ఈ 5 పవిత్ర విగ్రహాలను ఇంట్లో పెడితే, నిద్రపోతున్న అదృష్టం మేల్కొంటుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుంది!
ఇంటిని వాస్తు ప్రకారం నిర్మించడం వలన అనేక లాభాలు కలుగుతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని విగ్రహాలను పెడితే కూడా అదృష్టం కలిసి వస్తుంది. సానుకూల శక్తి ప్రవహించి ప్రతికూల శక్తి తొలగిపోతుంది. వాస్తు ప్రకారం ఈ విగ్రహాలను ఇంట్లో పెడితే అదృష్టం కలిసి వస్తుంది, సానుకూల మార్పుల్ని చూస్తారు.
చాలామంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. నిజానికి ఇంటిని వాస్తు ప్రకారం నిర్మించడం వలన అనేక లాభాలు కలుగుతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని విగ్రహాలను పెడితే కూడా అదృష్టం కలిసి వస్తుంది. సానుకూల శక్తి ప్రవహించి ప్రతికూల శక్తి తొలగిపోతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉండే ప్రతి వస్తువు కూడా మన జీవితంలో ప్రభావం చూపిస్తుంది. అయితే వస్తువులను పెట్టేటప్పుడు సరైన దిశలో వాటిని పెడితే మంచిది. అలా చేయడం వలన వాస్తు దోషాలు తొలగిపోతాయి, ఆనందం, ప్రశాంతత, డబ్బు కలుగుతాయి.

చాలామంది ఇళ్లల్లో రకరకాల డెకరేటివ్ వస్తువులను పెడుతూ ఉంటారు. ఇల్లు అందంగా కనిపించాలని వాటిని ఉంచుతారు. అయితే ఇల్లు అందంగా కనపడటమే కాదు, వాస్తు ప్రకారం కూడా కలిసి రావాలన్నా, అదృష్టం పెరగాలన్నా, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలన్నా వీటన్నీ ఇంట్లో పెట్టడం మంచిది.
వాస్తు ప్రకారం ఈ విగ్రహాలను ఇంట్లో పెడితే అదృష్టం కలిసి వస్తుంది, సానుకూల మార్పుల్ని చూస్తారు
1.తాబేలు విగ్రహం
ఇంట్లో చిన్న తాబేలు విగ్రహాన్ని పెడితే చాలా మంచి జరుగుతుంది. వాస్తు ప్రకారం తాబేలు విగ్రహం ఇంట్లో ఉంటే విష్ణువు ఉన్నట్టే, అలాగే లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా ఉంటాయి. తూర్పు లేదా ఉత్తరం వైపు తాబేలు విగ్రహం పెట్టడం మంచిది. ఇలా చేయడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
2.ఏనుగు విగ్రహం
ఏనుగు శక్తి, ధనం వంటి వాటిని సూచిస్తుంది. వాస్తు ప్రకారం ఏనుగు విగ్రహం ఇంట్లో ఉంటే బాగా కలిసి వస్తుంది. వెండి లేదా కాంస్య ఏనుగు విగ్రహాన్ని ఇంట్లో ఉంచితే ఆనందం, ప్రశాంతత ఉంటాయి. రాహువు చెడు ఫలితాల నుంచి కూడా బయటపడటానికి అవుతుంది.
3.ఒంటె విగ్రహం
ఇంట్లో ఒంటె విగ్రహాన్ని పెట్టితే కూడా మంచి జరుగుతుంది. వాస్తు, ఫెంగ్ షుయ్ ప్రకారం ఈ విగ్రహం సహనం, శక్తి, విజయాలను అందిస్తుంది. ఈ విగ్రహాన్ని ఇంట్లో ఉంచితే కెరీర్‌లో మంచి మార్పులు వస్తాయి. ఉద్యోగంలో కూడా చక్కటి ఫలితాలను చూడవచ్చు. నిద్రపోతున్న అదృష్టం కూడా మేల్కొంటుంది.
4.గోవు విగ్రహం
చాలామంది ఇళ్లల్లో ఆవు, దూడ విగ్రహాలను పెడుతూ ఉంటారు. ఈ విగ్రహాన్ని ఇంట్లో పెట్టడం వలన ప్రశాంతత, ప్రేమ, అదృష్టం కలిసి వస్తాయి. ఆవు, దూడ విగ్రహాన్ని ఇంట్లో ఉంచితే సానుకూల శక్తి వ్యాపించి అదృష్టం కూడా కలిసి వస్తుంది. విద్యార్థులు చదువుకునే గదిలో ఈ విగ్రహాన్ని పెడితే మరింత మంచిది.
5.హంస విగ్రహాలు
హంస విగ్రహాలను ఇంట్లో పెడితే వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. వీటిని బెడ్‌రూమ్‌లో పెడితే ప్రేమ పెరుగుతుంది, ఆనందంగా ఉండొచ్చు. భార్య, భర్తల మధ్య బలమైన సంబంధం ఏర్పడి ఆనందంగా ఉండొచ్చు. అలాగే ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


