అక్టోబర్ 9 నుంచి ఏపీపీఎస్సీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుల దరఖాస్తులు.. ఇదిగో సిలబస్

APPSC Job Notification : ఏపీపీఎస్సీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అక్టోబర్ 9 నుంచే దరఖాస్తులు ప్రారంభం అవుతాయి. ఇక్కడ సిలబస్ కూడా చూడండి.

Published on: Oct 4, 2026, 19:18:20 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-II పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బ్యాక్‌వర్డ్ క్లాసెస్ (బీసీ) వెల్ఫేర్ సబార్డినేట్ సర్వీసెస్ విభాగాలోనే ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

ఏపీపీఎస్సీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు
ఏపీపీఎస్సీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు

అర్హత కలిగిన అభ్యర్థులు కమిషన్ అధికారిక వెబ్‌సైట్ (psc.ap.gov.in) ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం ఖాళీల సంఖ్య 73. ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం అక్టోబర్ 9 నుంచి అక్టోబర్ 29వ తేదీ రాత్రి 11:59 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వేతన స్కేలు రూ.37,640 నుంచి రూ.1,15,500 మధ్య ఉంటుంది.

ఏపీ సోషల్ వెల్ఫేర్ సబార్డినేట్ సర్వీస్-21, ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ సబార్డినేట్ సర్వీస్-23, ఏపీ బీసీ వెల్ఫేర్ సబార్డినేట్ సర్వీస్-29 పోస్టులు ఉన్నాయి. మొత్తం ఖాళీలు 73.

రాతపరీక్ష ద్వారానే ఎంపిక పూర్తి చేస్తారు. కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష ఉంటుంది. ఒకవేళ పరీక్షను బహుళ సెషన్లలో నిర్వహిస్తే నార్మలైజేషన్ విధానాన్ని పాటిస్తారు. రాత పరీక్షలో ప్రతీ తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కుల కోత ఉంటుంది.

పరీక్ష మొత్తం రెండు పేపర్లుగా ఆబ్జెక్టివ్ విధానంలో డిగ్రీ స్థాయిలో ఉంటుంది. పేపర్ - I (జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ): 150 ప్రశ్నలు - 150 నిమిషాలు - 150 మార్కులు, పేపర్ - II (ఎడ్యుకేషన్ - సబ్జెక్ట్): 150 ప్రశ్నలు - 150 నిమిషాలు - 150 మార్కులు ఉంటాయి.

అభ్యర్థులు రాత పరీక్షతో పాటు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా అర్హత సాధించాల్సి ఉంటుంది. ఈ ఆచరణాత్మక పరీక్ష 100 మార్కులకు 60 నిమిషాల వ్యవధిలో నిర్వహిస్తారు.

అభ్యర్థులు ఈ నియామక ప్రక్రియకు దరఖాస్తు చేసుకునే ముందు, కమిషన్ జారీ చేసిన సమగ్ర నోటిఫికేషన్, ఇతర సూచనలను జాగ్రత్తగా చదవాలి. అలాగే ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌లో వివరాలను సరిగ్గా నమోదు చేయాలి. అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్‌లైన్ విధానం ద్వారా మాత్రమే సమర్పించాలి. నిర్దేశించిన ఆన్‌లైన్ విధానం కాకుండా ఇతర పద్ధతుల్లో పంపిన దరఖాస్తులు ఏ పరిస్థితుల్లోనూ పరిగణించరు.

చివరి నిమిషంలో తలెత్తే రద్దీని నివారించడానికి, గడువు తేదీకి ముందే ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించాలని అభ్యర్థులకు అధికారులు సూచించారు. అభ్యర్థుల సౌలభ్యం కోసం, ఈ పరీక్షకు సంబంధించిన సమగ్ర విధానం, సిలబస్ ఈ నోటిఫికేషన్‌కు జతచేశారు.

సిలబస్

అంతర్జాతీయ, జాతీయ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయికి సంబంధించిన ముఖ్యమైన సమకాలీన సంఘటనలు, అంశాలు చూసుకోవాలి. సాధారణ విజ్ఞానశాస్త్రం, దైనందిన జీవితంలో దాని అనువర్తనాలు, విజ్ఞానశాస్త్రం, సాంకేతికత మరియు సమాచార సాంకేతికత రంగాలలో సమకాలీన పరిణామాలు ఫాలో కావాలి.

భారతీయ చరిత్ర – సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మరియు రాజకీయ కోణాలలో ఈ అంశంపై సమగ్ర అవగాహనకు ప్రాధాన్యత ఇస్తారు. ఇందులో ఆంధ్రప్రదేశ్, భారత జాతీయ అంశాలపై ప్రత్యేక దృష్టి ఉంటుంది. భారతదేశ భౌగోళిక శాస్త్రం.. ఆంధ్రప్రదేశ్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి.

భారత రాజకీయ వ్యవస్థ మరియు పరిపాలన: రాజ్యాంగపరమైన అంశాలు, ప్రజా విధానాలు, సంస్కరణలు, ఇ-గవర్నెన్స్ కార్యక్రమాలు.

భారత ఆర్థిక వ్యవస్థ-ప్రణాళిక, సుస్థిర అభివృద్ధి-పర్యావరణ పరిరక్షణ విపత్తు నిర్వహణ: vulnerability ప్రొఫైల్, నివారణ-ఉపశమన వ్యూహాలు, విపత్తు అంచనాలో రిమోట్ సెన్సింగ్-GIS వినియోగం. తార్కిక ఆలోచనా విధానం, విశ్లేషణాత్మక సామర్థ్యం-తార్కిక వివరణ. డేటా అనాలసీస్: Tabulation of data Visual representation of data Basic dataanalysisను అభ్యర్థులు చదువుకోవాలి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More