వాట్సాప్ గవర్నెన్స్‌లో పోలీస్ సేవలు.. ఎఫ్ఐఆర్ స్టేటస్, చలాన్లు చెక్ చేసుకోవచ్చు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాట్సాప్ ద్వారా సేవలు పొందవచ్చు. పోలీస్ సేవలు కూడా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందిస్తోంది.
ఏపీ ప్రభుత్వం ప్రజలకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ సేవలు ఒక్క క్లిక్‌తో మీ ఫోన్‌లో పొందవచ్చు. ఆఫీసుల చుట్టూ పదే పదే తిరగాల్సిన పని లేకుండా ప్రభుత్వం చేస్తోంది. ఇప్పటికే అనేక సేవలను ఆన్‌లైన్‌లో తీసుకొచ్చింది. వాట్సాప్ గవర్నెన్స్ పేరుతో మీరు చాలా సర్వీసులు పొందవచ్చు. పలు రకాల సర్టిఫికేట్లు పొందేందుకు ఆన్‌లైన్ సేవలు ఉన్న విషయం తెలిసిందే. మనమిత్ర వాట్సాప్ గవర్నమెంట్ ద్వారా అనేక సేవలను జనాలు పొందుతున్నారు.

సంక్రాంతి వరకు మరిన్ని సేవలు ఆన్‌లైన్‌లో అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇక ఇంటి నుంచే ఎలాంటి సర్వీస్ అయినా పొందేలా ప్లాన్ చేస్తోంది. అంతా డిజిటల్ చేయాలని యోచిస్తోంది. దీనిద్వారా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పని తగ్గుతుంది. తాజాగా మరో సేవను కూడా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందిస్తున్నారు.
పోలీస్ సేవలను కూడా వాట్సాప్ గవర్నెన్స్‌లో చేర్చారు. ఎఫ్ఐఆర్, ట్రాఫిక్ చలాన్ వివరాలను వాట్సాప్ ద్వారా తెలుసుకోవచ్చు. మీ వాహనంపై ఉన్న ట్రాఫిక్ చలాన్లను తెలుసుకుని చెల్లింపులు చేయవచ్చు. ఈ సేవల కోసం 9552300009 నెంబర్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఈ నెంబర్‍ను మీ ఫోన్లో సేవ్ చేసుకోవాలి.
ఈ నెంబర్‌కు వాట్సాప్‌లో భీఖి అని మెసేజ్ పంపాలి. దీంతో మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ఆప్షన్ కనిపిస్తుంది. ఒకవేళ మీకు ఈ సేవలు తెలుగులో కావాలనుకుంటే.. టీఈ అని టైప్ చేయాలి. తెలుగు భాషలోకి మారుతుంది. ఆ తర్వాత సేవను ఎంచుకోండిపై క్లిక్ చేయాలి. అనంతరం వచ్చిన సేవల్లో పోలీస్ శాఖ సేవలు ఎంచుకోవాలి. ఎఫ్ఐఆర్, ఎఫ్ఐఆర్ స్టేటస్, ఈ-చలాన్ ఆప్షన్స్ కనిపిస్తాయి.
మీరు ఈ చలాన్ ద్వారా వాహనంపై ఎన్ని చలాన్లు ఉన్నాయో చూసుకోవచ్చు. చలాన్ లేకపోతే.. నో చలాన్ ఫౌండ్ అని కనిపిస్తుంది. ఇందుకోసం ఈ చలాన్ వివరాలను ఎంపిక చేసి.. మీ వాహనం నెంబర్ నమోదు చేసి ఎంటర్ చేయాలి. దీంతో మీ వెహికల్ రిజిస్ట్రేషన్ మీద ఉన్న చలాన్లు కనపడుతాయి. తర్వాత మీరు ఆన్‌లైన్ చెల్లింపులు చేయవచ్చు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


