...
...
Next Story

AP POLYCET 2026 Results : ఏపీ పాలిసెట్ ఫలితాలు విడుదల - వాట్సాప్ లో మీ ర్యాంక్ కార్డు ఇలా డౌన్లోడ్ చేసుకోండి

AP Polycet Rank Card Download 2026 : ఏపీ పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష (AP POLYCET ) ఫలితాలు విడుదలయ్యాయి. విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా ర్యాంక్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Published on: May 05, 2026 10:39 AM IST
Advertisement

AP POLYCET 2026 Results : ఏపీ పాలిసెట్ - 2026 ఫలితాలు వచ్చేశాయి. మంగళవారం ఈ ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. క్వాలిఫై అయిన విద్యార్థులకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాలిటెక్నిక్ కళాశాలల్లో ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

వాట్సాప్ ద్వారా ఏపీ పాలిసెట్ ఫలితాలు (image source istock)
వాట్సాప్ ద్వారా ఏపీ పాలిసెట్ ఫలితాలు (image source istock)

ఈ ఏడాది ఏప్రిల్ 25వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన పలు కేంద్రాల్లో పాలిసెట్ పరీక్షను విజయవంతంగా నిర్వహించారు. పరీక్ష జరిగిన రెండు రోజులకే, అంటే ఏప్రిల్ 27న ప్రాథమిక కీ (Preliminary Key) విడుదల చేసి విద్యార్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించారు. ఇప్పుడు తుది కీతో పాటు ఫలితాలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు.

ఈ ఏడాది పాలిసెట్ పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 1,77,581 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా… మొత్తం 1,63,008 మంది హాజరయ్యారు. వీరిలో మొత్తం 1,48,950 మంది విద్యార్థులు అర్హత సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం ఉత్తీర్ణత శాతం 91.37 శాతంగా నమోదైంది.

ఈ ఫలితాల్లో బాలికలు తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలు మెరుగైన ఫలితాలు సాధించడం విశేషం. బాలికల ఉత్తీర్ణత శాతం 93.57 శాతంగా ఉంది.

  • అల్లూరి సీతారామరాజు జిల్లా: 99.11 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది.
  • పోలవరం: 95.46 శాతం ఉత్తీర్ణత సాధించింది.
  • పార్వతీపురం మన్యం: 93.45 శాతంతో మెరుగైన ప్రదర్శన కనబరిచింది.

ఏపీ పాలిసెట్ ర్యాంక్ కార్డు ఎలా చెక్ చేసుకోవాలి?

ఇక ఏపీ పాలిసెట్ ఫలితాలు మనమిత్ర వాట్సాప్ లో కూడా అందుబాటులో ఉంటాయి. హాల్ టికెట్ నెంబర్ ఆధారంగా క్షణాల్లోనే మీ ర్యాంక్ కార్డును చెక్ చేసుకోవచ్చు.

  • మీ మొబైల్‌లో 'మన మిత్ర' అధికారిక నంబర్ 95523 00009ను సేవ్ చేసుకోండి.
  • వాట్సాప్ ఓపెన్ చేసి…. ఆ నంబర్‌కు "Hi" అని మెసేజ్ పంపండి.
  • వెంటనే మీకు వచ్చే ఆప్షన్లలో "ఎడ్యుకేషన్ సర్వీసెస్" ఎంచుకోండి.
  • ఆ తర్వాత "ఏపీ పాలిసెట్ ఫలితాలు 2026" పై క్లిక్ చేయండి.
  • మీ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి సెండ్ చేయగానే, మీ ర్యాంక్ కార్డు స్క్రీన్ మీద కనిపిస్తుంది..

ఏపీ పాలిసెట్ పరీక్షలో మొత్తం 120 మార్కులకు గాను కనీసం 25 శాతం మార్కులు సాధించిన వారిని అర్హులుగా పరిగణిస్తారు. అంటే…. జనరల్ కేటగిరీ విద్యార్థులు కనీసం 30 మార్కులు సాధించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ కేటగిరీ విద్యార్థులకు ఎలాంటి కనీస మార్కుల నిబంధన లేదు. వచ్చిన మార్కుల ఆధారంగానే ర్యాంకును కేటాయిస్తారు.

ఫలితాలు విడుదల కావటంతో త్వరలోనే కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారయ్యే అవకాశం ఉంది. విద్యార్థులు తమ ర్యాంకు ఆధారంగా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో సీట్ల కేటాయింపు ఈ ర్యాంకుల ఆధారంగానే జరుగుతుంది. సీట్లు మిగిలితే స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలు జారీ అవుతాయి.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe