ఏపీ సీఆర్‌డీఏలో కొత్తగా 754 పోస్టులు - కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్

ఏపీ సీఆర్డీఏలో 754 పోస్టుల ర్యాటిఫికేషన్‌కు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఏపీ సీఆర్డీఏ 57వ అథారిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా రాజధానిలో భూమిలేని నిరుపేదలకు ఇచ్చే పెన్షన్లను ఆ కుటుంబంలో మైనర్లయిన అనాథలకు వర్తింప చేసేందుకు ఆమోదముద్ర పడింది.

Published on: Jan 07, 2026 8:27 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాజధాని ప్రాంతంలోని కృష్ణా నదీ తీరాన్ని మెరీనా వాటర్ ఫ్రంట్‌గా అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. దీనికి సంబంధించి ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సీఆర్డీఏ అథారిటీ సమావేశం ఆమోదాన్ని తెలియజేసింది.

సీఆర్డీఏ
సీఆర్డీఏ

మెరీనా వాటర్ ఫ్రంట్‌లో భాగంగా జెట్టీలు, టూరిజం లీజర్ బోట్లు, ఫుడ్ ప్లాజాలు, ల్యాండ్ స్కేప్‌ పనులను పీపీపీ విధానంలో చేపట్టేందుకు టెండర్లు పిలవాలని సీఎం చంద్రబాబు సూచించారు. వాటర్ ఫ్రంట్ రూపకల్పనకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. రివర్ ఫ్రంట్‌తో పాటు వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీ ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. బ్లూ- గ్రీన్ సిటీగా అమరావతిని తీర్చిదిద్దే క్రమంలో అంతర్గత కాలువల నిర్మాణం, సుందరీకరణ పనులు జరగాలన్నారు. ప్రకాశం బ్యారేజీ ఎగువన నిర్మించే నూతన బ్యారేజ్‌తో రాజధానికి నీటి వనరులు సమకూరతాయని వివరించారు. కృష్ణానదికి ఇరు వైపులా అద్భుతమైన వాటర్ ఫ్రంట్ అభివృద్ధి చేసుకోవచ్చని సూచించారు.

ఏపీ సీఆర్డీఏలో 754 పోస్టులు…

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ సీఆర్డీఏ 57వ అథారిటీ సమావేశం మంగళవారం జరిగింది. సీఆర్డీఏలో 754 ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలిపింది. ఇదే విషయాన్ని పురపాలకశాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. సీఆర్‌డీఏలో కొత్తగా 754 పోస్టుల మంజూరుకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు.

ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లలో వీధి శూల ఉన్న 112 ప్లాట్లకు ప్రత్యామ్నాయ ప్లాట్ల కేటాయింపునకు అంగీకారం కుదిరింది. రాజధానిలో భూమిలేని నిరుపేదలకు ఇచ్చే పెన్షన్లను ఆ కుటుంబంలో మైనర్లయిన అనాథలకు వర్తింప చేసేందుకు ఆమోదముద్ర పడింది. రాజధాని ప్రాంతంలోని కృష్ణా నదీ తీరాన్ని మెరీనాగా అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనలను అథారిటీ ఆమోదించింది.

మరోవైపు వాటర్ ఫ్రంట్, జెట్టీలు, టూరిజం లీజర్ బోట్లు, ఫుడ్ ప్లాజాలు, ల్యాండ్ స్కేప్‌ పనులను పీపీపీ విధానంలో చేపట్టేందుకు టెండర్లు పిలవాలని నిర్ణయం తీసుకుంది. సీఆర్డీఏలో 754 పోస్టుల ర్యాటిఫికేషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.