వాస్తు ప్రకారం ఇంట్లో శాంతి, సంవృద్ధి కలగంటే.. పొరపాటున కూడా ఈ ఐదు తప్పులు చేయకండి!

ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని, ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేకుండా ఉండాలని అనుకుంటారు. కొంత మందికి ఆకస్మాత్తుగా ఖర్చులు పెరిగిపోవడం, ఇంటి శ్రేయస్సు ఆగిపోవడం వంటివి చూస్తూ ఉంటారు. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే కొన్ని తప్పులు జరగకుండా చూసుకోవాలి. వాస్తు ప్రకారం ఇంట్లో శాంతి కలగంటే ఈ ఐదు తప్పులు చేయకండి.

Published on: Nov 11, 2025, 10:00:06 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని, ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేకుండా ఉండాలని అనుకుంటారు. అయితే కొన్ని సార్లు వచ్చినట్టే డబ్బు తిరిగి వెళ్ళిపోతూ ఉంటుంది, ఎంతో కాలం అది మన దగ్గర నిలవదు. అయితే డబ్బు అలా నిలవకపోయినా, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నా.. చిన్న చిన్న తప్పులు చేస్తున్నారని అర్థం చేసుకోవాలి. లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి చాలా మంది రకరకాల పరిహారాలని పాటిస్తూ ఉంటారు. అయితే, కొంత మందికి ఆకస్మాత్తుగా ఖర్చులు పెరిగిపోవడం, ఇంటి శ్రేయస్సు ఆగిపోవడం వంటివి చూస్తూ ఉంటారు.

వాస్తు ప్రకారం ఇంట్లో శాంతి, సంవృద్ధి కలగంటే ఈ ఐదు తప్పులు చేయకండి (internal)
వాస్తు ప్రకారం ఇంట్లో శాంతి, సంవృద్ధి కలగంటే ఈ ఐదు తప్పులు చేయకండి (internal)

ఇలాంటివి జరగకుండా ఉండాలంటే కొన్ని తప్పులు జరగకుండా చూసుకోవాలి. అలాగే ఇంట్లో సానుకూల శక్తి, ఆనందం, శాంతి, స్థిరత్వం కూడా ఉండాలి. విభేదాలు రావడం, మానసిక ఒత్తిడితో సతమతం అవ్వడం వంటివి లేకుండా ఉండాలంటే కొన్ని పొరపాట్లు జరగకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, వాస్తు ప్రకారం రెండూ కూడా కొన్ని తప్పులు చేయకూడదని చెప్తున్నాయి. మరి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

వాస్తు ప్రకారం ఇంట్లో శాంతి, సంవృద్ధి కలగంటే ఈ ఐదు తప్పులు చేయకండి

1.గోళ్లను కొరకడం:

గోళ్లను కొరకడం అనేది చాలా అశుభమైనదిగా పరిగణిస్తారు. ఈ అలవాటు ఆరోగ్యానికి మంచిది కాదు. అలాగే ప్రతికూల శక్తిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ అలవాటు మానుకోవడం మంచిది.

2.అతిథులు పై కోపం:

కొంతమంది అతిథులు పై కోపం చూపిస్తారు. ఇంటికి వచ్చినప్పుడు కోప్పడడం మంచిది కాదు. చాలా గ్రంథాల్లో కూడా ఈ విషయం చెప్పబడింది. పైగా మనం “అతిథి దేవోభవ” అని అంటాము. అతిథులు వచ్చినప్పుడు సంతోషంగా ఉండాలి. కోపం తెచ్చుకుంటే ఇంట్లో లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. సంతోషకరమైన హృదయంతో వారిని చూడాలి, వారిని స్వాగతించాలి, గౌరవించాలి. అలా ఉండడం వలన ఆ ఇంటికి చాలా మంచి జరుగుతుంది.

3.చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలి:

వాస్తు ప్రకారం ఇంట్లో చెత్త పేరుకుపోవడం మంచిది కాదు. అది ప్రతికూల శక్తికి కారణం అవుతుంది. చెత్తను ఎక్కువ రోజులు ఉంచేయడం వలన నష్టాలు కలుగుతాయి, శ్రేయస్సుని అడ్డుకుంటుంది. ప్రతిరోజూ ఉదయం ఇంటిని శుభ్రం చేయాలి, ఆ చెత్తను బయట పారేయాలి. ముఖ్యంగా వంటగది, పూజగది శుభ్రంగా ఉండేటట్లు చూసుకోవాలి.

4.విరిగిపోయిన, పగిలిపోయిన సామాన్లు:

ఇంట్లో పనికిరాని సామాన్లు ఉండడం వలన ప్రతికూల శక్తి ఏర్పడి సానుకూల శక్తి దూరమైపోతుంది. పగిలిపోయిన సామాన్లు, పాత సామాన్లు ఇంటి నుంచి తొలగించాలి. గడియారాలు, ఫర్నిచర్ వంటివి కూడా పాడైపోతే ఇంటి నుంచి తొలగించాలి, లేదంటే వాస్తు దోషాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. విరిగిపోయిన వస్తువులు మానసికంగా సమస్యలను తీసుకు వస్తాయి. అలాగే పాత సామాన్లు ఇంటి నుంచి తొలగించకపోవడం వలన నష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

5.తప్పుగా ప్రవర్తించడం:

బంధువులతో, పెద్దవాళ్లతో తప్పుగా ప్రవర్తించడం వలన ప్రతికూల శక్తి కలుగుతుంది. కుటుంబంలో తగాదాలు, అవమానాలు, విభేదాలు వంటివి జరిగినట్లయితే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. తల్లిదండ్రులు, తోబుట్టువులు, బంధుమిత్రులతో సరిగ్గా వ్యవహరించాలి, బాగా మాట్లాడాలి. లేదంటే సానుకూల శక్తి దూరం అవుతుంది, ప్రతికూల శక్తితో ఇబ్బంది పడాల్సి ఉంటుంది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More