...
...
Next Story

AP RGUKT IIIT Counselling 2026 : ఏపీ ట్రిపుల్ ఐటీ ప్రవేశాల అప్డేట్ - కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల, పూర్తి సమాచారం

AP RGUKT IIIT Counselling 2026 : ఏపీ ట్రిపుల్ ఐటీ ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఈనెల 19వ తేదీ నుంచి ఈ ప్రక్రియ షురూ కానుంది.

Published on: Jun 16, 2026, 12:25:55 IST
Advertisement

AP RGUKT IIIT Counselling 2026 : రాష్ట్రంలోని ట్రిపుల్ ఐటీ (IIIT) కాలేజీల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు కీలక అప్‌డేట్ వచ్చేసింది. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (RGUKT) నాలుగు క్యాంపస్‌లలో (నూజివీడు, ఆర్కే వ్యాలీ, ఒంగోలు, శ్రీకాకుళం) ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బి.టెక్ కోర్సులో సీట్లు పొందిన విద్యార్థుల కోసం సర్టిఫికేట్ వెరిఫికేషన్ (కౌన్సెలింగ్) షెడ్యూల్‌ను అధికారులు ప్రకటించారు.

ఏపీ ట్రిపుల్ ఐటీ ప్రవేశాల కౌన్సెలింగ్
ఏపీ ట్రిపుల్ ఐటీ ప్రవేశాల కౌన్సెలింగ్

ప్రాథమికంగా ఎంపిక జాబితాలో స్థానం సంపాదించుకున్న అభ్యర్థులు తమకు కేటాయించిన తేదీల్లో నిర్దేశిత కేంద్రాలకు హాజరై ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు స్వయంగా కౌన్సెలింగ్‌కు హాజరుకావాల్సి ఉంటుందని, ఒకరి బదులు మరొకరు హాజరైతే సీటు కేటాయించరని అధికారులు స్పష్టం చేశారు.

సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్ :

నూజివీడు క్యాంపస్

  • నూజివీడు క్యాంపస్‌కు ఎంపికైన విద్యార్థులకు జూన్ 19, జూన్ 20 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తారు.
  • వేదిక: ఆర్జీయూకేటీ-నూజివీడు క్యాంపస్, ఏలూరు జిల్లా.

ఆర్కే వ్యాలీ క్యాంపస్ (ఇడుపులపాయ)

  • ఆర్కే వ్యాలీ క్యాంపస్‌కు ఎంపికైన అభ్యర్థులకు జూన్ 19, జూన్ 20 తేదీల్లో కౌన్సెలింగ్ జరుగుతుంది.
  • వేదిక: ఆర్జీయూకేటీ-ఆర్కే వ్యాలీ క్యాంపస్, ఇడుపులపాయ, వైఎస్ఆర్ కడప జిల్లా.

ఒంగోలు క్యాంపస్

  • ఒంగోలు క్యాంపస్‌కు సీట్లు పొందిన విద్యార్థులు కూడా ఇడుపులపాయ క్యాంపస్‌లోనే కౌన్సెలింగ్‌కు హాజరుకావాల్సి ఉంటుంది. వీరికి జూన్ 22, జూన్ 23 తేదీల్లో వెరిఫికేషన్ నిర్వహిస్తారు.
  • వేదిక: ఆర్జీయూకేటీ-ఆర్కే వ్యాలీ క్యాంపస్, ఇడుపులపాయ, వైఎస్ఆర్ కడప జిల్లా.

శ్రీకాకుళం క్యాంపస్

  • శ్రీకాకుళం క్యాంపస్‌కు ఎంపికైన విద్యార్థులకు జూన్ 23, జూన్ 24 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ జరుగుతుంది.
  • వేదిక: ఆర్జీయూకేటీ-శ్రీకాకుళం క్యాంపస్, ఎచ్చెర్ల.

విద్యార్థులు కౌన్సెలింగ్ సమయానికి తమ ఒరిజినల్ సర్టిఫికేట్లతో పాటు నిర్దేశిత సంఖ్యలో జిరాక్స్ కాపీల సెట్లను, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలను సిద్ధం చేసుకోవాలని యూనివర్సిటీ వర్గాలు సూచించాయి. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ admissions.rgukt.in సందర్శించవచ్చు.

ఏపీ ట్రిపుల్ ఐటీ ప్రవేశాలు - ఇలా చెక్ చేసుకోండి:

డిజిటల్ సేవలను మరింత సులభతరం చేస్తూ ఈసారి వాట్సాప్‌ (WhatsApp) ద్వారా కూడా ఫలితాలను చెక్‌ చేసుకునే వినూత్న సదుపాయాన్ని అధికారులు కల్పించారు. దీనికోసం విద్యార్థులు 9552300009 నంబర్‌కు వాట్సప్ మెసేజ్ పంపి, అందులో 'ఎడ్యుకేషన్‌ సర్వీసెస్‌' విభాగాన్ని ఎంచుకోవాలి. ఆ తర్వాత 'ఆర్‌జీయూకేటీ అడ్మిషన్స్‌ 2026 రిజల్ట్స్‌' (RGUKT Admissions 2026 Results) ఆప్షన్‌పై క్లిక్ చేసి, తమ అప్లికేషన్‌ నంబర్‌ ఎంటర్ చేస్తే ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.

మరోవైపు ఎంపికైన అభ్యర్థులకు కొత్త విద్యా సంవత్సరం తరగతుల నిర్వహణపై ఆర్‌జీయూకేటీ స్పష్టత ఇచ్చింది. ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లలో కొత్త బ్యాచ్ (పీయూసీ-1) తరగతులు జులై 1 నుంచి ప్రారంభం కానున్నాయి. గత విద్యా సంవత్సరంలో జులై 15 నుంచి తరగతులు మొదలుకాగా… ఈసారి విద్యార్థులకు నష్టం జరగకుండా 15 రోజుల ముందుగానే క్లాసులు స్టార్ట్ చేయాలని నిర్ణయించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks