జులై 6న గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్పాట్ కౌన్సెలింగ్

ఎస్సీ గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్​లో మిగిలిన సీట్ల భర్తీకి ఈ నెల 6న స్పాట్ కౌన్సెలింగ్ జరగనుంది. జిల్లా స్థాయిలో స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.

Updated on: Jul 4, 2026, 14:54:53 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణలోని సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో మిగిలిపోయిన సీట్ల భర్తీకి ముహూర్తం ఖరారైంది. జులై 6వ తేదీన జిల్లా స్థాయిలో స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు గురుకుల సంస్థ సెక్రటరీ కంభంపాటి శారద ఒక ప్రకటనలో వెల్లడించారు. అర్హత కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

గురుకులాల్లో స్పాట్ కౌన్సెలింగ్ (unsplash)
గురుకులాల్లో స్పాట్ కౌన్సెలింగ్ (unsplash)

గురుకుల కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఆర్‌జేసీసీఈటీ-2026 ప్రవేశ పరీక్ష ఆధారంగా ఇప్పటికే రెండు విడతల కౌన్సెలింగ్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. అయితే రెండు దశల అడ్మిషన్లు ముగిసినప్పటికీ కొన్ని కళాశాలల్లో ఇంకా కొన్ని ఇంటర్ సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే విద్యార్థులకు మరో అవకాశం కల్పిస్తూ నేరుగా సీట్లను భర్తీ చేసేందుకు స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించాలని గురుకుల సొసైటీ నిర్ణయించింది.

ఈ స్పాట్ కౌన్సెలింగ్ ప్రక్రియను జిల్లా స్థాయిలో నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఖాళీగా ఉన్న సీట్ల వివరాలను పరిశీలించి, ఆయా జిల్లాల పరిధిలోనే ఈ అడ్మిషన్ల ప్రక్రియ సాగుతుంది. ఆర్‌జేసీసీఈటీ రాసి, ఇప్పటివరకు సీటు రాని విద్యార్థులు లేదా అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు తమ స్వంత జిల్లాల్లో జరిగే ఈ కౌన్సెలింగ్‌కు నేరుగా హాజరుకావచ్చు. అందుబాటులో ఉన్న ఖాళీలను బట్టి అక్కడికక్కడే సీట్లను కేటాయిస్తారు.

కౌన్సెలింగ్‌కు తీసుకురావాల్సిన పత్రాలు

స్పాట్ కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులు తమ వెంట ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు జిరాక్స్ కాపీలను తప్పనిసరిగా తీసుకురావాలని అధికారులు సూచించారు. తీసుకురావాల్సిన ముఖ్యమైన పత్రాల వివరాలు. స్టడీ సర్టిఫికేట్స్, కులం ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, నివాస ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ సైజు ఫొటోలతోపాటుగా ఇతర సర్టిఫికేట్లు ఏమైనా ఉంటే తీసుకెళ్లాలి.

గురుకులాల్లో నాణ్యమైన విద్యతో పాటు ఉచిత వసతి సౌకర్యాలు లభిస్తుండటంతో ఈ స్పాట్ కౌన్సెలింగ్‌కు విద్యార్థుల నుంచి భారీ పోటీ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆసక్తి గల విద్యార్థులు జూలై 6న నిర్దేశిత సమయానికి అవసరమైన పత్రాలతో కౌన్సెలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని గురుకుల సంస్థ స్పష్టం చేసింది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More