Margasira Masam: రేపే రెండవ మార్గశిర గురువారం, లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ ఆరు రకాల పూలతో పూజ చేస్తే సమస్యలు తొలగిపోవచ్చు!

మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీ వారాలు అని అంటారు. మార్గశిర మాసంలో వచ్చే నాలుగు గురువారాలు కూడా చాలా విశేషమైనవి. రేపే మార్గశిర మాసంలో వచ్చే రెండవ గురువారం. ఈ గురువారం నాడు లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో ఆరాధించాలి. లక్ష్మీదేవికి ఈ ఆరు రకాల పూలు అంటే ఎంతో ఇష్టం.

Published on: Dec 03, 2025 3:00 PM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలుగు మాసాల్లో విశిష్టమైనది మార్గశిర మాసం. అందుకే “మాసానాం మార్గశీర్షోహం” అని అంటారు. మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీ వారాలు అని అంటారు. ఆ రోజుల్లో లక్ష్మీదేవిని పూజిస్తే సకల సంతోషాలు కలుగుతాయి. మార్గశిర మాసంలో వచ్చే నాలుగు గురువారాలు కూడా చాలా విశేషమైనవి. శ్రావణ మాసంలో ఎలా అయితే వరలక్ష్మీ వ్రతం చేస్తామో, ఈ మార్గశిర మాసంలో కూడా గురువారం నాడు లక్ష్మీదేవిని ఆరాధించాలి.

లక్ష్మీదేవికి ఈ ఆరు రకాల పూలు అంటే ఎంతో ఇష్టం (pinterest)
లక్ష్మీదేవికి ఈ ఆరు రకాల పూలు అంటే ఎంతో ఇష్టం (pinterest)

అలా చేయడం వలన లక్ష్మీదేవి ఇంట్లో ఉంటారని, ఆర్థిక ఇబ్బందులు ఉండవని నమ్ముతారు. లక్ష్మీదేవి ఇంట్లో ఉంటే ఆర్థికంగా బావుంటుంది, ఐశ్వర్యవంతులు అవ్వచ్చు. లక్ష్మీకటాక్షంతో ఆనందంగా ఉండొచ్చు. మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మికత, పురోగతిని కూడా అమ్మవారు మనకు ప్రసాదిస్తారు.

రెండవ మార్గశిర గురువారం

రేపే మార్గశిర మాసంలో వచ్చే రెండవ గురువారం. ఈ గురువారం నాడు లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో ఆరాధించాలి. చాలా మంది మార్గశిర మాసంలో వచ్చే రెండవ గురువారంలో వ్రతం చేసుకుంటారు. వరలక్ష్మీ వ్రతం ఎలా అయితే శ్రావణ మాసంలో చేసుకుంటారో, మార్గశిర మాసంలో వచ్చే రెండవ గురువారంనాడు లక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు. వ్రత కథ చదువుకుని అక్షింతలు వేసుకుంటారు. అయితే ఈ పవిత్ర దినాన లక్ష్మీదేవికి ఇష్టమైన పూలను సమర్పించడం మర్చిపోకండి. లక్ష్మీదేవికి ఈ ఆరు రకాల పూలు అంటే ఎంతో ఇష్టం. వీటితో ఆరాధిస్తే లక్ష్మీ అనుగ్రహాన్ని పొందవచ్చు.

లక్ష్మీదేవికి ఈ ఆరు రకాల పూలు అంటే ఎంతో ఇష్టం

1. తామర పువ్వులు

తామర పూలు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి. లక్ష్మీదేవి తామర పువ్వులో కొలువై ఉంటారు. బురదలో వికసించే తామర పువ్వు చాలా పవిత్రమైనది. అందుకే కచ్చితంగా లక్ష్మీదేవిని ఆరాధించేటప్పుడు తామర పూలను సమర్పించాలి. తామర పూలను సమర్పించడం వలన ధన సంబంధిత సమస్యలు తొలగిపోయి ఆనందం, శాంతి కలుగుతాయి. వైవాహిక జీవితంలో కూడా ఆనందం ఉంటుంది.

2. గులాబీ పువ్వులు

గులాబీ పువ్వులు కూడా ఆమెకు ఎంతో ప్రీతి. ముఖ్యంగా ఎర్రటి గులాబీలను సమర్పించండి. ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉంటాయి. మానసిక ఒత్తిడి కూడా దూరం అవుతుంది.

3. మల్లె పువ్వులు

మల్లెపూలు అంటే కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం. సువాసన వచ్చే మల్లెపూలను అమ్మవారికి సమర్పిస్తే శాంతి కలుగుతుంది. ప్రేమ, సామరస్యం ఉంటుంది.

4. బంతి పువ్వులు

బంతి పువ్వులను లక్ష్మీదేవికి సమర్పిస్తే చక్కటి ఫలితం ఉంటుంది. సానుకూల శక్తి వ్యాపిస్తుంది. దుష్టశక్తులు తొలగిపోతాయి.

5. మొగలి పువ్వులు

మొగలి పువ్వు కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఈ పూలను సమర్పిస్తే లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నురాలు అవుతుంది.

6. మందారం పువ్వులు

ఎర్రటి మందారాలను లక్ష్మీదేవికి సమర్పిస్తే శ్రేయస్సు కలుగుతుంది, అదృష్టం ఉంటుంది. లక్ష్మీదేవికి ఈ పువ్వులు ఎంతో ఇష్టం. సంపద, ఆనందం, శాంతిని పొందవచ్చు. వ్యాపారాల్లో కూడా వృద్ధి కనపడుతుంది.

News/Rasi Phalalu/Margasira Masam: రేపే రెండవ మార్గశిర గురువారం, లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ ఆరు రకాల పూలతో పూజ చేస్తే సమస్యలు తొలగిపోవచ్చు!
News/Rasi Phalalu/Margasira Masam: రేపే రెండవ మార్గశిర గురువారం, లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ ఆరు రకాల పూలతో పూజ చేస్తే సమస్యలు తొలగిపోవచ్చు!