AP TET 2026 : ఏపీ టెట్ 2026 ఫలితాలు విడుదల.. ఇలా స్కోర్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోండి, వాట్సాప్ ద్వారా కూడా
AP TET 2026 : ఏపీ టెట్ 2026 ఫలితాలను మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. ఈ రిజల్ట్‌ను అధికారిక వెబ్‌సైట్ ద్వారా, వాట్సాప్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఆదివారం (సెప్టెంబర్ 13)న ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(AP TET)-జూన్ 2026 ఫలితాలను మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. ఈ పరీక్షలు ఆగస్టు 5 నుండి 16 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష(CBT) విధానంలో నిర్వహించారు.

AP TET-2026 కన్వీనర్ ఎం. వెంకట కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో మాట్లాడుతూ.. ఇప్పటికే విధుల్లో ఉన్న ఉపాధ్యాయుల (in-service teachers) విషయానికొస్తే, 74,711 మంది ఉపాధ్యాయులు 84,798 పేపర్లకు దరఖాస్తు చేసుకోగా, 72,288 మంది 81,127 పేపర్లకు హాజరయ్యారు. వీరిలో 37,789 మంది ఉపాధ్యాయులు 41,315 పేపర్లలో అర్హత సాధించారు. అంటే రాసిన పేపర్లలో వీరి ఉత్తీర్ణత శాతం 50.93గా ఉంది. ఇక రెగ్యులర్ అభ్యర్థుల్లో 47 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.
AP TET-2026లో మెుత్తం 2,14,486 మంది అభ్యర్థులు 2,38,252 పేపర్లకు నమోదు చేసుకోగా, 1,97,703 మంది అభ్యర్థులు 2,18,254 పేపర్లకు హాజరయ్యారని వెంకట కృష్ణారెడ్డి పేర్కొన్నారు.
పరీక్షల అనంతరం ప్రాథమిక సమాధానాల కీ విడుదల చేశారు. అభ్యర్థులు లేవనెత్తిన అభ్యంతరాలను నిపుణుల కమిటీ పరిశీలించింది. ఆ అభ్యంతరాల ఆధారంగా అవసరమైన మార్పులు చేసిన తర్వాత, తుది సమాధానాల కీ ఆధారంగా ఫలితాలు ప్రకటించారు.
అభ్యర్థులు తమ AP TET–జూన్ 2026 ఫలితాలను అధికారిక వెబ్‌సైట్లు tet2dsc.apcfss.in, cse.ap.gov.in లలో తమ ఖాతాలకు లాగిన్ అవ్వడం ద్వారా ఫలితాలు చూసుకోవచ్చు. అవసరమైన వివరాలను 9552300009 నంబర్‌కు పంపడం ద్వారా వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలను పొందవచ్చు.
మంత్రి నారా లోకేష్ టెట్ అర్హత సాధించిన అభ్యర్థులకు అభినందించారు. ముఖ్యంగా రెగ్యులర్ అభ్యర్థులలో 47 శాతం ఉత్తీర్ణత, ఇన్ సర్వీస్ టీచర్లు 51 శాతం ఉత్తీర్ణత సాధించారని ఆయన పేర్కొన్నారు. ఇన్ సర్వీస్ టీచర్ల పనితీరు వారి విద్యా నిబద్ధత, అంకితభావాన్ని ప్రతిబింబిస్తుందనన్నారు. ఇది రాష్ట్రంలో విద్యను బలోపేతం చేయడానికి దోహదపడుతుందని ఆయన అన్నారు. అలాగే విజయం సాధించని అభ్యర్థులు నిరాశ చెందవద్దని, తమ ప్రయత్నాలను కొనసాగించాలని లోకేశ్ సూచించారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


