...
...
Next Story

APPSC : ఏపీపీఎస్సీ 6 ఉద్యోగ నోటిఫికేషన్ల దరఖాస్తు గడువు పొడిగింపు.. పూర్తి వివరాలు!

APPSC : ఏపీపీఎస్సీ నిరుద్యోగులకు శుభవార్త అందించింది. ఏఈఈ, ఏఎంవీఐ సహా 6 కీలక ఉద్యోగ నోటిఫికేషన్ల ఆన్‌లైన్ దరఖాస్తు గడువును ఏపీపీఎస్సీ డిసెంబర్ 7 వరకు పొడిగించింది.

Published on: Nov 21, 2026, 14:13:53 IST
Advertisement

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) తీపికబురు అందించింది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ప్రత్యక్ష నియామకాల కోసం ఇటీవల విడుదల చేసిన ఆరు కీలక ఉద్యోగ నోటిఫికేషన్లకు ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ గడువును పొడిగిస్తున్నట్లు కమిషన్ ప్రకటించింది. అభ్యర్థుల నుండి పెద్ద ఎత్తున అందిన విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటన విడుదల చేసింది.

ఏపీపీఎస్సీ
ఏపీపీఎస్సీ

తాజా నిర్ణయం ప్రకారం, ఆయా పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 7, 2026 రాత్రి 11:59 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఇదే చివరి అవకాశమని, భవిష్యత్తులో దరఖాస్తు గడువును ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ పొడిగించబోమని కమిషన్ స్పష్టం చేసింది. ఏపీపీఎస్సీ విడుదల చేసిన నోట్ ప్రకారం గడువు పొడిగించిన 6 నోటిఫికేషన్లు, పోస్టుల వివరాలు చూడండి.

  • అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు (AEE - వివిధ ఇంజనీరింగ్ విభాగాలు)-503 పోస్టులు
  • అసిస్టెంట్ డైరెక్టర్ (మైన్స్) - ఏపీ మైన్స్ అండ్ జియాలజీ సర్వీస్-01 పోస్టు
  • టెక్నికల్ అసిస్టెంట్ - ఏపీ మైన్స్ అండ్ జియాలజీ సబార్డినేట్ సర్వీస్-36 పోస్టులు
  • ల్యాబ్ అసిస్టెంట్ - ఏపీ మైనింగ్ సబార్డినేట్ సర్వీస్-01 పోస్టు
  • అసిస్టెంట్ కెమికల్ ఎగ్జామినర్ - ఏపీ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబార్డినేట్ సర్వీస్-9 పోస్టులుఅసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (AMVI) - ఏపీ ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్-50 పోస్టులు

గతంలో ఈ పోస్టులకు దరఖాస్తు గడువు నవంబర్ 22, నవంబర్ 26 తేదీలతో ముగియాల్సి ఉండగా, తాజా పొడిగింపుతో డిసెంబర్ 7 వరకు అవకాశం లభించింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ https://psc.ap.gov.in ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

డిసెంబర్ 7 రాత్రి 11:59 గంటల వరకు సమయం ఉన్నప్పటికీ, చివరి రోజుల్లో వెబ్‌సైట్ సర్వర్ రద్దీగా ఉండే అవకాశం ఉన్నందున అభ్యర్థులు వీలైనంత త్వరగా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలి. ఈ నోటిఫికేషన్లకు సంబంధించి దరఖాస్తు గడువును మళ్లీ పొడిగించే ప్రసక్తే లేదని కమిషన్ స్పష్టం చేసింది. సాంకేతిక కారణాలు లేదా సర్టిఫికెట్ల ఆలస్యం కారణంగా ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేకపోయిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

 

ABOUT THE AUTHOR

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks