AP SSC Results 2026 : ఏపీ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - నేడు పదో తరగతి ఫలితాల ప్రకటన...!

AP SSC 10th Class Results 2026 : ఏపీ పదో తరగతి విద్యార్థులకు కీలక అప్‌డేట్. ఏప్రిల్ 30 ఫలితాలు విడుదల కానున్నాయి. మంత్రి నారా లోకేష్ ఈ ఫలితాలను ప్రకటిస్తారు. 

Published on: Apr 29, 2026, 06:34:39 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

AP SSC 10th Class Results 2026 : ఏపీ పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు నిరీక్షణకు తెరపడనుంది. ఎంతగానో ఎదురుచూస్తున్న ఫలితాల విడుదలకు ముహుర్తం ఫిక్స్ అయింది. ఈ ఫలితాలను గురువారం(ఏప్రిల్ 30) విడుదల చేసేందుకు ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ‘ఎక్స్‌’ (ట్విట్టర్) వేదికగా ఈ ఫలితాలను అధికారికంగా విడుదల చేస్తారు.

ఏపీ టెన్త్ పరీక్షలు 2026
ఏపీ టెన్త్ పరీక్షలు 2026

ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మొత్తం 6,40,916 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. ఇందులో బాలురు 3,28,652 మంది, బాలికలు 3,12,264 మంది వరకు ఉన్నారు. వీరంతా కూడా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. మార్చి నెలలో ప్రారంభమైన ఈ పరీక్షలు ఏప్రిల్ 1తో పూర్తయ్యాయి.

రాష్ట్ర వ్యాప్తంగా 23 జిల్లాల్లో చేపట్టిన మూల్యాంకనం ప్రక్రియ ఏప్రిల్ 15తో ముగిసింది. ఎస్‌వోలు, సీఎస్‌లు, క్యాంపు ఆఫీసర్లు, ఉపాధ్యాయులు మూల్యాంకనాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. అయితే మార్కులను మాన్యువుల్‌తో పాటు ట్యాబ్‌ల్లోనూ నమోదు చేశారు. మార్కుల లెక్కింపులో పొరపాటు లేకుండా ఉండేందుకు ఈ ఏడాది ట్యాబ్‌లను తీసుకొచ్చారు. మొదట్లో ట్యాబ్ లో ఎంట్రీ చేసే క్రమంలో కొంత జాప్యం జరిగినప్పటికీ… చివరగా ఈ ప్రక్రియ కూడా పూర్తి అయింది. సాంకేతిక ప్రక్రియను, కోడింగ్, డీకోడింగ్ సాంకేతిక పనులను కూడా వేగంగా పూర్తి చేశారు. దీంతో త్వరగానే ఫలితాలను సిద్ధం చేశారు.

ఏపీ పదో తరగతి ఫలితాలను https://www.bse.ap.gov.in/ వెబ్ సైట్ లేదా ప్రభుత్వం ప్రవేశపెట్టిన మనమిత్ర వాట్సాప్ లో చెక్ చేసుకోవచ్చు. హాల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేస్తే ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.

వాట్సాప్ లో ఏపీ టెన్త్ ఫలితాలు…

  • మీ మొబైల్‌లో 95523 00009 నంబర్‌ను సేవ్ చేయండి.
  • వాట్సాప్‌లో ఈ నంబర్‌కు "Hi" అని మెసేజ్ పంపండి.
  • మెనూలో 'Education Services' ఆప్షన్‌ను ఎంచుకోండి.
  • ఆ తర్వాత 'Download SSC Results' పై క్లిక్ చేసి, మీ హాల్ టికెట్ నంబర్ ఇస్తే చాలు. మీ మార్కుల మెమో డిస్ ప్లే అవుతుంది.

ఫలితాల ప్రకటన తర్వాత రీ-వెరిఫికేషన్, రీ-కౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన షెడ్యూల్‌ను ఫలితాల రోజే విద్యాశాఖ విడుదల చేస్తుంది. అంతేకాకుండా ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహిస్తారు. ఆ షెడ్యూల్ ను కూడా రేపే ప్రకటించే అవకాశం ఉంటుంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More