Lord Shiva: ఈరోజు మార్గశిర మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం.. శివరాత్రితో సమానమైన రోజు.. ఇలా చేస్తే కష్టాలన్నీ తీరినట్టే!

ఈరోజు చాలా శక్తివంతమైన రోజు. మార్గశిర మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం చాలా శక్తివంతమైనది. ఇది మహాశివరాత్రితో సమానం. ఇది ఎందుకు అంత విశేషమైనదంటే, బ్రహ్మా-విష్ణు మధ్య సంగ్రామం జరిగినప్పుడు శివుడు ఈరోజు అగ్నిస్తంభంగా ఆవిర్భావం అయిన రోజు. శివుడికి ఈరోజు అభిషేకం చేయడం వలన విశేష ఫలితాన్ని పొందవచ్చు. 

Published on: Dec 7, 2025, 06:00:12 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని అనుకుంటారు. అందుకే పర్వదినాలప్పుడు కొన్ని రకాల పరిహారాలను పాటిస్తూ ఉంటారు. అయితే వచ్చిన వాటిని సరిగ్గా వినియోగించుకుంటే చక్కటి ఫలితాన్ని పొందవచ్చు. కొన్ని పరిహారాలు అద్భుతంగా పని చేస్తాయి, జీవితాన్ని కూడా మార్చేస్తాయి. ఈరోజు చాలా శక్తివంతమైన రోజు. మార్గశిర మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం చాలా శక్తివంతమైనది. ఇది మహాశివరాత్రితో సమానం. ఇది ఎందుకు అంత విశేషమైనదంటే, బ్రహ్మా-విష్ణు మధ్య సంగ్రామం జరిగినప్పుడు శివుడు ఈరోజు అగ్నిస్తంభంగా ఆవిర్భావం అయిన రోజు.

ఈరోజు మార్గశిర మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం, శివరాత్రితో సమానమైన రోజు (pinterest)
ఈరోజు మార్గశిర మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం, శివరాత్రితో సమానమైన రోజు (pinterest)

శివుడికి ఈరోజు అభిషేకం చేయడం వలన విశేష ఫలితాన్ని పొందవచ్చు. తెలిసీ తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. కర్మల నుంచి విముక్తి కలుగుతుంది. ఈరోజు ప్రాతఃకాలంలో అంటే ఉదయం 4:30 నుంచి 6 గంటల లోగా శివుడికి అభిషేకం చేయాలి. ఆవు పాలతో చేసిన నైవేద్యాన్ని శివుడికి నివేదన చేయండి. “ఓం నమ:శ్శివాయ” అనే మంత్రాన్ని వెయ్యి సార్లు వరకు జపిస్తే మంచిది. ఇలా చేయడం వలన శివుని అనుగ్రహం లభించి ఆనందంగా ఉండొచ్చు. జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి.

ఈరోజు ఎవరికి మంచి జరుగుతుంది? ఎవరు అభిషేకం చెయ్యాలి?

  1. ఎవరైనా శివాభిషేకం చేస్తే చక్కటి ఫలితాలని పొందవచ్చు. పాపాలన్నీ తొలగిపోయి ఆనందంగా ఉండొచ్చు.
  2. ముఖ్యంగా ఆరుద్ర నక్షత్రంలో పుట్టి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు కచ్చితంగా ఈ రోజును సద్వినియోగం చేసుకొని శివుడికి అభిషేకం చేస్తే శుభఫలితాలు పొందవచ్చు.
  3. రాహువు, కేతువు గ్రహ దోషాలతో బాధ పడేవారు కూడా ఈరోజు ఈ పరిహారాలను పాటించడం మంచిది.
  4. శని కారణంగా ఇబ్బంది పడుతున్న వారు కూడా ఈ రోజు అభిషేకం చేయడం మంచిది.
  5. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని తో బాధపడే వారు శివుడికి అభిషేకం చేయడం, శివ మంత్రాన్ని జపించడం వంటివి చేయాలి.
  6. ఈ ఆరుద్ర నక్షత్రం వేళ అన్ని శివాలయాల్లో కూడా అభిషేకం చేస్తారు. ఈ అభిషేకాన్ని చూసినా, అభిషేకం చేసినా లేదా అభిషేకం చేసిన నీటిని జల్లుకున్నా జన్మ ధన్యం అవుతుంది.
  7. పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైన ఈ రోజున అర్ధనారీశ్వరుణ్ణి ఎన్నిసార్లు తలుచుకుంటే అంత మంచి జరుగుతుంది.
  8. అలాగే ఈ రోజున “ఓం శ్రీ వర్ధనాయ నమః” అనే మంత్రాన్ని జపిస్తే కూడా చక్కటి ఫలితం కనబడుతుంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More