తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్ష విధానంలో మార్పులు.. 20 శాతం ఇంటర్నల్ మార్కులు
తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్ష విధానంలో ఈ ఏడాది నుంచి భారీగా మార్పులు చేశారు... 20 శాతం ఇంటర్నల్ మార్కులు కేటాయిస్తూ ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది.
తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యా విధానాన్ని ఆధునీకరించేందుకు, విద్యార్థులలో నైపుణ్యాలను పెంపొందించేందుకు తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి(TGBIE) విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు 20 శాతం ఇంటర్నల్ అసెస్‌మెంట్, మిగిలిన 80 శాతం మార్కులను థియరీ పరీక్షలకు కేటాయిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది.

కేవలం వార్షిక రాత పరీక్షలలో సాధించే మార్కులపైనే కాకుండా, విద్యార్థి ఏడాదంతటా ప్రదర్శించే ప్రతిభ, క్రియాశీలత, సృజనాత్మకతలకు ప్రాధాన్యత ఇచ్చేలా ఈ మార్పులను రూపొందించారు. విద్యార్థుల్లో అవగాహనా రాహిత్యాన్ని నివారించేందుకు, అప్లైడ్ లెర్నింగ్‌ను ప్రోత్సహించేందుకు ప్రధాన సబ్జెక్టులలో మార్పులు అమలులోకి వచ్చాయి.
ఆర్ట్స్, కామర్స్ అండ్ లాంగ్వేజెస్:హ్యూమానిటీస్ (పాలిటిక్స్, హిస్టరీ, ఎకనామిక్స్ మొదలైనవి), కామర్స్, భాషా సబ్జెక్టులు (తెలుగు, సంస్కృతం, ఇంగ్లీష్) రాత పరీక్షలు 100 మార్కుల నుంచి 80 మార్కులకు తగ్గాయి. మిగిలిన 20 మార్కులను ఇంటర్నల్ అసెస్‌మెంట్ ద్వారా కేటాయిస్తారు.
గణితం : మ్యాథ్స్ 1A, 1B పేపర్లలో రాత పరీక్షను 75 మార్కుల నుండి 60 మార్కులకు కుదించారు. మిగిలిన 15 మార్కులను యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ రూపంలో ఇంటర్నల్ మార్కులుగా ఇస్తారు. (రెండు పేపర్లు కలిపి మొత్తం 30 మార్కులు).
సైన్స్ గ్రూపుల్లో ఫస్ట్ ఇయర్ నుంచే ప్రయోగ పరీక్షలకు ప్రాధాన్యం పెంచుతూ ప్రత్యేక ఇంటర్నల్ మార్కులు/ప్రాక్టికల్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఎంఈసీ విద్యార్థులకు ప్రత్యేకంగా వంద మార్కులు పేపర్‌లో 80 థియారీ, 20 ఇంటర్నల్స్‌కు ఉటాయి.
కామన్ వాలిడేషన్ రూల్స్
ఈ కొత్త విధానాన్ని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ జూనియర్ కళాశాలల్లో ఒకే రకంగా, పారదర్శకంగా అమలు చేయడం కోసం TGBIE ప్రత్యేకంగా కామన్ వాలిడేషన్ రూల్స్(CVR) జారీ చేసింది. ఇంటర్నల్ అసెస్‌మెంట్ పరీక్షలు ఎలా నిర్వహించాలి, ఆ మార్కులను ఏ విధంగా రికార్డుల్లో నమోదు చేయాలి, బోర్డుకు ఏ విధంగా సమర్పించాలి అనే అంశాలపై స్పష్టమైన నిబంధనలను పొందుపరిచారు.
యజమాన్యాలకు, అధ్యాపకులకు ఎదురయ్యే అనుమానాలను నివృత్తి చేసేందుకు ఎఫ్‌ఏక్యూలు కూడా అందుబాటులో ఉంచారు. మారుతున్న విధానానికి అనుగుణంగా TGBIE ఇప్పటికే ఫస్ట్ ఇయర్ కరికులమ్, పాఠ్యపుస్తకాలను సవరించింది. ఈ సంస్కరణల ప్రధాన లక్ష్యాలు విద్యార్థులు కేవలం పుస్తకాల్లోని సమాచారాన్ని బట్టీ పట్టకుండా, తార్కిక ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందించుకోవడం. ఏడాది చివరిలో జరిగే బోర్డు పరీక్షల ఒత్తిడిని తగ్గించి, సంవత్సరం పొడవునా విద్యార్థుల భాగస్వామ్యాన్ని పెంచడం టార్గెట్ పెట్టుకుంది ఇంటర్ బోర్డు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


