APPSC Group 1 Notification 2026 : ఏపీ గ్రూప్ 1 నోటిఫికేషన్ అప్డేట్ - నేటి నుంచి దరఖాస్తులు, పోస్టుల వారీగా ఖాళీల వివరాలి

APPSC Group 1 Notification 2026 : ఏపీ గ్రూప్‌-1 కింద 166 పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. అక్టోబర్ 27 వరకు గడువు ఉంటుంది. 

Published on: Oct 6, 2026, 08:06:49 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

APPSC Group 1 Notification 2026 : గ్రూప్ 1 ఉద్యోగమే లక్ష్యంగా కొలువుల సాధనకై ఎదురుచూస్తున్న ఉద్యోగార్థులకు ముఖ్యమైన అప్డేట్ వచ్చేసింది. మొత్తం 166 గ్రూప్-1 ఖాళీల భర్తీకి సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఇవాళ్టి నుంచి షురూ అయింది. అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 27, 2026 రాత్రి 11:59 గంటల వరకు తమ దరఖాస్తులను సమర్పించవచ్చు.

ఏపీపీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ అప్డేట్
ఏపీపీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ అప్డేట్

ఆసక్తి గల అభ్యర్థులు ఏపీపీఎస్సీ అధికారిక పోర్టల్ ( https://portal-psc.ap.gov.in/ లేదా https://psc.ap.gov.in ) ద్వారా ఓటీపీఆర్ (OTPR) నమోదు చేసుకుని, దరఖాస్తుల ప్రక్రియను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ సమగ్ర వివరాలను కూడా కమిషన్ వెబ్‌సైట్‌లోనే అందుబాటులో ఉంచారు.

గ్రూప్-1 పరిధిలోని అత్యధిక పోస్టులకు దరఖాస్తు చేసేందుకు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అయితే సాంకేతిక నైపుణ్యం అవసరమైన డీఎస్పీ కమ్యూనికేషన్స్ పోస్టుకు మాత్రం ఇంజినీరింగ్ విభాగంలో (ఈసీఈ, టెలికమ్యూనికేషన్స్ మొదలైనవి) సంబంధిత డిగ్రీ డిగ్రీ తప్పనిసరి చేశారు.

ఖాళీల వివరాలు…

  • డిప్యూటీ కలెక్టర్లు : 12 పోస్టులు
  • అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్: 14 పోస్టులు
  • డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (సివిల్): 36
  • డీఎస్పీ (కమ్యూనికేషన్స్): 03
  • జిల్లా విద్యాధికారి (డీఈఓ): 14 పోస్టులు
  • రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ (ఆర్‌టీఓ): 03
  • జిల్లా గిరిజన సంక్షేమాధికారి: 01 పోస్టు
  • డిప్యూటీ రిజిస్ట్రార్: 16 పోస్టులు
  • మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-II: 12
  • అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ / అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్: 02
  • జిల్లా ఉపాధి కల్పనాధికారి: 03
  • అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్: 15
  • డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (డీఎల్‌డీఓ): 35 పోస్టులు

ఈసారి ఏపీపీఎస్సీ ప్రకటించిన గ్రూప్-1 కేడర్ కేటాయింపుల్లో పరిపాలనాపరంగా కొన్ని ప్రధాన మార్పులు అమలు చేశారు. ఇప్పటివరకు గ్రూప్‌-1 కింద భర్తీ చేస్తున్న మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) పోస్టును ఈ సారి నోటిఫికేషన్ పరిధి నుంచి మినహాయించారు. అలాగే గతంలో సాధారణంగా ఉన్న జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) స్థానాన్ని ఈసారి డివిజనల్‌ డెవలప్‌మెంట్‌ అధికారి (డీఎల్‌డీఓ) పోస్టుతో భర్తీ చేయనున్నారు. వీటికి అదనంగా, సుదీర్ఘ కాలం తర్వాత డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీఎస్పీ) కమ్యూనికేషన్స్, జిల్లా విద్యాధికారి (డీఈఓ) వంటి అత్యంత కీలకమైన బాధ్యతలను కొత్తగా గ్రూప్‌-1 సర్వీసెస్ జాబితాలోకి చేర్చారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More