ఏపీ పదో తరగతి విద్యార్థులకు బిగ్ అప్డేట్ వచ్చేసింది. వార్షిక పరీక్షల షెడ్యూల్ ను విడుదలైంది. వచ్చే ఏడాది మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభమవుతాయి. ఏప్రిల్ 1 వరకు ఈ ఎగ్జామ్స్ జరుగుతాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు ఈ పరీక్షలను నిర్వహిస్తామని ప్రభుత్వ పరీక్షల విభాగం ఓ ప్రకటన ద్వారా తెలిపింది.
ఏ పరీక్ష ఎప్పుడంటే...?

మార్చి 16, 2026 – ఫస్ట్ లాంగ్వేజ్
మార్చి 18, 2026 – సెకండ్ లాంగ్వేజ్
మార్చి 20, 2026 - ఇంగ్లీష్
మార్చి 23, 2026 – గణితం(మ్యాథ్స్)
మార్చి 25, 2026 – ఫిజిక్స్
మార్చి 28, 2026 – బయాలజీ
మార్చి 30 , 2026 – సోషల్ స్టడీస్
మార్చి 31, 2026 – ఫస్ట్ లాంగ్వేజ్ (పేపర్ 2)
ఏప్రిల్ 1, 2026 – ఒకేషనల్ కోర్సు
ప్రస్తుతం రూ.50 ఆలస్య రుసుముతో నవంబరు 26 నుంచి డిసెంబరు 3 వరకు టెన్త్ విద్యార్థులు ఫీజు చెల్లించుకోవచ్చు. ఈ తేదీ కూడా దాటితే రూ.200 ఫైన్ తో డిసెంబరు 4 నుంచి 10 వరకు, రూ.500 ఫైన్ తో డిసెంబరు 11 నుంచి 15 వరకు ఫీజు చెల్లింపులు చేసుకునే వీలుంటుంది.
రెగ్యూలర్ విద్యార్థులు అన్ని పేపర్లకు కలిపి రూ. 125 చెల్లించాలి. ఫెయిన్ అయిన విద్యార్థులు 3 పేపర్ల కంటే ఎక్కువ రాస్తే రూ. 125, మూడు పేపర్ల లోపు అయితే రూ. 110 చెల్లించాలి. వొకేషనల్ విద్యార్థులు అయితే అదనంగా రూ. 60, విద్యార్థి వయసు విషయంలో తేడాలుంటే రూ. 300 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
వార్షిక పరీక్షల ఫీజును https://bse.ap.gov.in/ వెబ్సైట్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ఎక్కువ మంది చివరిలో పరీక్ష ఫీజు చెల్లించేందుకు ప్రయత్నిస్తే సర్వర్ సమస్య తలెత్తే అవకాశం ఉంటుందని అధికారులు హెచ్చరించారు. ముందుగానే ఫీజులు చెల్లించుకోవాలని సూచిస్తున్నారు.
{{/usCountry}}వార్షిక పరీక్షల ఫీజును https://bse.ap.gov.in/ వెబ్సైట్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ఎక్కువ మంది చివరిలో పరీక్ష ఫీజు చెల్లించేందుకు ప్రయత్నిస్తే సర్వర్ సమస్య తలెత్తే అవకాశం ఉంటుందని అధికారులు హెచ్చరించారు. ముందుగానే ఫీజులు చెల్లించుకోవాలని సూచిస్తున్నారు.
{{/usCountry}}