AP Weather Updates : ఆంధ్రప్రదేశ్‌లో పిడుగులతో కూడిన వర్షాలు - ఈ జిల్లాలకు హెచ్చరికలు
Andhrapradesh Weather Updates : ఆంధ్రప్రదేశ్‌లో రాగల మూడు రోజులు పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
మధ్య ఛత్తీస్‌గఢ్, దానిని ఆనుకుని ఉన్న తూర్పు మధ్యప్రదేశ్ ప్రాంతాలపై తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉనట్లు అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇది పశ్చిమ-నైరుతి దిశగా కదులుతూ మరింత బలహీనపడే అవకాశం ఉంది. దీనికి తోడు రుతుపవన ద్రోణి, షియర్ జోన్ ప్రభావం వల్ల రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు విస్తరిస్తున్నాయి.

ఇవాళ ఈ జిల్లాల్లో వర్షాలు..
తాజా వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో…. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రాగల కొన్ని రోజుల పాటు వాతావరణంలో గణనీయ మార్పులు చోటుచేసుకోనున్నాయి. రాష్ట్రంలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది.
ఇవాళ (జూలై 31) మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది.
మరోవైపు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే సూచనలున్నాయి. ఈ సమయంలో తీర ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.
ప్రజలకు అలర్ట్…
ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సమయంలో ప్రజలు తీవ్ర అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ఈదురుగాలులు వీచే సమయంలో ఆరుబయట నిలబడకూడదని సూచించారు. చెట్లు, హోర్డింగ్స్, పాత భవనాలు, విద్యుత్ స్తంభాల కింద ఆశ్రయం పొందవద్దని సూచిస్తున్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు పిడుగుపాటు ముప్పు ఉన్నందున వర్షం వచ్చే సమయంలో సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని స్పష్టం చేశారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

