తెలంగాణ మంత్రుల వాట్సాప్ గ్రూప్స్ హ్యాక్.. మీరు ఇలా చేయండి సేఫ్!
తెలంగాణలో పలువురు మంత్రులు వాట్సాప్ మీడియా గ్రూపులు హ్యాక్ అయ్యియి. దీంతో కాసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. మీ వాట్సాప్ హ్యాక్ అవ్వకుండా ఉండాలంటే టూ స్టెప్ వెరిఫికేషన్ చేసుకోవాలి. అదేలాగో చూద్దాం..
కొన్ని రోజులుగా అనేక వాట్సాప్ గ్రూపులను హ్యాకర్లు టార్గెట్ చేసుకుంటున్నారు. తెలిసిన వ్యక్తుల నుంచే ఫైల్స్ వచ్చినప్పటికీ వాటిని ఓపెన్ చేయకూడదు. ఎందుకంటే మెుదటగా మీకు తెలిసిన వ్యక్తి వాట్సాప్‌ను హ్యాక్ చేస్తారు సైబర్ నేరగాళ్లు. మీ ఎస్బీఐ, ఆధార్‌లాంటివి అప్డేట్ చేయాలంటూ..apk ఫైల్స్ పంపిస్తారు. దాదాపు చాలా మంది తెలిసిన వ్యక్తి నుంచి వచ్చిన ఫైల్ కదా అని ఓపెన్ చేస్తారు. తర్వాత మీరు చేయడానికి ఏం ఉండదు. అంతా హ్యాక్ అయిపోతుంది. హ్యాకర్ మీ వాట్సాప్‌తో ఇష్టం వచ్చినట్టుగా ఆడుకుంటాడు.

తాజాగా తెలంగాణలోని మంత్రుల వాట్సాప్ మీడియా గ్రూపుల్ హ్యాక్ అయ్యాయి. ఏస్‌బీఐ కేవైసీ పేరుతో ఏపీకే ఫైల్స్ షేర్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఆధార్ అప్డేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ ఫైల్స్ ఓపెన్ చేయవద్దని పోలీసులు చెబుతున్నారు.
గత రెండు రోజులుగా వాట్సాప్ గ్రూపులు హ్యాక్ అవుతున్నట్టుగా అనేక నివేదికలు వచ్చాయని అధికారులు అంటున్నారు. హ్యాకర్లు మీ డేటాను దొంగిలించే, లేదా మీ ఖాతాను కంట్రోల్ చేసే హానికరమైన APK ఫైల్స్ పంపిస్తున్నారు. తెలియని APK ఫైల్‌లను తెరవవద్దు లేదా ఇన్‌స్టాల్ చేయవద్దు. ఫార్వార్డ్ చేసిన సందేశాలతో జాగ్రత్తగా ఉండండి. WhatsAppలో రెండు టూ స్టెప్ వెరిఫికేషన్ చేయండి.
టూ స్టెప్ వెరిఫికేషన్ ఎలా చేయాలి?
వాట్సాప్ ఓపెన్ చేయండి.
సెట్టింగ్స్ మీద నొక్కండి :
ఆండ్రాయిడ్‌లో సెట్టింగ్స్ కోసం మూడు చుక్కలను నొక్కండి (⋮)
ఐఫోన్‌లో దిగువన ఉన్న సెట్టింగ్‌లను నొక్కండి
మీకు అక్కడ అకౌంట్ అని కనిపిస్తుంది. దానిపై నొక్కండి.
తర్వాత టూ స్టెప్ వెరిఫికేషన్ ఉంటుంది. ఎనేబుల్ నొక్కండి
6-అంకెల పిన్‌ను సెట్ చేయండి
మీ ఇమెయిల్ చిరునామాను జోడించండి
మీరు పిన్‌ను మరచిపోతే దాన్ని రీసెట్ చేయడంలో మెయిల్ మీకు సహాయపడుతుంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


