AP POLYCET Hall Ticket 2026 : ఏపీ పాలిసెట్ హాల్ టికెట్లు విడుదల - ఇలా డౌన్లోడ్ చేసుకోండి
AP POLYCET 2026 Hall Tickets : ఏపీ పాలిసెట్-2026 హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. ఏప్రిల్ 25వ తేదీన ఈ ఎగ్జామ్ ఉంటుంది. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌తో పాటు వాట్సాప్ ద్వారా కూడా హాల్‌టికెట్లను పొందవచ్చని అధికారులు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్‌లో పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్ (POLYCET)-2026 రాసే విద్యార్థులకు కీలక అప్‌డేట్ వచ్చేసింది. ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు విడుదలయ్యాయి.

రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షను ఈ నెల 25వ తేదీన (శనివారం) నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ పరీక్ష మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగుతుంది. విద్యార్థులు పరీక్షా కేంద్రానికి సకాలంలో చేరుకోవాలని, హాల్‌టికెట్‌తో పాటు అవసరమైన గుర్తింపు కార్డులను వెంట తెచ్చుకోవాలని అధికారులు సూచించారు.
ఏపీ పాలిసెట్ 2026 - హాల్ టికెట్ డౌన్లోడ్ ఇలా:
- సాధారణంగా వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవడమే కాకుండా, ఈసారి విద్యార్థుల సౌకర్యార్థం వాట్సాప్ ద్వారా కూడా హాల్‌టికెట్లు పొందే వెసులుబాటు కల్పించారు.
- అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://polycetap.ap.gov.in లోకి వెళ్లాలి.
- టెన్త్ హాల్ టికెట్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.
- సబ్మిట్ చేస్తే మీ హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
- ప్రింటే లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా హాల్ టికెట్ కాపీని పొందొచ్చు.
ఇక ఏపీ ప్రభుత్వం తీసుకవచ్చిన మనమిత్ర వాట్సాప్ ద్వారా కూడా పాలిసెట్ హాల్ టికెట్ పొందొచ్చు. 9552300009 నెంబర్ కు వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ చేయాలి. ఎడ్యుకేషన్ సర్వీస్ లోకి వెళ్లి ఈ హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
అభ్యర్థులు చివరి నిమిషం వరకు వేచి చూడకుండా ముందుగానే తమ హాల్‌టికెట్లను ప్రింట్ తీసుకోవాలని అధికారులు సూచించారు. . హాల్‌టికెట్‌పై ఉన్న ఫోటో, పేరు మరియు ఇతర వివరాలను సరిచూసుకోవాలని, ఏవైనా తప్పులు ఉంటే వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించాలని అధికారులు స్పష్టం చేశారు.
ఏపీ పాలిసెట్ 2026 ప్రవేశ పరీక్ష ద్వారా 2026 - 2027 విద్యా సంవత్సరానికి గానూ ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్/ టెక్నాలజీ డిప్లోమా సీట్లను భర్తీ చేస్తారు. ఎగ్జామ్ నిర్వహిణ తర్వాత ప్రాథమిక కీలను ప్రకటిస్తారు. అభ్యంతరాలను స్వీకరించిన తర్వాత… తుది ఫలితాలను విడుదల చేస్తారు. విద్యార్థులు సాధించే ర్యాంకుల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
ప్రశ్న: ఏపీ పాలిసెట్-2026 పరీక్ష ఎప్పుడు జరుగుతుంది?
జవాబు: ఏప్రిల్ 25వ తేదీన (శనివారం) ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరుగుతుంది.
ప్రశ్న: వాట్సాప్ ద్వారా హాల్‌టికెట్ ఎలా పొందాలి?
జవాబు: 9552300009 అనే వాట్సాప్ గవర్నెన్స్ నంబర్‌కు మెసేజ్ పంపడం ద్వారా ఏపీ పాలిసెట్ హాల్‌టికెట్ పొందవచ్చు.
ప్రశ్న: హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ ఏది?
జవాబు: విద్యార్థులు https://polycetap.ap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

