...
...
Next Story

AP TET 2026 Keys : ఏపీ టెట్ ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్లు విడుదల - ఇలా డౌన్లోడ్ చేసుకోండి

AP TET 2026 Answer Keys : ఏపీ టెట్ 2026 ప్రాథమిక సమాధానాల కీ, రెస్పాన్స్ షీట్లను విద్యాశాఖ విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి వాటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 15న తుది ఫలితాలు వెల్లడించనున్నారు.

Published on: Aug 20, 2026, 09:30:59 IST
Advertisement

AP TET 2026 Answer Keys Response Sheet : ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET 2026) రాసిన అభ్యర్థులకు విద్యాశాఖ ముఖ్యమైన అప్‌డేట్ ఇచ్చింది. టెట్ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక సమాధానాల కీతో పాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్‌లను అధికారులు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. పరీక్ష రాసిన అభ్యర్థులు https://tet2dsc.apcfss.in/ పోర్టల్ ద్వారా తమ రెస్పాన్స్ షీట్లను, ఆన్సర్ కీని వెంటనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఏపీ టెట్ కీ, రెస్పాన్స్ షీట్లు 2026
ఏపీ టెట్ కీ, రెస్పాన్స్ షీట్లు 2026

విడుదల చేసిన ప్రాథమిక కీలపై అభ్యర్థుల నుంచి విద్యాశాఖ అభ్యంతరాలను స్వీకరిస్తుంది. ఏమైనా తప్పులు లేదా సందేహాలు ఉంటే అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా తమ విజ్ఞప్తులను సమర్పించవచ్చు. అభ్యర్థుల నుంచి వచ్చిన ప్రతి అభ్యంతరాన్ని సబ్జెక్టు నిపుణుల కమిటీ సమగ్రంగా పరిశీలిస్తుంది. నిపుణుల కమిటీ సమర్పించిన తుది నివేదిక ఆధారంగా అధికారులు 'ఫైనల్ ఆన్సర్ కీ'ని తయారు చేస్తారు.

సబ్జెక్టు నిపుణులు ఖరారు చేసిన తుది కీ ఆధారంగానే అభ్యర్థుల మార్కుల మూల్యాంకన ప్రక్రియను పూర్తి చేస్తారు. అన్ని ప్రక్రియలు ముగిసిన తర్వాత సెప్టెంబర్ 15వ తేదీన ఏపీ టెట్ తుది ఫలితాలను అధికారికంగా విడుదల చేయడానికి విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది.

ఏపీ టెట్ ప్రిలిమినరీ కీ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?

  • అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://tet2dsc.apcfss.in/ ని ఓపెన్ చేయాలి.
  • హోమ్‌పేజీలో కనిపిస్తున్న "AP TET Provisional Answer Key" లింక్‌పై క్లిక్ చేయాలి.
  • సబ్జెక్టుల వారీగా ఆన్సర్ కీ వివరాలు కనిపిస్తాయి.
  • మీకు కావాల్సిన సబ్జెక్ట్ ఎదురుగా ఉన్న 'డౌన్‌లోడ్' ఆప్షన్‌పై క్లిక్ చేసి కీ కాపీని సేవ్ చేసుకోవచ్చు.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా ప్రిలిమినరీ కీ కాపీని పొందొచ్చు.

ఈ లింక్ పై క్లిక్ చేసి ఏపీ టెట్ ప్రాథమి కీని డౌన్లోడ్ చేసుకోవచ్చు

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe