AP University Faculty Recruitment : వర్సిటీల్లో 1,523 ఉద్యోగాల భర్తీ అప్డేట్ - తుది జాబితా విడుదల గడువు పొడిగింపు!

AP University Faculty Recruitment 2026: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియకి సంబంధించి కీలక అప్డేట్. అర్హులైన అభ్యర్థుల తుది జాబితా ప్రకటన గడువును ఈ నెల 19వ తేదీ వరకు పొడిగిస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.

Published on: Aug 5, 2026, 09:58:37 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

AP University Faculty Recruitment 2026: ఆంధ్రప్రదేశ్ రాష్టంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియకు సంబంధించి ఉన్నత విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అర్హులైన అభ్యర్థుల తుది జాబితా (Final Eligibility List) వెల్లడించే గడువును పొడిగించారు. ఈ మేరకు ప్రకటన విడుదలైంది.

వర్సిటీ అధ్యాపక పోస్టుల తుది జాబితా విడుదల గడువు పొడిగింపు!
వర్సిటీ అధ్యాపక పోస్టుల తుది జాబితా విడుదల గడువు పొడిగింపు!

విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీ కోసం అధికారులు దరఖాస్తులను స్వీకరించిన సంగతి తెలిసిందే. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం…. అర్హులైన అభ్యర్థుల తుది జాబితాను ఈ నెల 3వ తేదీనే ప్రకటిస్తామని విద్యాశాఖ గతంలో తెలిపింది. అయితే…. దీనికంటే ముందుగా విడుదల చేసిన ప్రాథమిక జాబితా పై పలువురు అభ్యర్థుల నుంచి ఎక్కువ సంఖ్యలో అభ్యంతరాలు, ఫిర్యాదులు వ్యక్తమయ్యాయి.

అభ్యర్థులు సమర్పించిన వినతులు, సాంకేతిక సమస్యలు , ఇతర అభ్యంతరాలను క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఏర్పడింది. ఏ ఒక్క అర్హుడైన అభ్యర్థికి అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో ఉన్నత విద్యాశాఖ తుది జాబితా ప్రకటన తేదీని వాయిదా వేసింది.

ఈ నెల 19న తుది జాబితా విడుదల

అభ్యంతరాలన్నింటినీ సమగ్రంగా పరిశీలించి పరిష్కరించిన తర్వాతే తుది జాబితాను సిద్ధం చేయాలని అధికారులు నిర్ణయించారు. అందులో భాగంగానే తుది జాబితా వెల్లడించే ప్రక్రియ గడువును ఈ నెల 19వ తేదీ వరకు పొడిగించారు. ఈ గడువు నాటికి తుది పరిశీలనలన్నీ పూర్తి చేసి… ఏపీ ఉన్నత విద్యామండలి అధికారిక పోర్టల్‌లో అర్హుల వివరాలను అందుబాటులో ఉంచుతామని విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి.

ఈ నిర్ణయంతో దరఖాస్తు చేసుకున్న వేలాది మంది అభ్యర్థులకు తమ వివరాలను పునఃపరిశీలించుకోవడానికి, సమర్పించిన అభ్యంతరాలకు సంబంధించి అధికారుల నుంచి స్పష్టత రావడానికి మరింత సమయం లభించినట్లయింది.

నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1,523 ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేస్తారు. ఇందులో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్, అసిస్టెంట్ లైబ్రేరియన్ వంటి పోస్టులున్నాయి.

ఖాళీల వివరాలు:

  • ప్రొఫెసర్: 63 (రెగ్యులర్: 63, బ్యాక్‌లాగ్: 0)
  • అసోసియేట్ ప్రొఫెసర్: 334 (రెగ్యులర్: 191, బ్యాక్‌లాగ్: 143)
  • అసిస్టెంట్ ప్రొఫెసర్: 1,020 (రెగ్యులర్: 886, బ్యాక్‌లాగ్: 134)
  • లెక్చరర్ (కేవలం RGUKTలో): 104 (రెగ్యులర్: 104, బ్యాక్‌లాగ్: 0)
  • అసిస్టెంట్ లైబ్రేరియన్: 2 (రెగ్యులర్: 0, బ్యాక్‌లాగ్: 2)
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More