AP TET 2025 Keys : ఏపీ టెట్ అభ్యర్థులకు అప్డేట్ - ప్రాథమిక కీలు విడుదల, ఇలా డౌన్లోడ్ చేసుకోండి

ఏపీ టెట్ - 2025 పరీక్షలపై కీలక అప్డేట్ వచ్చేసింది. డిసెంబర్ 10,11 తేదీల్లో జరిగిన పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీలు అందుబాటులోకి వచ్చాయి. అభ్యంతరాలుంటే ఈనెల 24వ తేదీలోపు తెలపవచ్చని అధికారులు సూచించారు.

Published on: Dec 19, 2025, 09:44:37 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఏపీ టెట్‌)- 2025లకు సంబంధించి అధికారులు కీలక అప్డేట్ ిచ్చారు.ఈనెల 10వ తేదీన ఉదయం, మధ్యాహ్నం జరిగిన పేపర్‌-2ఎ తెలుగు భాష పరీక్ష, 11వ తేదీన ఉదయం నిర్వహించిన పేపర్‌-2 మైనర్‌ లాంగ్వేజ్‌ పరీక్షల ప్రాథమిక కీను విడుదల చేశారు. ఈ సెషన్లలో జరిగిన పరీక్షలకు హాజరైన అభ్యర్థులు https://tet2dsc.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఏపీ టెట్ ప్రాథమిక కీలు
ఏపీ టెట్ ప్రాథమిక కీలు

ఏపీ టెట్ ప్రాథమిక కీలు - డౌన్లోడ్ ప్రాసెస్

  • ఏపీ టెట్ అభ్యర్థులు https://tet2dsc.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోం పేజీలోని టెట్ ప్రిలిమినరీ ఆన్సర్ కీ లింక్ పై క్లిక్ చేయాలి.
  • ఇక్కడ సబ్జెక్ట్ పేపర్లు కనిపిస్తాయి. చివర్లో ఉండే కీ లింక్ పై క్లిక్ చేస్తే పీడీఎఫ్ డౌన్లోడ్ అవుతుంది.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా ప్రాథమిక కీలను పొందవచ్చు.

ప్రస్తుతం విడుదలైన ఏపీ టెట్ ప్రాథమిక కీలపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 24వ తేద వరకు పంపొచ్చు. అభ్యర్థుల వారి లాగిన్ వివరాలతో ప్రాథమిక కీలపై అభ్యంతరాలను తెలపవచ్చని అధికారులు ఓ ప్రకటన ద్వారా తెలిపారు.

ఈసారి జరిగే టెట్ పరీక్షల కోసం మొత్తం 2,41,509 మంది అభ్యర్థులు 2,71,692 దరఖాస్తులు సమర్పించారు. ఇందులో కొందరు పేపర్ 1తో పాటు పేపర్ 2 కు కూడా అప్లయ్ చేసుకున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈసారి టెట్‌కు 32 వేల మంది ఇన్ సర్వీస్ టీచర్లు కూడా దరఖాస్తు చేసుకున్నారు.

విద్యాశాఖ వెల్లడించిన షెడ్యూల్ ప్రకారం… ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో నిర్వహిస్తారు. డిసెంబర్ 11వ తేదీన పలు భాషాలకు సంబంధించిన పరీక్షలుంటాయి. ఈనెల19వ తేదీన మ్యాథ్స్ అండ్ సైన్స్ తో పాటు ఇతర సబ్జెక్టుల పేపర్లను నిర్వహిస్తారు. డిసెంబర్ 21వ తేదీతో అన్ని సబ్జెక్టుల పరీక్షలు పూర్తవుతాయి. జనవరి 13వ తేదీన ఏపీ టెట్ ఫైనల్ కీని ప్రకటిస్తారు.జనవరి 19వ తేదీన తుది ఫలితాలను వెల్లడిస్తారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More