WhatsApp Sadarem Booking : మ‌న‌మిత్ర వాట్సాప్ ద్వారా స‌ద‌రం స్లాట్ బుకింగ్‌.. ఎలా చేయాలి?

WhatsApp Sadarem Booking : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల కోసం టెక్నాలజీని ఎప్పటికప్పుడు పలు సేవల్లో తీసుకువస్తూనే ఉంది. తాజాగా మనమిత్ర ద్వారా సదరం స్లాట్ బుకింగ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.

Updated on: Aug 4, 2026, 18:20:51 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్రంలోని దివ్యాంగులు స‌ద‌రం స‌ర్టిఫికెట్లు మ‌రింత సుల‌భంగా పొంద‌డానికి వీలుగా ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్రభుత్వం మ‌రింత స‌ర‌ళ‌త‌రం చేసింది. దివ్యాంగులు ఇక‌పై స‌ద‌రం స్లాట్ బుకింగ్ కోసం మీ సేవా కేంద్రాలు, స్వర్ణ గ్రామ‌, స్వర్ణ వార్డు కార్యాల‌యాల చుట్టూ తిర‌గాల్సిన ప‌నిలేదు. మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ద్వారా వారు తామున్న చోటు నుంచి కేవ‌లం త‌మ మొబైల్ ఫోను ద్వారా ఇక‌పై ఈ ప‌నులు నిర్వహించుకోవ‌చ్చు.

వాట్సాప్‌లో సదరం స్లాట్ బుకింగ్
వాట్సాప్‌లో సదరం స్లాట్ బుకింగ్

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచ‌న‌ల ప్రకారం దివ్యాంగుల కోసం స‌ద‌రం సేవ‌ల‌ను మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ద్వారా పొందే వీలు క‌ల్పించిన‌ట్లు రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్‌) ఒక ప్రక‌ట‌న‌లో తెలిపింది. దీనివ‌ల్ల దివ్యాంగులు ఇక‌పై స‌ద‌రం స్లాట్ బుకింగ్‌, స్లాట్‌ ల‌భ్యత స‌మ‌యం, స‌ర్టిఫికెట్ డౌన్‌లోడ్ సేవ‌ల కోసం వారు ఏ కార్యాల‌యానికి వెళ్లన‌వ‌స‌రం ఉండ‌దు. ఉన్న చోటు నుంచే త‌మ మొబైల్ ఫోనులోని మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ద్వారా క్షణాల్లో ఈ ప‌నులు చ‌క్కబెట్టుకోవ‌చ్చని ఆర్టీజీఎస్ అధికారులు తెలిపారు.

ఎలా తెలుసుకోవాలి?

ముందుగా మీ మొబైల్ నంబ‌రులోని వాట్సాప్ ఓపెన్ చేయాలి.

అందులో మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ 9552300009 కు హాయ్ అని మెసేజ్ పంపాలి.

త‌ర్వాత మీకు మొబైల్ ఫోనులో క‌నిపించే సిటిజ‌న్ స‌ర్వీసుల్లో స‌ద‌రం స‌ర్వీసుల‌ను ఎంపిక చేసుకోవాలి.

అందులో మీకు సద‌రం స్లాట్ అవైల‌బిలిటీ, స‌ద‌రం స్లాట్ బుకింగ్‌, స‌ద‌రం స‌ర్టిఫికెట్ డౌన్ లోడు అనే మూడు ఆప్షన్లు క‌నిపిస్తాయి. అందులో మీకు ఏది అవ‌స‌ర‌మైతే దాన్ని ఎంపిక చేసుకోవాలి.

మీరు స్లాట్ బుకింగ్ చేసుకోవాల‌నుకుంటే స్లాట్ బుక్ చేసుకోవ‌చ్చు

స‌ద‌రం స‌ర్టిఫికెట్ కావాలంటే మీరున్న చోటునుంచే స‌ర్టిఫికెట్ డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు

స‌ద‌రం స్లాట్లు ఎప్పుడు అందుబాటులో ఉన్నాయో కూడా తెలుసుకోవ‌చ్చు.

అక్కడ ఆ సేవ‌లు పొంద‌డానికి కావాల్సిన వివరాలు పొందుప‌రిస్తే మీరు వెంట‌నే నిమిషాల్లో ఆ సేవ‌ల‌ను మీ మొబైల్ సేవ‌లు పొందే వీలుంటుంది. దివ్యాంగులందరూ ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని అధికారులు కోరారు. ఈ మేరకు ఆర్టీజీఎస్ ప్రకటన విడుదల చేసింది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More