ఏపీపీఎస్సీ నుంచి కీలక అప్డేట్.. ఆ పోస్టుల తుది ఎంపిక జాబితా విడుదల

APPSC : ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో కెమిస్ట్రీ, ఎకనామిక్స్, జువాలజీ సబ్జెక్టులకు సంబంధించి లెక్చరర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది ఏపీపీఎస్సీ. ఈ జాబితా కమిషన్ అధికారిక వెబ్‌సైట్ https://psc.ap.gov.inలో అందుబాటులో ఉంటుంది.

Published on: Jul 15, 2026, 07:46:53 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్ల పోస్టుల భర్తీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) కీలక ప్రకటన చేసింది. ఏపీ కాలేజియట్ ఎడ్యుకేషన్ సర్వీస్‌లో జనరల్ రిక్రూట్‌మెంట్ కింద కెమిస్ట్రీ, ఎకనామిక్స్, జువాలజీ సబ్జెక్టులకు సంబంధించిన అభ్యర్థుల తుది ఎంపిక జాబితాను విడుదల చేసింది. 2026 జూన్ 22న విడుదల చేసిన ఎంపిక నోటిఫికేషన్‌కు కొనసాగింపుగా ఈ తాజా జాబితాను ఏపీపీఎస్సీ కార్యదర్శి జూలై 14, 2026న అధికారికంగా ప్రకటించారు.

ఏపీపీఎస్సీ
ఏపీపీఎస్సీ

ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి వివిధ దశల్లో నిర్వహించిన పరీక్షల ఆధారంగా అభ్యర్థులను తాత్కాలికంగా ఎంపిక చేశారు. రాత పరీక్షలు 15.07.2025 నుండి 23.07.2025 వరకు కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు జరిగాయి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ 20.05.2026 నుండి 29.05.2026 వరకు, 06.07.2026న అభ్యర్థుల అసలు ధృవీకరణ పత్రాల పరిశీలన జరిగింది. కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ 10.06.2026 మరియు 06.07.2026 తేదీల్లో నిర్వహించారు. ఈ రిక్రూట్‌మెంట్‌లో జోన్-I, జోన్-II, జోన్-III, జోన్-IV పరిధిలో ఎంపికైన అభ్యర్థుల హాల్ టికెట్/రిజిస్టర్ నంబర్లను ఏపీపీఎస్సీ ప్రకటించింది.

పరీక్షల్లో విజయం సాధించినంత మాత్రాన నేరుగా నియామక హక్కు లభించదు. అభ్యర్థి క్యారెక్టర్, పూర్వాపరాలు పరిశీలించిన తర్వాతే నియామక అధికారి సంతృప్తి చెందితేనే ఉద్యోగం లభిస్తుంది. అభ్యర్థులు సదరు పోస్టుకు శారీరకంగా ఫిట్‌గా ఉండాలి. నియామక అధికారులు కోరిన విధంగా నిబంధనల ప్రకారం అసలు ధృవీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఎవరైనా తప్పుడు సమాచారం అందించినట్లు లేదా నిబంధనలకు విరుద్ధంగా ఎంపికైనట్లు కమిషన్ దృష్టికి వస్తే, వారి తాత్కాలిక ఎంపికను ఏ దశలోనైనా రద్దు చేస్తారు.

ఈ ఎంపిక ప్రక్రియ గౌరవనీయ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల (ఏవైనా ఉంటే) అంతిమ తీర్పులకు లోబడి ఉంటుంది. ఫలితాల రూపకల్పనలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, ఏవైనా సాంకేతిక లోపాలు దొర్లితే వాటిని సవరించే హక్కు కమిషన్‌కు ఉంది. ఈ మూడు సబ్జెక్టులకు సంబంధించిన నియామక ప్రక్రియ ఈ నోటిఫికేషన్‌తో పూర్తిగా ముగిసిందని ఏపీపీఎస్సీ కార్యదర్శి స్పష్టం చేశారు.

మిగిలిన తొమ్మిది సబ్జెక్టుల ఫలితాలను తగిన సమయంలో ప్రకటిస్తామని APPSC ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.

ఈ లింక్ క్లిక్ చేసి ఫలితాలు చూడండి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More