...
...
Next Story

AP SET Updates : ఏపీ సెట్ దరఖాస్తులు ప్రారంభం - మార్చి 28, 29 తేదీల్లో పరీక్షలు

ఏపీ సెట్ - 2025 దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన పరీక్షలను మార్చి 28, 29 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ మేరకు సెట్‌ అధికారులు వివరాలను ప్రకటించారు. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 9 లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Published on: Jan 11, 2026, 06:02:14 IST
Advertisement

ఏపీ సెట్ - 2025పై అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. పరీక్ష తేదీలను ప్రకటించారు. లెక్చరర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నియామకాలకు సంబంధించిన నిర్వహించే సెట్ పరీక్షను మార్చి 28, 29 తేదీల్లో నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం….

ఏపీ సెట్ పరీక్ష తేదీలు
ఏపీ సెట్ పరీక్ష తేదీలు

మరోవైపు జనవరి 9వ తేదీ నుంచి ఏపీ సెట్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఫిబ్రవరి 9, 2026 వరకు అప్లై చేసుకోవచ్చు. జనరల్‌ అభ్యర్థులు రూ.1600, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ రూ.1300, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఇతరులు రూ.900 దరఖాస్తు రుసుం చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు.

ఏపీ సెట్ - 2025 పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు మార్చి 19 నుంచి అందుబాటులోకి వస్తాయి. వీటిని https://www.apset.net.in వెబ్‌సైట్‌ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. పరీక్షల నిర్వహణ తర్వాత… కీలను ప్రకటిస్తారు. ఆ తర్వాత ఫలితాలను విడుదల చేస్తారు.

  • ఏపీ సెట్ (AP SET 2025) ను 2 పేపర్లలో నిర్వహిస్తారు. పేపర్-1 జనరల్ స్టడీస్, టీచింగ్ అండ్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్ అంశాలపై ప్రశ్నలు అడుగుతారు.పేపర్‌- 2 లో సబ్జెక్ట్ స్పెషలైజేషన్‌లో(30 సబ్జెక్టులు) ఉంటుంది.
  • సెట్ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఒకటే రోజున పరీక్షను రెండు వేర్వేరు సెషన్లలో పెడతారు.
  • పేపర్‌-1లో 50 ప్రశ్నలకు 100 మార్కులు, పేపర్‌-2లో 100 ప్రశ్నలకు 200 మార్కులు ఉంటాయి. మొత్తం 300 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. మొత్తం మూడు గంటల సమయం ఉంటుంది.
  • ఏపీ సెట్ కోసం గరిష్ట వయోపరిమితి లేదు. ఒక అభ్యర్థి ఎన్ని సార్లు అయినా ఈ పరీక్షను రాయవచ్చు.
  • జనరల్, వెనుకబడిన తరగతుల అభ్యర్థులు కనీసం 55 శాతం మార్కులతో, బీసీ, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్, వీహెచ్ అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో యూజీసీ(UGC) గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.
  • సెట్‌లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఏపీలోని విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అవుతారు.
  • ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లు: www.apset.net.in లేదా www.andhrauniversity.edu.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

ఈ లింక్ పై క్లిక్ చేసి ఏపీ సెట్ - 2025కు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe