ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిధిలోని మైనింగ్ సబ్ఆర్డినేట్ సర్వీస్లో ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏపీ మైనింగ్ సర్వీస్లో ల్యాబ్ అసిస్టెంట్ పోస్టు భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కమిషన్ పేర్కొంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఏపీపీఎస్సీ అధికారిక పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

నోటిఫికేషన్లో భాగంగా.. ల్యాబ్ అసిస్టెంట్ పోస్టును భర్తీ చేస్తున్నారు. నెలకు రూ. 35,570 నుంచి రూ. 1,09,910 వరకు పే-స్కేల్ వర్తిస్తుంది. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కెమిస్ట్రీ ప్రధాన అంశంగా B.Sc. డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల కనీస, గరిష్ఠ వయస్సును 01/07/2026 నాటికి లెక్కిస్తారు. రిజర్వేషన్ ఆధారిత వయోసడలింపుల వివరాలు సవివర నోటిఫికేషన్లో లభిస్తాయి.
ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ నవంబర్ 6 నుంచి ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేదీ నవంబర్ 26(రాత్రి 11:59 గంటల వరకు). అభ్యర్థులు కేవలం ఆన్లైన్ మోడ్ ద్వారా మాత్రమే దరఖాస్తులు సమర్పించాలి. ఇతర మార్గాల్లో పంపిన దరఖాస్తులు తిరస్కరిస్తారు.
ఈ పోస్టుకు ఎటువంటి స్క్రీనింగ్ టెస్ట్ ఉండదు. అభ్యర్థులకు నేరుగా ఒకే ఒక దశలో కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్ష విధానం మొత్తం మార్కులు 300 ఉంటాయి. పేపర్-1 జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ – 150 ప్రశ్నలు, 150 నిమిషాలు, 150 మార్కులకు ఉంటుంది. ఇక పేపర్-2లో కెమిస్ట్రీ (సబ్జెక్ట్) 150 ప్రశ్నలు, 150 నిమిషాలు, 150 మార్కులు ఉంటుంది.
ఈ రాత పరీక్షలో నెగెటివ్ మార్కుల విధానం అమల్లో ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3వ వంతు మార్కును కోత విధిస్తారు. రాత పరీక్షతో పాటు అభ్యర్థులకు 100 మార్కులకు గాను ప్రాక్టికల్ ప్రాఫిషియెన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. పూర్తిస్థాయి నోటిఫికేషన్, బ్రేక్-అప్ ఖాళీలు, ఇతర నిబంధనల కోసం అభ్యర్థులు ఎప్పటికప్పుడు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ను తనిఖీ చేయాలని అధికారులు సూచించారు.
{{/usCountry}}ఈ రాత పరీక్షలో నెగెటివ్ మార్కుల విధానం అమల్లో ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3వ వంతు మార్కును కోత విధిస్తారు. రాత పరీక్షతో పాటు అభ్యర్థులకు 100 మార్కులకు గాను ప్రాక్టికల్ ప్రాఫిషియెన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. పూర్తిస్థాయి నోటిఫికేషన్, బ్రేక్-అప్ ఖాళీలు, ఇతర నిబంధనల కోసం అభ్యర్థులు ఎప్పటికప్పుడు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ను తనిఖీ చేయాలని అధికారులు సూచించారు.
{{/usCountry}}