...
...
Next Story

తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ అలర్ట్ - బలమైన గాలులతో పాటు వర్షాలు..!

AP TG Weather Updates 2026 : తెలుగు రాష్ట్రాల్లో రాబోయే ఐదు రోజుల పాటు వాతావరణంలో పలు మార్పులు రానున్నాయి. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు పడే సూచనలున్నాయి. గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

Published on: Jul 8, 2026, 07:20:26 IST
Advertisement

AP Telangana Weather Updates 2026 :తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాబోయే ఐదు రోజుల పాటు వాతావరణం వేగంగా మారనుంది. పలు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా…. వర్షాల కంటే ఈదురు గాలుల తీవ్రత అత్యధికంగా ఉంటుందని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రాలు వేర్వురు ప్రకటనల ద్వారా వెల్లడించాయి.

తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ అలర్ట్
తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ అలర్ట్

ఏపీలోని కోస్తాంధ్రా తీరప్రాంతాల్లో వాతావరణం పూర్తిగా చల్లబడింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కొన్ని చోట్ల పడే అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు చోట్ల పిడుగులు పడే ప్రమాదం కూడా పొంచి ఉంది. ఇక్కడ గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి.

  • దక్షిణ కోస్తాలో చూస్తే ఒకటి రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయి. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుంది. బలమైన ఈదురు గాలులు ప్రజలను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది.
  • ఇక రాయలసీమలో ఇవాళ, రేపు కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడే సూచనలున్నాయి. కొన్ని ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీచే సూచనలున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.

తెలంగాణకు రెయిన్ అలర్ట్ :

తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక సూచనలు చేసింది. పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వర్షాలతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తీవ్రమైన ఈదురు గాలులు వీస్తాయని అంచనా వేసింది.

బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున పాత భవనాలు, చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద ఉండరాదని అధికారులు సూచించారు. ముఖ్యంగా రైతులు పంట ఉత్పత్తుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని…. గాలుల తీవ్రత వల్ల చెట్లు లేదా కొమ్మలు విరిగిపడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks