్నదే ముఖ్యం! కన్సిస్టెంట్‌గా ఉండండి. విషయాలను సింపుల్‌గా ఉంచండి. ఇప్పటిదాకా ఈ ప్రిపెరేషన్ కోసం, మీరు పెట్టిన కష్టాన్ని నమ్మండి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


