తిరుమలలో టోకెన్ లేని భక్తులకు ఆ తేదీల్లో వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 ద్వారా నేరుగా సర్వ దర్శనాలు
వైకుంఠ ద్వార దర్శనాల కోసం టీటీడీ అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లపై సమీక్షలు నిర్వహిస్తున్నారు.
డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు వైకుంఠ ద్వార దర్శనాల భద్రత ఏర్పాట్లపై అధికారులు సమీక్ష నిర్వహించారు. టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, జేఈవో వీరబ్రహ్మం, తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు, టీటీడీ సీవీ అండ్ ఎస్ఓ మురళీకృష్ణలతో కలిసి టీటీడీ, పోలీసు ఉన్నతాధికారులతో తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. వైకుంఠ ద్వార దర్శనాల భద్రతా ఏర్పాట్లపై మూడు గంటల పాటు క్షేత్రస్థాయిలో చర్చించారు.

ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని తిరుమలలో భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వైకుంఠ ద్వార దర్శనాల్లో డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేదీల్లో లక్కీ డిప్ ద్వారా టోకెన్ పొందిన భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతి ఉంటుంది. టోకెన్ లేని భక్తులకు జనవరి 2 నుండి 8వ తేది వరకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -2 ద్వారా నేరుగా సర్వ దర్శనాలకు రావచ్చని భక్తులకు అవగాహన కల్పించేందుకు విస్తృతంగా ప్రచారం చేయాలని అధికారులు నిర్ణయించారు.
తిరుపతి రైల్వే స్టేషన్, బస్టాండ్, శ్రీనివాసం, విష్ణు నివాసం, అలిపిరి, శ్రీవారి మెట్టు ప్రాంతాల్లో భక్తులకు తెలిసే విధంగా రేడియో అండ్ బ్రాడ్ కాస్టింగ్, సోషల్ మీడియా, ఎస్వీబీసీ, ఇతర మాధ్యమాల ద్వారా భక్తులకు అవగాహన కల్పించేందుకు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో విస్తృత ప్రచారం చేపట్టాలని టీటీడీ అదనపు ఈవో సూచించారు.
వైకుంఠ ద్వార దర్శన రోజుల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని విభాగాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని భక్తులకు సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి. వైకుంఠ ఏకాదశి ముందురోజు సాయంత్రం నుండి భక్తులకు అన్న పానీయాలు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని అన్న ప్రసాద విభాగం అధికారులను ఆదేశించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా సేవలు అందించేందుకు అవసరమైన సంఖ్యలో శ్రీవారి సేవకులను అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు.
తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ వైకుంఠ ద్వార దర్శనాలపై భక్తుల్లో ఎలాంటి అయోమయం తలెత్తకుండా టీటీడీ తీసుకున్న నిర్ణయాలను విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల తరహాలో ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసి భద్రతను పర్యవేక్షించేందుకు చర్యలు తీసుకునేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. టీటీడీ, పోలీసు అధికారులతో వాట్సాప్ గ్రూప్ రూపొందించి ఎప్పటికప్పుడు సమస్యలపై తక్షణం స్పందించేలా సమన్వయంతో పని చేయాలని సూచించారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


