AP Group 1 Notification : ఏపీ గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల - అక్టోబర్ 6 నుంచి దరఖాస్తులు, పోస్టుల వారీగా ఖాళీల వివరాలివే
APPSC Group 1 Notification : 163 గ్రూప్-1 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. అక్టోబర్ 6 నుంచి 27 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
APPSC Group 1 Notification : ప్రభుత్వ ఉద్యోగం కోసం నిరీక్షిస్తున్న అభ్యర్థులకు ఏపీపీఎస్సీ శుభవార్త అందించింది. గ్రూప్-1 సర్వీసుల కింద అత్యున్నత కేడర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 163 పోస్టులను భర్తీ చేయనుంది.

ఈ గ్రూప్ 1 పోస్టుల కోసం అభ్యర్థులు అక్టోబర్ 06, 2026 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్ 27, 2026 రాత్రి 11:59 గంటల వరకు అవకాశం ఉంటుంది. ఏపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్( https://portal-psc.ap.gov.in/ ) నుంచి ఈ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి. పూర్తిస్థాయి నోటిఫికేషన్ వివరాలు కూడా ఇదే వెబ్ సైట్ లో పొందొచ్చు.
163 ఖాళీలు - పోస్టుల వారీగా వివరాలు
- డిప్యూటీ కలెక్టర్లు : 11 పోస్టులు
- అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్: 14 పోస్టులు
- డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (సివిల్): 36
- డీఎస్పీ (కమ్యూనికేషన్స్): 03
- జిల్లా విద్యాధికారి (డీఈఓ): 14 పోస్టులు
- రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ (ఆర్‌టీఓ): 03
- జిల్లా గిరిజన సంక్షేమాధికారి: 01 పోస్టు
- డిప్యూటీ రిజిస్ట్రార్: 15 పోస్టులు
- మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-II: 12
- అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ / అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్: 02
- జిల్లా ఉపాధి కల్పనాధికారి: 03
- అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్: 14
- డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (డీఎల్‌డీఓ): 35 పోస్టులు
పలు కీలక మార్పులు…
ఈసారి ఏపీపీఎస్సీ ప్రకటించిన గ్రూప్-1 కేడర్ కేటాయింపుల్లో కొన్ని ముఖ్యమైన పరిపాలనా మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు గ్రూప్-1 జాబితాలో భాగమైన మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) పోస్టును ఈ సారి మినహాయించారు. అలాగే గతంలో ఉన్న జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) స్థానాన్ని డివిజనల్ డెవలప్‌మెంట్ అధికారి (డీఎల్‌డీఓ) పోస్టుతో భర్తీ చేశారు. వీటితో పాటు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) కమ్యూనికేషన్స్, జిల్లా విద్యాధికారి (డీఈఓ) వంటి కీలకమైన ఉద్యోగాలను కొత్తగా గ్రూప్-1 సర్వీసెస్ జాబితాలోకి తీసుకొచ్చారు.
గ్రూప్-1 పరిధిలోని మెజారిటీ పోస్టులకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అయితే డీఎస్పీ కమ్యూనికేషన్స్ వంటి సాంకేతిక పోస్టుకు ఇంజనీరింగ్ విభాగంలో సంబంధిత డిగ్రీ ఉత్తీర్ణత తప్పనిసరి చేశారు.
ప్రిలిమ్స్ పరీక్షను ఆఫ్‌లైన్ OMR విధానంలో రెండు పేపర్లుగా నిర్వహిస్తారు. పేపర్-1 లో జనరల్ స్టడీస్, పేపర్-2 లో జనరల్ ఆప్టిట్యూడ్ విభాగాలు ఉంటాయి. ప్రతి పేపర్‌లో 120 ప్రశ్నలకు గాను 120 మార్కులు కేటాయించారు. కేటాయించిన సమయం ప్రతి పేపర్‌కు 120 నిమిషాలు. నెగెటివ్ మార్కింగ్ విధానాన్ని అమలు చేస్తూ, ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కును కోత విధిస్తారు.
ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు డిస్క్రిప్టివ్ పద్ధతిలో 5 ప్రధాన పేపర్లు(మెయిన్స్) ఉంటాయి. అర్హత పరీక్షలుగా తెలుగు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ పేపర్లను నిర్వహిస్తారు. మెయిన్స్ సాధించిన అభ్యర్థులకు 75 మార్కులకు వ్యక్తిత్వ పరీక్ష లేదా ఇంటర్వ్యూ నిర్వహించి…. మొత్తం 825 మార్కులకు లభించిన ప్రతిభ ప్రాతిపదికన తుది ఎంపిక జాబితాను రూపొందిస్తారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

