ఈ తేదీల్లో శ్రీశైలం మల్లన్న బ్రహ్మోత్సవాలు.. జనవరిలోపు ఏర్పాట్లు పూర్తి!
మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 8 నుండి 18 వరకు జరగనున్నాయి. ఇందుకోసం దేవస్థానం అధికారులు ఇప్పటినుంచే ఏర్పాట్లపై సమీక్షలు నిర్వహిస్తున్నారు.
శ్రీశైలం మల్లన్న ఆలయంలో ఫిబ్రవరి 8వ తేదీ నుంచి 18వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లపై శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయ దేవస్థానం అధికారులు శ్రీశైలంలో ఆలయ యూనిట్ అధిపతులు, ఇంజనీరింగ్ అధికారులు, పర్యవేక్షకులు, వేద కమిటీతో ప్రాథమిక సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

మహా శివరాత్రి ఫిబ్రవరి 15న వస్తుంది. ఆ రోజు ప్రభుత్సవం, పాగా అలంకరణ, బ్రహ్మోత్సవ కల్యాణం జరగనుందని ఆలయ ఈవో శ్రీనివాసరావు చెప్పారు. ఫిబ్రవరి 16వ తేదీన మల్లిఖార్జునస్వామి, అమ్మవారి రథోత్సవం ఉంటుంది. 11 రోజులపాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ మేరకు ఏర్పాట్లపై అధికారులు చర్చించారు.
దేవస్థానం అన్ని విభాగాలు 11 రోజుల పాటు జరిగే ఉత్సవాలను సజావుగా నిర్వహించడానికి జిల్లా యంత్రాంగం, ట్రస్ట్ బోర్డుతో సమన్వయంతో పనిచేయాలని ఈవో శ్రీనివాసరావు ఆదేశించారు. ఈ సంవత్సరం భక్తుల సంఖ్య పెరుగుతుందని అంచనా వేశారు. జనవరి చివరి నాటికి దాదాపు పనులు అన్నీ పూర్తి చేయాలన్నారు. అన్ని సౌకర్యాలను భక్తులకు అందించాలని, ఏర్పాట్లను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఉచిత లడ్డూలు
మల్లన్న స్పర్శ దర్శనం, అతిశీఘ్ర దర్శనం టికెట్లు తీసుకున్న భక్తులకు ఉచితంగా లడ్డూలను పంపిణీ చేస్తున్నారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నారు. రూ.500 స్పర్శ దర్శనం టికెట్లు, రూ.300 అతి శీఘ్ర దర్శనం టికెట్లు తీసుకున్న భక్తులకు మాత్రమే వీటిని అందిస్తారు. స్పర్శ దర్శనం టికెట్‌పై 100 గ్రాముల లడ్డూలు రెండు, రూ.300 దర్శనం టికెట్‌కు ఒక లడ్డూను అందజేస్తున్నారు.
ఈ ఉచిత లడ్డూల పంపిణీ కోసం ఆలయ అధికారులు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఆలయంలోని 9,10 కౌంటర్లలో మాత్రమే ఈ ఉచిత లడ్డూలను దొరుకుతాయి. టికెట్లు తీసుకున్న ఈ భక్తులు కౌంటర్లను సంప్రదించి లడ్డూలను పొందవచ్చు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


