...
...
Next Story

AP Voter Card Revision : మీ స్మార్ట్‌ఫోన్ లోనే ఎన్యూమరేషన్ పూర్తి చేసుకోవచ్చు - స్టెప్ బై స్టెప్ ప్రాసెస్

AP Voter Card Revision : ఏపీలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) - 2026 ప్రక్రియ కొనసాగుతోంది. ఓటర్లు ఇకపై బీఎల్ఓల కోసం వేచి చూడకుండా నేరుగా తమ స్మార్ట్‌ఫోన్ ద్వారా ఆన్‌లైన్‌లో వివరాలను ధృువీకరించుకోవచ్చు.

Published on: Jun 19, 2026 04:20 PM IST
Advertisement

AP Voter Card Revision : ఆంధ్రప్రదేశ్‌లోని ఓటర్లకు ఎన్నికల సంఘం ముఖ్యమైన సమాచారాన్ని అందించింది. ఓటు హక్కును మరింత బలోపేతం చేసుకోవడానికి, ఓటర్ల జాబితాలో ఎలాంటి తప్పులు లేకుండా చూసుకోవడానికి అద్భుతమైన అవకాశం లభించింది. రాష్ట్రంలో ప్రస్తుతం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) - 2026 కార్యక్రమంలో భాగంగా ఓటర్లు తమ వివరాలను స్వయంగా ధృవీకరించుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్ ఓటర్లకు అలర్ట్
ఆంధ్రప్రదేశ్ ఓటర్లకు అలర్ట్

గతంలో లాగా ఓటర్ ఐడీలో మార్పులు చేర్పులు చేయడం కోసం లేదా వివరాల నమోదు కోసం బూత్ లెవెల్ ఆఫీసర్ల (BLO) చుట్టూ తిరగాల్సిన అవసరం ఇక లేదు. అధికారులు మీ ఇంటికి వచ్చేవరకు వేచి చూడాల్సిన పని అంతకన్నా లేదు. మీ చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్ సహాయంతో ఇంట్లోనే కూర్చుని ఆన్‌లైన్ ద్వారా ఈ ప్రక్రియను చాలా సులభంగా పూర్తి చేయవచ్చు.

ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా ఓటర్లు ఆన్‌లైన్‌లో ఇ-ఎన్యూమరేషన్ ఫారమ్ (EF) పూర్తి చేయాల్సి ఉంటుంది. డిజిటల్ పద్ధతిలో మీ వివరాలను సరిచూసుకోవడానికి ఎన్నికల సంఘం ఎంతో సురక్షితమైన వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది.

ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకునే విధానం:

  1. మొదట ఓటర్లు భారత ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్ voters.eci.gov.in ను సందర్శించాలి.
  2. అక్కడ మీ ఓటర్ ఐడీ కార్డుపై ఉన్న ఎపిక్ (EPIC) నంబర్‌ను నమోదు చేయాలి.
  3. మీ మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీ (OTP) ద్వారా వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వాలి.
  4. లాగిన్ అయిన తర్వాత మీ పాత రికార్డులతో ప్రస్తుత వివరాలను అనుసంధానం చేయాల్సి ఉంటుంది.
  5. చివరగా మీ ఆధార్ ఈ-సైన్ (eSign) ద్వారా అత్యంత సురక్షితంగా ఈ ఫారమ్‌ను సబ్మిట్ చేయవచ్చు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe