త్వరలో సూర్య–చంద్రుల కలయికతో వైధృతి యోగం.. డబ్బు, విజయాలు, అదృష్టం ఇలా ఎన్నో ఊహించని లాభాలు!
జ్యోతిష్య లెక్కల ప్రకారం డిసెంబర్ 8న ఒక ప్రత్యేకమైన కలయిక ఏర్పడుతుంది. సూర్యుడు, చంద్రుడు సంయోగం చెంది వైదృతి యోగంను ఏర్పరుస్తారు. ఈ యోగం విపరీతమైన అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఈ వైధృతి యోగం విజయాలను, పురోగతిని, డబ్బు అందిస్తుంది. సమస్యలన్నిటిని తొలగిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు ఉంటాయి.
గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వచ్చినపుడు అది ద్వాదశ రాశుల జీవితంలో ప్రభావాన్ని చూపిస్తుంది. జ్యోతిష్య లెక్కల ప్రకారం డిసెంబర్ 8న ఒక ప్రత్యేకమైన కలయిక ఏర్పడుతుంది. సూర్యుడు, చంద్రుడు సంయోగం చెంది వైదృతి యోగంను ఏర్పరుస్తారు. ఈ యోగం విపరీతమైన అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఈ వైధృతి యోగం విజయాలను, పురోగతిని, డబ్బు అందిస్తుంది. సమస్యలన్నిటిని తొలగిస్తుంది.

వైధృతి యోగం:
డిసెంబర్ 8న సూర్యుడు, చంద్రుడు ఒకే రాశిలో సంయోగం చెందడంతో ఈ యోగం ఏర్పడుతుంది. ఈ యోగం కారణంగా కొన్ని రాశుల వారు ఎక్కువ లాభాలను పొందుతారు. ఆర్థిక పరంగా బావుంటుంది. అనేక విధాలుగా అవకాశాలు వస్తాయి. ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఆర్థిక లాభాలను పొందుతారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు చాలా లాభాలు ఉంటాయి. మరి ఆ అదృష్ట రాశులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
సూర్య–చంద్రుల కలయికతో వైధృతి యోగం.. ఈ రాశుల వారికి అనేక లాభాలు
1.మేష రాశి
మేష రాశి వారికి ఈ యోగం అనేక విధాలుగా కలిసి వస్తుంది. జీవితంలో పురోగతిని చూస్తారు. కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కెరీర్‌లో మంచి అవకాశాలు వస్తాయి. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. సమాజంలో గౌరవం, మర్యాదలు ఉంటాయి. సంపద కూడా పెరుగుతుంది.
2.కన్య రాశి
కన్య రాశి వారికి ఈ యోగం అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఈ సమయంలో ఈ రాశివారు ప్రమోషన్‌ను పొందుతారు. కొత్త ఉద్యోగం లభిస్తుంది. అదృష్టం కూడా కలిసి వస్తుంది. మానసిక ప్రశాంతత ఉంటుంది. వ్యాపారస్తులకి కూడా ఇది శుభ సమయం.
3.కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఆర్థికంగా లాభాలు కలుగుతాయి. ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయి. ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి. పాత సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆనందంగా ఉంటారు.
4.వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఈ యోగం బాగా కలిసి వస్తుంది. పాత సమస్యలు తొలగిపోతాయి. ఆర్థికపరంగా బాగుంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. సక్సెస్‌ను అందుకుంటారు. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. శత్రువులపై విజయాలను సాధిస్తారు. ఈ యోగంతో ఈ రాశి వారు చాలా లాభాలను పొందుతారు, శుభ ఫలితాలను అందుకుంటారు.
5.మీన రాశి
మీన రాశి వారికి ఈ యోగం బాగా కలిసి వస్తుంది. ఆర్థికపరంగా బావుంటుంది. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి. అదృష్టం పెరుగుతుంది. కష్టానికి తగ్గ ఫలితాలను చూస్తారు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


