ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అర్హత పరీక్ష(AP SET - 2025)కు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. రాత పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిని అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు ఓ ప్రకటన ద్వారా సూచించారు.
ఈనెల 28,29 తేదీల్లో పరీక్షలు…

మార్చి 28, 29 తేదీల్లో ఈ పరీక్ష జరగనుంది. పరీక్షా కేంద్రాల్లో ప్రత్యేకంగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో ఏపీ సెట్ నిర్వహిస్తారు. ఆఫ్‌లైన్ లేదా పెన్-అండ్-పేపర్ మోడ్ అనుమతించరు.
ఏపీ సెట్ పరీక్షకు రెండు పేపర్లు ఉంటాయి. ఈ పరీక్షలో పేపర్ 1 టీచింగ్ అండ్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్ 50 ప్రశ్నలకు 100 మార్కులు, పేపర్ 2 సబ్జెక్ట్ పేపర్ ఉంటాయి. 100 ప్రశ్నలకు 200 మార్కుల చొప్పున మొత్తం 300 మార్కులకు కేటాయించారు. పరీక్ష వ్యవధి మూడు గంటలుగా ఉంటుంది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు ఏపీ సెట్ అధికారిక వెబ్‌సైట్‌ను చెక్ చేయవచ్చు.
ఏపీ సెట్ హాల్ టికెట్ - డౌన్లోడ్ ఇలా:
- అభ్యర్థులు ముందుగా https://apset.aptonline.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోం పేజీలోని డౌన్లోడ్ హాల్ టికెట్ లింక్ పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ అభ్యర్థి రిజిస్ట్రేషన్ నెంబర్, పేమెంట్ ఐడీ, మొబైల్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.
- గెట్ హాల్ టికెట్ పై క్లిక్ చేస్తే మీ హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా హాల్ టికెట్ కాపీని పొందొచ్చు.
- భవిష్యత్తులో హాల్ టికెట్ అవసరం ఉంటుంది.. కాబట్టి జాగ్రత్తగా ఉంచుకోవాలి.
ఏపీ సెట్ ఎగ్జామ్ నిర్వహణ తర్వాత ప్రాథమిక కీలను ప్రకటిస్తారు. వీటిపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఆపై తుది కీలను ప్రకటించి… ఫలితాలను ప్రకటిస్తారు. సబ్జెక్టుల వారీగా అభ్యర్థులు సాధించే మార్కుల ఆధారంగా కటాఫ్ నిర్ణయించి.. సెట్ పత్రాలను జారీ చేస్తారు.
{{/usCountry}}ఏపీ సెట్ ఎగ్జామ్ నిర్వహణ తర్వాత ప్రాథమిక కీలను ప్రకటిస్తారు. వీటిపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఆపై తుది కీలను ప్రకటించి… ఫలితాలను ప్రకటిస్తారు. సబ్జెక్టుల వారీగా అభ్యర్థులు సాధించే మార్కుల ఆధారంగా కటాఫ్ నిర్ణయించి.. సెట్ పత్రాలను జారీ చేస్తారు.
{{/usCountry}}