వాస్తు ప్రకారం ఇంట్లో ఈ మొక్కలు ఉంటే వివాహం ఫిక్స్ అవ్వచ్చు .. దోషాలు కూడా తొలగిపోతాయి

వాస్తు ప్రకారం, ఇంట్లో ఈ మొక్కలు ఉన్నట్లయితే ఎన్నో విధాలుగా లాభాలను పొందవచ్చు. వాస్తు ప్రకారం పాటిస్తే చాలా ఇబ్బందులను తొలగించేందుకు వీలవుతుంది. వాస్తు ప్రకారం పాటిస్తే సానుకూల శక్తి కూడా ఏర్పడుతుంది. ప్రతికూల శక్తి పూర్తిగా తొలగి పోతుంది. కుజ దోషం, రాహు, కేతువుల దోషం వంటివి కూడా తొలగిపోతాయి.

Published on: Dec 2, 2025, 08:00:01 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

చాలా మంది ఇళ్లల్లో నచ్చిన మొక్కలను పెంచుకుంటూ ఉంటారు. మొక్కలు కేవలం అందానికే కాక, కొన్ని రకాల దోషాలను తొలగించడానికి, సమస్యలను పరిష్కరించడానికి, సానుకూల శక్తిని పెంచడానికి కూడా సహాయపడతాయి. వాస్తు ప్రకారం, ఇంట్లో ఈ మొక్కలు ఉన్నట్లయితే ఎన్నో విధాలుగా లాభాలను పొందవచ్చు.

ఈ మొక్కలను పెంచితే దోషాలు తొలగిపోతాయి, వివాహం కూడా అవుతుంది (pinterest)
ఈ మొక్కలను పెంచితే దోషాలు తొలగిపోతాయి, వివాహం కూడా అవుతుంది (pinterest)

వాస్తు ప్రకారం పాటిస్తే చాలా ఇబ్బందులను తొలగించేందుకు వీలవుతుంది. వాస్తు ప్రకారం పాటిస్తే సానుకూల శక్తి కూడా ఏర్పడుతుంది. ప్రతికూల శక్తి పూర్తిగా తొలగి పోతుంది. ఈ మొక్కలు ఇంట్లో ఉంటే పెళ్లి కాని వారికి పెళ్లి కుదిరే అవకాశం కూడా ఉంటుంది. కుజ దోషం, రాహు, కేతువుల దోషం, సూర్య దోషం, మాంగల్య దోషం, పుత్ర దోషం వంటివి కూడా తొలగిపోతాయి.

ఈ మొక్కలను పెంచితే దోషాలు తొలగిపోతాయి, వివాహం కూడా అవుతుంది

1.అరటి చెట్టు

ఇంట్లో అరటి చెట్టుని నాటడం వలన వివాహంలో అడ్డంకులు తొలగి పోతాయి. ఆనందంగా ఉండొచ్చు. అరటి చెట్టును ఎంతో పవిత్రమైన చెట్టుగా భావిస్తారు. ఇది సానుకూల శక్తిని కూడా తీసుకు వస్తుంది. పెళ్లి అవ్వక ఇబ్బందులు పడుతున్న వారికి ఈ మొక్క ఎంతో సహాయ పడుతుంది. వివాహానికి సంబంధించిన అడ్డంకులను తొలగిస్తుంది. అలాగే, ఈ మొక్క వద్ద గురువారం నాడు నెయ్యితో దీపారాధన చేస్తే మంచిది.

2.తులసి మొక్క

తులసి మొక్కను ఇంట్లో పెంచితే చాలా మంచి జరుగుతుంది. తులసి మొక్కను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఇంట్లో తులసి మొక్క ఉంటే ప్రతికూల శక్తి తొలగిపోతుంది, అడ్డంకులు కూడా తొలగిపోతాయి, ఆనందంగా ఉండొచ్చు. ప్రతి రోజూ తులసి మొక్క దీపారాధన చేస్తే లక్ష్మీదేవి అశీసులు ఉంటాయి.

3.బంతి మొక్క

బంతి మొక్క శాంతి, ప్రశాంతతను అందిస్తుంది. ఈ మొక్క ఇంట్లో ఉంటే వివాహ జీవితంలో అడ్డంకులు కూడా తొలగి పోతాయి. సానుకూల శక్తి ఏర్పడుతుంది, మనశ్శాంతి కూడా ఉంటుంది. ఇంటి ఉత్తరం వైపు బంతి మొక్కను నాటితే మంచిది. ఈ మొక్క ప్రేమ జీవితంలో ఉన్న అడ్డంకులను కూడా తొలగిస్తుంది.

4.ఆర్చిడ్

ప్రేమ, అందం, కొత్త ప్రారంభాలకు చిహ్నం. ఈ మొక్క ఇంట్లో ఉంటే ప్రేమ జీవితంలో సమస్యలు ఉండవు; వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. ఈ మొక్కను ఇంట్లో నైరుతి వైపు పెడితే మంచిది. పడకగదిలో పెంచుకోవాలనుకుంటే, వాయువ్యం వైపు ఉంచండి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More