...
...
Next Story

ఏపీ టెట్ - 2025 అప్డేట్ : మరికొన్ని పరీక్షల ప్రాథమిక 'కీ'లు విడుదల, ఇదిగో డైరెక్ట్ లింక్

ఏపీ టెట్ ప్రాథమిక కీలు విడుదలవుతున్నాయి. తాజాగా 12, 13, 14, 15 తేదీల్లో జరిగిన సబ్జెక్ట్ పేపర్ల ప్రాథమిక కీలు అందుబాటులోకి వచ్చాయి. https://tet2dsc.apcfss.in/ వెబ్ సైట్ నుంచి వీటిని పొందవచ్చు.

Published on: Dec 20, 2025, 11:55:35 IST
Advertisement

ఏపీ టెట్ - 2025 పరీక్షలు కొనసాగుతున్నాయి. డిసెంబర్ 21వ తేదీతో అన్ని సబ్జెక్టుల పేపర్లు పూర్తవుతున్నాయి. ఓవైపు ఎగ్జామ్స్ జరుగుతుండగా… మరోవైపు పూర్తి అయిన పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీలు అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా మరికొన్ని పేపర్ల ప్రాథమిక కీలను కూడా విద్యాశాఖ విడుదల చేసింది.

ఏపీ టెట్
ఏపీ టెట్

ఈనెల 12, 13, 14, 15వ తేదీల్లో నిర్వహించిన పరీక్షల ప్రాథమిక కీలు విడుదలయ్యాయి. ఇందులో ఎక్కువగా ఉదయం సెషన్ జరిగిన పరీక్షలవే ఉండగా…మరికొన్ని మధ్యాహ్నం సెషన్ పరీక్షల ప్రాథమిక కీలున్నాయి. ఆయా సెషన్లలో జరిగిన పరీక్షలకు హాజరైన అభ్యర్థులు https://tet2dsc.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఈనెల 10వ తేదీన ఉదయం, మధ్యాహ్నం జరిగిన పేపర్‌-2ఎ తెలుగు భాష పరీక్ష, 11వ తేదీన ఉదయం నిర్వహించిన పేపర్‌-2 మైనర్‌ లాంగ్వేజ్‌ పరీక్షల ప్రాథమిక కీలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. వీటిపై అభ్యంతరాలుంటే ఈనెల 24వ తేద వరకు పంపొచ్చు. అభ్యర్థుల వారి లాగిన్ వివరాలతో ప్రాథమిక కీలపై అభ్యంతరాలను తెలపవచ్చని అధికారులు ఓ ప్రకటన ద్వారా తెలిపారు.

ఏపీ టెట్ ప్రాథమిక కీలు - డౌన్లోడ్ ప్రాసెస్

  1. ఏపీ టెట్ అభ్యర్థులు https://tet2dsc.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. హోం పేజీలోని టెట్ ప్రిలిమినరీ ఆన్సర్ కీ లింక్ పై క్లిక్ చేయాలి.
  3. ఇక్కడ సబ్జెక్ట్ పేపర్లు కనిపిస్తాయి. తేదీలు, సెషన్ల వారీగా వివరాలుంటాయి.
  4. చివర్లో ఉండే కీ లింక్ పై క్లిక్ చేస్తే పీడీఎఫ్ డౌన్లోడ్ అవుతుంది.
  5. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా ప్రాథమిక కీలను పొందవచ్చు.

విద్యాశాఖ వెల్లడించిన షెడ్యూల్ ప్రకారం… ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో నిర్వహిస్తారు. డిసెంబర్ 21వ తేదీతో అన్ని సబ్జెక్టుల పరీక్షలు పూర్తవుతాయి. జనవరి 13వ తేదీన ఏపీ టెట్ ఫైనల్ కీని ప్రకటిస్తారు.జనవరి 19వ తేదీన ఏపీ టెట్ ఫలితాలను వెల్లడిస్తారు.

ఈ లింక్ పై క్లిక్ చేసి ఏపీ టెట్ పరీక్షల ప్రాథమిక కీలను నేరుగా చెక్ చేసుకోవచ్చు

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks