ఈరోజే మార్గశిర మాసం మొదటి గురువారం.. ఇలా లక్ష్మీదేవిని ఆరాధిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం, అష్టైశ్వర్యాలు పొందవచ్చు!

Margasira Guruvaram: తెలుగు నెలల్లో మార్గశిర మాసం చాలా ఉత్తమమైనది. అందుకే “మాసానాం మార్గశీర్షోహం” అని అంటారు. మార్గశిర మాసంలో వచ్చే లక్ష్మీవారాలను లక్ష్మీవారాలని అంటారు. ఈ గురువారాలను సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే ఆ అమ్మ దయ ఉంటుంది, సంతోషంగా ఉండొచ్చు. పేదరికం నుంచి కూడా బయటపడొచ్చు.

Published on: Nov 27, 2025, 07:00:09 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Margasira Guruvaram: మార్గశిర మాసం చాలా ప్రత్యేకమైన మాసం. మార్గశిర మాసాన్ని సరిగ్గా వినియోగించుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండొచ్చు. తెలుగు నెలల్లో మార్గశిర మాసం చాలా ఉత్తమమైనది. అందుకే “మాసానాం మార్గశీర్షోహం” అని అంటారు. మార్గశిర మాసంలో వచ్చే లక్ష్మీవారాలను లక్ష్మీవారాలని అంటారు. ఈ గురువారాలను సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే ఆ అమ్మ దయ ఉంటుంది, సంతోషంగా ఉండొచ్చు. పేదరికం నుంచి కూడా బయటపడొచ్చు.

ఈరోజే మార్గశిర మాసంలో వచ్చే మొదటి గురువారం (pinterest)
ఈరోజే మార్గశిర మాసంలో వచ్చే మొదటి గురువారం (pinterest)

శ్రావణ మాసంలో ఎలా అయితే శుక్రవారం రోజు వరలక్ష్మీదేవిని ఆరాధిస్తాము, మార్గశిర మాసంలో కూడా లక్ష్మీదేవిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. మార్గశిర మాసంలో వచ్చే మొదటి గురువారం నవంబర్ 27 అంటే ఈరోజు. మార్గశిర మాసంలో వచ్చే మొదటి గురువారం ఈరోజు.

ఎలా లక్ష్మీదేవిని ఆరాధించాలి?

లక్ష్మీదేవిని పూజిస్తే ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. సంవత్సరానికి సరిపడా అష్టైశ్వర్యాలని కూడా పొందడానికి వీలవుతుంది. అయితే మరి ఇంతటి ఉత్తమమైన గురువారం నాడు ఏం చేయాలి? ఎలా లక్ష్మీదేవిని ఆరాధించాలి? ఇలాంటి విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం.

మొదటి మార్గశిర లక్ష్మీవార నాడు ఏం చేయాలి?

  1. భక్తి, శ్రద్ధలతో మార్గశిర మాసంలో వచ్చే గురువారాల రోజు లక్ష్మీదేవిని పూజిస్తే ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు. ఆ లక్ష్మీదేవి వరాల జల్లు కురిపిస్తుంది. తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేయాలి. షాంపూ పెట్టి తలస్నానం చేయకూడదని గుర్తుపెట్టుకోండి.
  2. స్నానం చేసే నీళ్లలో కొంచెం పసుపు కలుపుకుని స్నానం చేస్తే జాతక దోషాలు తొలగిపోతాయి.
  3. ఈ గురువారం నాడు గుమ్మం ముందు బియ్యం పిండితో ముగ్గు వేసుకుని లక్ష్మీదేవిని ఆరాధించాలి.
  4. ఈరోజు పసుపు లేదా ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తే మంచిది.
  5. పూజ చేసుకునే చోట ముగ్గు వేసిన దానిపై ఒక పీఠం వేసి, ఎర్రటి వస్త్రం వేసి లక్ష్మీదేవి చిత్రపటాన్ని పెట్టుకుని, లక్ష్మీదేవికి పసుపు, కుంకుమలతో బొట్లు పెట్టి అందంగా అలంకరించుకోవాలి. లక్ష్మీదేవిని ఆరాధించండి.
  6. లక్ష్మీదేవికి చాలామంది నగలు వేసి అందంగా అలంకరించుకుంటారు.
  7. ఆవు నెయ్యితో దీపారాధన చేసి, వినాయకుని పూజించి ఆ తర్వాత లక్ష్మీదేవిని కూడా ఆరాధించండి.
  8. బియ్యం, పెసరపప్పుతో చేసిన పులగాన్ని మొదటి లక్ష్మీవారినాడు లక్ష్మీదేవికి నివేదించాలి.
  9. ఈరోజు “శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః” అనే మంత్రాన్ని జపిస్తే మంచిది.
  10. దీప, ధూప, నైవేద్యాలతో లక్ష్మీదేవిని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయి.

మార్గశిర గురువారం నాడు ఇలా చేస్తే మంచిది

డబ్బు కలిగి, ఆర్థిక సమస్యలను దూరంగా ఉంచుకోవాలంటే తులసిని పూజించండి. ఐశ్వర్యం కలుగుతుంది. తులసి కోటకు పసుపు, కుంకుమలతో బొట్లు పెట్టి, ముగ్గు వేసి, నెయ్యి దీపాన్ని వెలిగించండి. అలాగే తులసి కోట చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేయండి. లక్ష్మివారం నాడు గోవును ఆరాధిస్తే కూడా మంచిదే. గోవును ఆరాధించడం వలన ముక్కోటి దేవతల ఆశీర్వాదం కలుగుతుంది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More