AP TET 2026 Registration : ఏపీ టెట్ అభ్యర్థులకు అలర్ట్ - దరఖాస్తులకు ఇవాళే చివరి తేదీ

AP TET 2026 Registration : ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు జూలై 5తో ముగియనుంది. ఆగస్టు 5 నుంచి ఆన్‌లైన్ పద్ధతిలో పరీక్షలు ప్రారంభం కానుండగా, సెప్టెంబర్ 15న తుది ఫలితాలను విడుదల చేస్తారు.

Published on: Jul 5, 2026, 11:10:45 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

AP TET 2026 Registration : ఏపీ టెట్ కోసం చూస్తున్న వారికి ముఖ్యమైన అలర్ట్. ప్రస్తుతం ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. అయితే ఈ గడువు ఇవాళ్టితో ముగుస్తుంది. కాబట్టి ఆయా అభ్యర్థులు… వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ఏపీ టెట్ దరఖాస్తులు 2026
ఏపీ టెట్ దరఖాస్తులు 2026

ఆగస్టు 5 నుంచి ఆన్‌లైన్ పరీక్షలు

విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. దరఖాస్తులు సమర్పించిన అభ్యర్థులకు జూలై 25, 2026 నుండి హాల్ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. అభ్యర్థులు తమ వివరాలను నమోదు చేసి వెబ్‌సైట్ నుంచి నేరుగా హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఏపీ టెట్ పరీక్షలను ఆగస్టు 5వ తేదీ నుంచి ఆగస్టు 21వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలను పూర్తిగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT - ఆన్‌లైన్ పద్ధతి) రూపంలో వివిధ సెషన్లలో నిర్వహిస్తారు.

సెప్టెంబర్ 15న ఫలితాలు

పరీక్షల నిర్వహణ ముగిసిన అనంతరం సమాధాన పత్రాల పరిశీలన, ప్రాథమిక కీ, అభ్యంతరాల స్వీకరణ తదితర ప్రక్రియలను విద్యాశాఖ వేగంగా పూర్తి చేయనుంది. అన్ని పరిశీలనలు ముగిసిన తర్వాత సెప్టెంబర్ 15వ తేదీన ఏపీ టెట్ తుది ఫలితాలను విడుదల చేస్తారు.

ఉపాధ్యాయ నియామకాల్లో (DSC) టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉన్నందున అభ్యర్థులు ఈ పరీక్షను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. చివరి నిమిషంలో సర్వర్ ఇబ్బందులు తలెత్తక ముందే దరఖాస్తు ప్రక్రియను ముగించుకోవాలని నిపుణులు కోరుతున్నారు.

ఏపీ టెట్ 2026 అప్లికేషన్ ప్రాసెస్

  1. అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://tet2dsc.apcfss.in/ ను ఓపెన్ చేయాలి.
  2. హోం పేజీలో కనిపించే 'రిజిస్ట్రేషన్' లింక్‌పై క్లిక్ చేయాలి.
  3. మీ ప్రాథమిక గుర్తింపు వివరాల (ఆధార్ వివరాలు) ఆధారంగా ప్రాథమిక రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి.
  4. అనంతరం మీ విద్యా అర్హతలు, వ్యక్తిగత వివరాలను నమోదు చేసి, నిర్దేశిత పరిమాణంలో ఉన్న ఫోటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
  5. దరఖాస్తు రుసుము చెల్లింపు పూర్తి చేసిన తర్వాత, వివరాలన్నీ సరిచూసుకుని అప్లికేషన్‌ను సబ్మిట్ చేయాలి.
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More