రానున్న సంక్రాంతిని దృష్టిలో పెట్టుకుని ఏపీ ఆప్కో మరోసారి శుభవార్త చెప్పింది. సంబంధిత షో రూమ్ ల్లో భారీ డిస్కౌంట్ తో అమ్మకాలు చేయనున్నట్లు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. 60, 50, 40 శాతాల డిస్కౌంట్ ల పై చేనేత వస్త్రాలను విక్రయించనున్నామని, ఇందుకోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.

తిరుమల వెంకన్న వైకుంఠ ఏకాదశి ఉత్సవాల సందర్భంగా తిరుపతిలో చేనేత బజార్ నిర్వహించనున్నామని మంత్రి సవిత పేర్కొన్నారు. మరో రెండ్రోజుల్లో చేనేత సహకార సంఘాల నుంచి వస్త్రాలను కొనుగోలు చేస్తామని తెలిపారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షించిన ఆమె… మెగా క్లస్టర్ల ఏర్పాటు, గడిచిన మూడు నెలల్లో ఆప్కో అమ్మకాలపై మంత్రి ఆరా తీశారు.
ప్రత్యేక కౌంటర్లు…
ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ… రానున్న సంక్రాంతి దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 60 శాతం డిస్కౌంట్ అమ్మకాలపై గుంటూరులోని చేనేత ఏడీ కార్యాలయ ఆవరణలోనూ, మంగళగిరిలోని యర్రబాలెంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేపట్టాలన్నారు.
విజయవాడలోని ఆప్కో మెగా షో రూమ్ లో 50 శాతం డిస్కౌంట్ అమ్మకాలు చేయనున్నామన్నారు. ఈ నెల 29వ తేదీ నుంచి ప్రత్యేక డిస్కౌంట్ ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని మిగిలిన అన్ని ఆప్కో షో రూమ్ ల్లో 40 శాతంపై డిస్కౌంట్ అమ్మకాలు సంక్రాంతి వరకూ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. రానున్న సంక్రాంతి నేపథ్యంలో ఆప్కో షో రూమ్ ల్లో డిస్కౌంట్ అమ్మకాలపై విస్తృత ప్రచారం చేయాలన్నారు. తెలుగువారి పెద్ద పండుగను సంప్రదాయరీతిలో జరుపుకోవాలని…. ఇంటిళ్లపాది చేనేత వస్త్రాలు ధరించాలని మంత్రి సవిత కోరారు.
మరో రెండ్రోజుల్లో రాష్ట్రంలో ఉన్న చేనేత సహకార సంఘాల నుంచి చేనేత వస్త్రాల కొనుగోలు ప్రారంభించాలని మంత్రి సవిత ఆదేశించారు. ఆప్కో షో రూమ్ ల్లో వినియోగదారుల నుంచి డిమాండ్ ఉన్న వస్త్రాలను తక్షణమే కొనుగోలు చేయాలన్నారు. నిర్ణీత గడువును నిర్దేశించుకుని ఈ కొనుగోళ్లు ముగించాలన్నారు. సహకార సంఘాల నుంచి కొనుగోలు చేసిన వస్త్రాలను నేరుగా ఆప్కో షో రూమ్ లకు తరలించాలన్నారు.
తిరుపతిలో చేనేత ఎగ్జిబిషన్ ప్రారంభం…
{{/usCountry}}మరో రెండ్రోజుల్లో రాష్ట్రంలో ఉన్న చేనేత సహకార సంఘాల నుంచి చేనేత వస్త్రాల కొనుగోలు ప్రారంభించాలని మంత్రి సవిత ఆదేశించారు. ఆప్కో షో రూమ్ ల్లో వినియోగదారుల నుంచి డిమాండ్ ఉన్న వస్త్రాలను తక్షణమే కొనుగోలు చేయాలన్నారు. నిర్ణీత గడువును నిర్దేశించుకుని ఈ కొనుగోళ్లు ముగించాలన్నారు. సహకార సంఘాల నుంచి కొనుగోలు చేసిన వస్త్రాలను నేరుగా ఆప్కో షో రూమ్ లకు తరలించాలన్నారు.
తిరుపతిలో చేనేత ఎగ్జిబిషన్ ప్రారంభం…
{{/usCountry}}రానున్న వైకుంఠ ఏకాదశి ఉత్సవాల సందర్భంగా తిరుమలకు లక్షలాది మంది భక్తులు రానున్న నేపథ్యంలో చేనేత ఎగ్జిబిషన్ ను ఈ నెల 26 నుంచి ప్రారంభించనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. వచ్చే నెల ఏడో తేదీ వరకూ తిరుపతిలోని డీపీఆర్ కన్వన్షెన్ హాల్లో నిర్వహించే చేనేత ఎగ్జిబిషన్ పై విస్తృత ప్రచారం నిర్వహించాలని చేనేత, జౌళి శాఖ కమిషనర్ రేఖారాణిని ఆదేశించారు. రాష్ట్రంలో ప్రధాన నగరాల్లో చేనేత ఎగ్జిబిషన్లు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో చేనేత, జౌళి శాఖాధికారులు పాల్గొన్నారు.