ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఆదివారం (సెప్టెంబర్ 13)న ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(AP TET)-జూన్ 2026 ఫలితాలను మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. ఈ పరీక్షలు ఆగస్టు 5 నుండి 16 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష(CBT) విధానంలో నిర్వహించారు.

AP TET-2026 కన్వీనర్ ఎం. వెంకట కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో మాట్లాడుతూ.. ఇప్పటికే విధుల్లో ఉన్న ఉపాధ్యాయుల (in-service teachers) విషయానికొస్తే, 74,711 మంది ఉపాధ్యాయులు 84,798 పేపర్లకు దరఖాస్తు చేసుకోగా, 72,288 మంది 81,127 పేపర్లకు హాజరయ్యారు. వీరిలో 37,789 మంది ఉపాధ్యాయులు 41,315 పేపర్లలో అర్హత సాధించారు. అంటే రాసిన పేపర్లలో వీరి ఉత్తీర్ణత శాతం 50.93గా ఉంది. ఇక రెగ్యులర్ అభ్యర్థుల్లో 47 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.
AP TET-2026లో మెుత్తం 2,14,486 మంది అభ్యర్థులు 2,38,252 పేపర్లకు నమోదు చేసుకోగా, 1,97,703 మంది అభ్యర్థులు 2,18,254 పేపర్లకు హాజరయ్యారని వెంకట కృష్ణారెడ్డి పేర్కొన్నారు.
పరీక్షల అనంతరం ప్రాథమిక సమాధానాల కీ విడుదల చేశారు. అభ్యర్థులు లేవనెత్తిన అభ్యంతరాలను నిపుణుల కమిటీ పరిశీలించింది. ఆ అభ్యంతరాల ఆధారంగా అవసరమైన మార్పులు చేసిన తర్వాత, తుది సమాధానాల కీ ఆధారంగా ఫలితాలు ప్రకటించారు.
అభ్యర్థులు తమ AP TET–జూన్ 2026 ఫలితాలను అధికారిక వెబ్‌సైట్లు tet2dsc.apcfss.in, cse.ap.gov.in లలో తమ ఖాతాలకు లాగిన్ అవ్వడం ద్వారా ఫలితాలు చూసుకోవచ్చు. అవసరమైన వివరాలను 9552300009 నంబర్‌కు పంపడం ద్వారా వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలను పొందవచ్చు.
మంత్రి నారా లోకేష్ టెట్ అర్హత సాధించిన అభ్యర్థులకు అభినందించారు. ముఖ్యంగా రెగ్యులర్ అభ్యర్థులలో 47 శాతం ఉత్తీర్ణత, ఇన్ సర్వీస్ టీచర్లు 51 శాతం ఉత్తీర్ణత సాధించారని ఆయన పేర్కొన్నారు. ఇన్ సర్వీస్ టీచర్ల పనితీరు వారి విద్యా నిబద్ధత, అంకితభావాన్ని ప్రతిబింబిస్తుందనన్నారు. ఇది రాష్ట్రంలో విద్యను బలోపేతం చేయడానికి దోహదపడుతుందని ఆయన అన్నారు. అలాగే విజయం సాధించని అభ్యర్థులు నిరాశ చెందవద్దని, తమ ప్రయత్నాలను కొనసాగించాలని లోకేశ్ సూచించారు.
{{/usCountry}}మంత్రి నారా లోకేష్ టెట్ అర్హత సాధించిన అభ్యర్థులకు అభినందించారు. ముఖ్యంగా రెగ్యులర్ అభ్యర్థులలో 47 శాతం ఉత్తీర్ణత, ఇన్ సర్వీస్ టీచర్లు 51 శాతం ఉత్తీర్ణత సాధించారని ఆయన పేర్కొన్నారు. ఇన్ సర్వీస్ టీచర్ల పనితీరు వారి విద్యా నిబద్ధత, అంకితభావాన్ని ప్రతిబింబిస్తుందనన్నారు. ఇది రాష్ట్రంలో విద్యను బలోపేతం చేయడానికి దోహదపడుతుందని ఆయన అన్నారు. అలాగే విజయం సాధించని అభ్యర్థులు నిరాశ చెందవద్దని, తమ ప్రయత్నాలను కొనసాగించాలని లోకేశ్ సూచించారు.
{{/usCountry}}ఈ లింక్ క్లిక్ చేసి ఫలితాలు డౌన్‌లోడ్ చేసుకోండి.