టీటీడీ వైకుంఠ ద్వార దర్శనాలు : 182 గంటల దర్శన సమయంలో 164 గంటలు సామాన్యులకే
వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్యులకే పెద్దపీట వేయనున్నట్టుగా టీటీడీ వెల్లడించింది. పదిరోజుల్లో 182 గంటల దర్శన సమయంలో 164 గంటలు సామాన్యులకే కేటాయించినట్టుగా తెలిపింది.
ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు ఆదేశాల మేరకు డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాల్లో సామన్యులకే పెద్దపీఠ వేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలియజేశారు. తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో వైకుంఠ ద్వార దర్శనాల ఏర్పాట్లపై ప్రభుత్వం నియమించిన ముగ్గురు మంత్రుల ఉప సంఘంలోని రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత, రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్‌లతో కలిసి ఆయన టీటీడీ, జిల్లా, పోలీసు ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.

సమావేశంలోని ముఖ్యాంశాలు
- పదిరోజుల్లో 182 గంటల దర్శన సమయంలో 164 గంటలు అంటే దాదాపు 90శాతం సామాన్యులకే కేటాయింపు.
- పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు పటిష్ట ఏర్పాట్లు.
- తొలి మూడు రోజుల దర్శనాలకు 27 రాష్ట్రాల నుండి 23.64 లక్షల మంది ఈ-డిప్‌కు నమోదు
- 1.89 లక్షల మంది సామాన్య భక్తులకు ఈ-డిప్ ద్వారా టోకెన్ల కేటాయింపు.భక్తులు ఏరోజు, ఏ సమయానికి దర్శనానికి రావాలో సమాచారం అందజేత.
- టోకెన్ లేని భక్తులు జనవరి 2 నుండి 8వ తేది వరకు సర్వ దర్శన క్యూలైన్ ద్వారా వైకుంఠ ద్వార దర్శనాలకు అవకాశం.
- స్వామివారి దర్శనాలకు వచ్చే భక్తులకు విరివివిగా అన్నప్రసాదాలు, తాగునీరు, తదితర సదుపాయాలు.
- ఏఐ టెక్నాలజీతో క్యూలైన్ల పర్యవేక్షణ, భక్తుల సంఖ్య, వేచి ఉండే సమయాన్ని అంచనా వేస్తూ క్యూలైన్ల నిర్వహణ.
- పోలీసులు, టీటీడీ విజిలెన్స్ సమన్వయంతో భక్తులకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు.
- అన్ని వర్గాల భక్తులను దృష్టిలో ఉంచుకుని సంయమనంతో స్వామివారిని దర్శించుకోవాలని భక్తులకు విజ్ఞప్తి.భక్తులకు పూర్తిస్థాయిలో సంతృప్తి కలిగేలా నిబద్ధతతో సేవలు అందించాలని సిబ్బందికి సూచన.
ఈ సమావేశంలో టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్.నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, దేవాదాయశాఖ సెక్రటరీ హరి జవహర్ లాల్, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, సీవీఎస్వో మురళీ కృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


