Jupiter Transit: ఈరోజు గురువు సంచారంలో భారీ మార్పు.. కెరీర్, డబ్బు, సంబంధాలతో సహా 3 రాశుల జీవితాలు తలకిందులు అవ్వచ్చు!
ఈరోజు గురువు రాశి మార్పు చెందుతాడు. ఈరోజు గురువు మిథున రాశిలోకి ప్రవేశించి జూన్ 2, 2026 వరకు ఇదే రాశిలో సంచారం చేస్తాడు. దీంతో కొన్ని రాశుల వారిపై ప్రభావం పడుతుంది. గురువు సంతోషం, జ్ఞానం, అదృష్టం మొదలైన వాటికీ కారకుడు. గురువు సంచారంలో మార్పు జరిగినప్పుడు శుభ ఫలితాలను తీసుకువస్తూ ఉంటుంది.
గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. ఈ గ్రహాల సంచారంలో మార్పు జరిగినప్పుడు అది అన్ని రాశుల వారి జీవితంలో కూడా అనేక మార్పులు తీసుకు వస్తుంది. డిసెంబర్ 5 అంటే ఈరోజు గురువు రాశి మార్పు చెందుతాడు. ఈరోజు గురువు మిథున రాశిలోకి ప్రవేశించి జూన్ 2, 2026 వరకు ఇదే రాశిలో సంచారం చేస్తాడు. దీంతో కొన్ని రాశుల వారిపై ప్రభావం పడుతుంది. గురువు సంతోషం, జ్ఞానం, అదృష్టం మొదలైన వాటికీ కారకుడు. గురువు సంచారంలో మార్పు జరిగినప్పుడు అది శుభ ఫలితాలను తీసుకువస్తూ ఉంటుంది.

గురువు మిథున రాశి సంచారం
గురువు మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆరు నెలల వరకు ఇదే రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. దీంతో మూడు రాశుల వారి జీవితంలో అనేక మార్పులు జరుగుతాయి. నిజానికి అద్భుతం జరుగుతుందని చెప్పవచ్చు. డిసెంబర్ 5 అంటే ఈరోజు గురువు తిరోగమనం నుంచి మిథున రాశిలో సంచారం చేస్తాడు. ఆ తర్వాత మార్చి 11, 2026లో నేరుగా సంచారం చేస్తాడు. జూన్ 2, 2026లో కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. అయితే ఈరోజు ఈ సంచారం కారణంగా కొన్ని రాశులు వారు చిన్నపాటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు. మరి ఆ రాశులు ఎవరు? వారిలో మీరు ఒకరేమో చూసుకోండి.
ఈరోజు గురువు సంచారంలో మార్పు, ఈ రాశుల వారికి చిన్నపాటి సమస్యలు వచ్చే అవకాశం:
1.ధనస్సు రాశి:
ధనస్సు రాశి వారికి గురువు సంచారం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. గురువు, సూర్య కలయిక వలన కూడా ధనుస్సు రాశి వారికి బాగా కలిసి వస్తుంది. కెరియర్ లో అయితే ఈ రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో ఎక్కువ లాభాలు రాకపోవచ్చు. అలాగే వ్యక్తిగత జీవితం, పని రెండు బ్యాలెన్స్‌గా చూసుకోండి.
2.వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి వారు కూడా ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికపరంగా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. లోన్లు వంటివి తీసుకోకుండా చూసుకోండి. కొత్త వెంచర్‌ను మొదలుపెట్టడానికి ఆలోచించండి. కెరియర్‌లో కూడా చాలెంజ్‌లు అన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అశ్రద్ధ పనికిరాదు.
3.మీన రాశి:
మీన రాశి వారికి కూడా ఈ సంచారం చిన్నపాటి సమస్యలను తీసుకొచ్చే అవకాశం ఉంది. కొన్ని చాలెంజ్‌లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. పిల్లలకు సంబంధించిన సమస్యలు ఎదురవ్వచ్చు . ఖర్చులు ఎక్కువ చేయకుండా చూసుకోండి. కొత్త ప్రాజెక్ట్‌లను మొదలు పెట్టొద్దు.
పరిహారాలు
- గురువు సంచారం వలన ఇబ్బందులు కలగకుండా ఉండడానికి రాశులు వారు కొన్ని పరిహారాలను పాటించడం మంచిది. ఈ సమయంలో ఈ రాశుల వారు విష్ణువుని, గురువుని ఆరాధించడం మంచిది. తప్పకుండా గురువారం నాడు వీరిద్దరిని ఆరాధించండి.
- అలాగే “"ఓం గ్రాం గ్రిం గ్రోం సహ గురవే నమః"” మంత్రాన్ని జపించండి.
- పసుపు రంగు వస్తువులను దానం చేయండి. పప్పులు, అరటి పండ్లు, పసుపు రంగు వస్త్రాలను దానం చేయడం వలన విశేష ఫలితాలను పొందడానికి వీలవుతుంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


