...
...
Next Story

AP TET Results : ఏపీ టెట్‌ ఫలితాలు విడుదల - మీ స్కోర్ కార్డు ఇలా చెక్ చేసుకోండి

ఏపీ టెట్ - 2025 ఫలితాలు విడుదలయ్యాయి. ఈసారి 97,560 మంది (39.27 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఈ ఫలితాలను https://tet2dsc.apcfss.in లేదా http://cse.ap.gov.in లో చెక్ చేసుకోవచ్చు.

Published on: Jan 09, 2026 11:01 PM IST
Advertisement

ఏపీ టెట్ ఫలితాలు వచ్చేశాయ్. ఈసారి జరిగిన పరీక్షలకు 2,71,692 మంది దరఖాస్తు చేసుకోగా.. 2,48,427 మంది హాజరయ్యారు. ఇందులో 97,560 మంది (39.27 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఇక 31,886 మంది ఇన్‌ సర్వీసు ఉపాధ్యాయులు హాజరుకాగా.. వీరిలో 47.82 శాతం(15,239) మంది టీచర్ల అర్హత సాధించారు.

ఏపీ టెట్ ఫలితాలు - ఇలా చెక్ చేసుకోండి

  • ఏపీ టెట్ అభ్యర్థులు https://tet2dsc.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోం పేజీలోని ఏపీ టెట్ మార్క్స్ మెమో ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • ఇక్కడ అభ్యర్థి లాగిన్ వివరాలను ఎంట్రీ చేయాలి.
  • సబ్మిట్ చేస్తే అభ్యర్థి సాధించిన స్కోర్ డిస్ ప్లే అవుతుంది.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా ప్రాథమిక కీలను పొందవచ్చు.

ఏపీ టెట్ ఫలితాలు 2025
ఏపీ టెట్ ఫలితాలు 2025

ఏపీ టెట్ ఫలితాలను http://cse.ap.gov.in వెబ్ సైట్ లో కూడా తెలుసుకోవచ్చు. ఇక మనమిత్ర వాట్సాప్ 9552300009 నెంబర్ ద్వారా కూడా టెట్ రిజల్ట్స్ పొందవచ్చని అధికారులు ఓ ప్రకటన ద్వారా తెలిపారు.

డిసెంబర్ 10వ తేదీ నుంచి టెట్ పరీక్షలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఉదయం, మధ్యాహ్నం సెషన్లవారీగా ఈ ఎగ్జామ్స్ ను నిర్వహించగా… డిసెంబర్ 21వ తేదీతో అన్ని పేపర్లు పూర్తయ్యాయి. ముందుగా కొన్ని పేపర్ల ప్రాథమిక కీలను విడుదల చేయగా… ఆ తర్వాత మిగతా పేపర్ల ప్రాథమిక కీలను కూడా ప్రకటించారు. వీటిపై అభ్యంతరాలను స్వీకరించారు. పరిశీలించిన తర్వాత ఇవాళ (జనవరి 9) ఫైనల్ కీలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆ వెంటనే ఫలితాలను కూడా ప్రకటించారు.

ఈ లింక్ పై క్లిక్ చేసి ఏపీ టెట్ స్కోర్ కార్డును చెక్ చేసుకోవచ్చు

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe