...
...
Next Story

APMSRB Recruitment : 97 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ - దరఖాస్తులకు చివరి తేదీ ఇదే

ఏపీ వైద్య సేవల నియామక బోర్డు నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని పలు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 97 అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేస్తారు. జనవరి 12 నుంచి దరఖాస్తులు ప్రారంభం అవ్వగా… 27వ తేదీతో గడువు ముగుస్తుంది.

Published on: Jan 10, 2026 05:05 PM IST
Advertisement

ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్ మెంట్ బోర్డు (APMSRB) నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో వైద్య విద్య సంచాలకుల (డీఎంఈ) పరిధిలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేస్తారు. మొత్తం 97 ఖాళీలున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

97 అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
97 అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

సూపర్‌ స్పెషాలిటీల్లో క్లినికల్, నాన్‌-క్లినికల్‌ విభాగాల్లో ఈ పోస్టులను రిక్రూట్ చేస్తారు. ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ జనవరి 12వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. అర్హులైన అభ్యర్థులు ఈనెల 27వ తేదీలోపు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

APMSRB నోటిఫికేషన్ వివరాలు:

  • ఉద్యోగ ప్రకటన - మెడికల్ సర్వీసెస్ రిక్రూట్ మెంట్ బోర్డు,ఆంధ్రప్రదేశ్
  • ఉద్యోగాలు - అసిస్టెంట్ ప్రొఫెసర్లు
  • మొత్తం ఖాళీలు - 97
  • మొత్తం 30 విభాగాల్లోని ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు.
  • దరఖాస్తు విధానం - ఆన్ లైన్
  • దరఖాస్తులు ప్రారంభం - 12 జనవరి 2026
  • దరఖాస్తులకు చివరి తేదీ - 27 జనవరి 2026
  • అర్హతలతో పాటు పూర్తిస్థాయి వివరాలతో కూడిన నోటిఫికేషన్ వివరాలను https://apmsrb.ap.gov.in/msrb/ వెబ్ సైట్ లో ఉంచుతారు.
  • అధికారిక వెబ్ సైట్ - https://apmsrb.ap.gov.in/msrb/ , https://dme.ap.nic.in/

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe