...
...
Next Story

ఏపీసీపీడీసీఎల్‌ ఏఈఈ పోస్టులకు నోటిఫికేషన్.. రూ.2.08 లక్షల వరకు శాలరీ!

APCPDCL Recruitment : ఇంజినీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులకు విద్యుత్ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఏపీసీపీడీసీఎల్‌‌లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరింగ్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ నడుస్తోంది.

Published on: Jul 9, 2026, 07:45:56 IST
Advertisement

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ ఇంజనీరింగ్ అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (APCPDCL) భారీ శుభవార్త అందించింది. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా ఎలక్ట్రికల్, సివిల్, టెలికాం విభాగాలలో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన యువ, ప్రతిభావంతులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరారు.

పోస్టులు

ఏఈఈ పోస్టులకు నోటిఫికేషన్
ఏఈఈ పోస్టులకు నోటిఫికేషన్

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 60 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) పోస్టులను భర్తీ చేస్తారు. కొత్త ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2025 నిబంధనల ప్రకారం 95 శాతం పోస్టులను లోకల్ అభ్యర్థులకు, 5 శాతం పోస్టులను ఓపెన్ కాంపిటీషన్ (లోకల్, నాన్-లోకల్) కింద కేటాయించారు.

ఏఈఈ (ఎలక్ట్రికల్): 56 పోస్టులు (లోకల్ - 53, ఓపెన్ - 3) , ఏఈఈ(సివిల్): 03 పోస్టులు (లోకల్ - 2, ఓపెన్ - 1), ఏఈఈ (టెలికాం): 01 పోస్టు (ఓపెన్ - 1) ఉన్నాయి.

ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్ దరఖాస్తులు 30 జూన్ 2026 (ఉదయం 10:00 గంటల నుండి) మెుదలైంది. దరఖాస్తు, ఫీజు చెల్లింపునకు చివరి తేదీ 20 జూలై 2026 (రాత్రి 23:59 గంటల వరకు) ఉంది. ఆన్‌లైన్ మాక్ టెస్ట్ లభ్యత 15 ఆగస్టు 2026 నుండి ఉంటాయి. పరీక్షకు 7 రోజుల ముందు నుండి హాల్ టికెట్ల డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష (CBT) తేదీలు 22 ఆగస్టు 2026 నుండి 29 ఆగస్టు 2026 వరకు ఉన్నాయి.

అర్హతలు

01 జూలై 2026 నాటికి అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ (EWS) అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో 5 సంవత్సరాల సడలింపు ఉంటుంది. దివ్యాంగులకు 10 సంవత్సరాల సడలింపు ఇస్తారు.

ఎంపికైన అభ్యర్థులు మొదట 2 సంవత్సరాల ప్రొబేషన్ కాలంలో ఉంటారు. ఈ ప్రొబేషన్ సమయంలో నెలకు రూ. 75,000 చొప్పున వేతనం చెల్లిస్తారు. ప్రొబేషన్ విజయవంతంగా పూర్తి చేసుకున్న తర్వాత వారికి రెగ్యులర్ టైమ్ స్కేల్ (రూ. 86,245 - రూ. 2,08,915) వర్తిస్తుంది. అభ్యర్థులు చేరే సమయంలో 2 సంవత్సరాల ప్రొబేషన్, ఆ తర్వాత కనీసం 5 సంవత్సరాలు (మొత్తం 7 సంవత్సరాలు) సంస్థలో పనిచేస్తామని రూ. 110 సర్వీస్ బాండ్ సమర్పించాల్సి ఉంటుంది. ప్రొబేషన్ కాలంలో ఉద్యోగం వదిలితే రూ. 5 లక్షలు, ఆ తర్వాత వదిలితే రూ. 10 లక్షల లిక్విడేటెడ్ డ్యామేజెస్ చెల్లించాల్సి ఉంటుంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks