ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఏపీ టెట్)- 2025లకు సంబంధించి అధికారులు కీలక అప్డేట్ ిచ్చారు.ఈనెల 10వ తేదీన ఉదయం, మధ్యాహ్నం జరిగిన పేపర్-2ఎ తెలుగు భాష పరీక్ష, 11వ తేదీన ఉదయం నిర్వహించిన పేపర్-2 మైనర్ లాంగ్వేజ్ పరీక్షల ప్రాథమిక కీను విడుదల చేశారు. ఈ సెషన్లలో జరిగిన పరీక్షలకు హాజరైన అభ్యర్థులు https://tet2dsc.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఏపీ టెట్ ప్రాథమిక కీలు - డౌన్లోడ్ ప్రాసెస్
- ఏపీ టెట్ అభ్యర్థులు https://tet2dsc.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోం పేజీలోని టెట్ ప్రిలిమినరీ ఆన్సర్ కీ లింక్ పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ సబ్జెక్ట్ పేపర్లు కనిపిస్తాయి. చివర్లో ఉండే కీ లింక్ పై క్లిక్ చేస్తే పీడీఎఫ్ డౌన్లోడ్ అవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా ప్రాథమిక కీలను పొందవచ్చు.

ప్రస్తుతం విడుదలైన ఏపీ టెట్ ప్రాథమిక కీలపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 24వ తేద వరకు పంపొచ్చు. అభ్యర్థుల వారి లాగిన్ వివరాలతో ప్రాథమిక కీలపై అభ్యంతరాలను తెలపవచ్చని అధికారులు ఓ ప్రకటన ద్వారా తెలిపారు.
ఈసారి జరిగే టెట్ పరీక్షల కోసం మొత్తం 2,41,509 మంది అభ్యర్థులు 2,71,692 దరఖాస్తులు సమర్పించారు. ఇందులో కొందరు పేపర్ 1తో పాటు పేపర్ 2 కు కూడా అప్లయ్ చేసుకున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈసారి టెట్‌కు 32 వేల మంది ఇన్ సర్వీస్ టీచర్లు కూడా దరఖాస్తు చేసుకున్నారు.
విద్యాశాఖ వెల్లడించిన షెడ్యూల్ ప్రకారం… ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో నిర్వహిస్తారు. డిసెంబర్ 11వ తేదీన పలు భాషాలకు సంబంధించిన పరీక్షలుంటాయి. ఈనెల19వ తేదీన మ్యాథ్స్ అండ్ సైన్స్ తో పాటు ఇతర సబ్జెక్టుల పేపర్లను నిర్వహిస్తారు. డిసెంబర్ 21వ తేదీతో అన్ని సబ్జెక్టుల పరీక్షలు పూర్తవుతాయి. జనవరి 13వ తేదీన ఏపీ టెట్ ఫైనల్ కీని ప్రకటిస్తారు.జనవరి 19వ తేదీన తుది ఫలితాలను వెల్లడిస్తారు.