...
...
Next Story

ఏపీ ప్రజలకు సంక్రాంతి పండగ ఆఫర్ - చేనేత వస్త్రాలపై 40 శాతం డిస్కౌంట్..!

ఏపీ ఆప్కో నుంచి గుడ్ న్యూస్ వచ్చేసింది. సంక్రాంతి వరకు 40 శాతం డిస్కౌంట్ తో చేనేత అమ్మకాలు ఉంటాయని ప్రకటన విడుదలైంది. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా చేనేత బజార్లను కూడా ఏర్పాటు చేస్తామని సంబంధిత శాఖ మంత్రి సవిత వెల్లడించారు.

Published on: Nov 26, 2025, 06:04:09 IST
Advertisement

రాష్ట్ర ప్రజలకు ఆప్కో మరోసారి శుభవార్త తెలిపింది. వినియోగదారుల నుంచి వస్తున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని వచ్చే సంక్రాంతి వరకూ ఆప్కో షో రూమ్ ల ద్వారా 40 శాతం డిస్కౌంట్ కు చేనేత వస్త్రాలు విక్రయించనున్నట్లు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత వెల్లడించారు.

ఆప్కో లో డిస్కౌంట్ అమ్మకాలు
ఆప్కో లో డిస్కౌంట్ అమ్మకాలు

మారుతున్న అభిరుచుల దృష్ట్యా ప్రజల్లోనూ చేనేత వస్త్రాల వినియోగంపై మక్కువ పెరుగుతోందని మంత్రి సవిత పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దసరా, దీపావళి పండుగలను దృష్టిలో పెట్టుకుని ఆప్కో షో రూమ్ ల్లో చేనేత వస్త్రాలను 40 శాతం డిస్కౌంట్ పై విక్రయించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రజలు, వినియోగదారుల నుంచి వచ్చిన స్పందన నేపథ్యంలో డిస్కౌంట్ అమ్మకాలు వచ్చే సంక్రాంతి వరకూ కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. డిస్కౌంట్ లో అమ్మకాలతో అటు ప్రజలకు చేనేత వస్త్రాలను మరింత చేరువ చేసే అవకాశం కలుతోందన్నారు. అదే సమయంలో చేనేత వస్త్రాల విక్రయాల పెరుగుదలతో నేతన్నలకు ఆర్థిక భరోసాతో కూడిన ఉపాధి లభిస్తోందని తెలిపారు.

రూ.9 లక్షలకు పెరిగిన అమ్మకాలు…

40 శాతం డిస్కౌంట్ కు ఆప్కో షో రూమ్ ల ద్వారా చేనేత వస్త్రాలను విక్రయించడం వల్ల అమ్మకాలు సైతం పెరిగినట్లు మంత్రి సవిత వెల్లడించారు. డిస్కౌంట్ ఇవ్వడానికి ముందు రాష్ట్ర వ్యాప్తంగా ఆప్కో షో రూమ్ ల ద్వారా రోజుకు సరాసరి రూ.3 లక్షల చొప్పున విక్రయాలు జరిగేవన్నారు. 40 శాతం డిస్కౌంట్ తో అమ్మకాలు ప్రారంభించిన తరవాత రోజువారీ అమ్మకాలు రూ.9 లక్షలకు పెరిగినట్లు మంత్రి సవిత తెలిపారు. డిస్కౌంట్ విక్రయాలతో పాటు చేనేత వస్త్రాల కొనుగోలుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారన్నారు. ప్రస్తుత ట్రెండ్ ను దృష్టిలో పెట్టుకుని చిన్నారులతో పాటు ఆయా వయస్సుల వారికి అవసరమైన రెడీ మేడ్ చేనేత వస్త్రాలను ఆప్కో షో రూమ్ ల్లో విక్రయిస్తున్నామన్నారు. దీంతో చేనేత వస్త్రాల కొనుగోలు పెరిగినట్లు మంత్రి సవిత తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా చేనేత బజార్లు…

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe